E-Paper
Advertisement

Ram Charan : షూటింగ్ లో ప్రమాదం.. స్వల్ప గాయలతో బయటపడ్డ రామ్ చరణ్..

Ram Charan : షూటింగ్ లో ప్రమాదం.. స్వల్ప గాయలతో బయటపడ్డ రామ్ చరణ్..
Advertisement

Ram Charan : టాలీవుడ్ స్టార్ హీరో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు షూటింగ్లో ప్రమాదం జరిగింది అంటూ సోషల్ మీడియాలో వార్త ప్రస్తుతం ప్రచారంలో ఉంది.. రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ లో వస్తున్న పెద్ది సినిమా షూటింగ్ సమయంలో గాయం తగిలినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే ఈ విషయాన్ని ఎక్కడ చిత్రి యూనిట్ ప్రకటించలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త ద్రావణం వ్యాపిస్తుంది. అందుకే షూటింగు ఆలస్యం అయింది అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్.. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ.. ప్రస్తుతం మెగా ఫాన్స్ మాత్రం రామ్ చరణ్ కి ఎక్కడ గాయమైంది అని టెన్షన్ పడిపోతున్నారు. అసలు రామ్ చరణ్ కి ఎప్పుడు గాయమైంది? ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉంది అన్నది మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

‘పెద్ది’ షూటింగ్ లో ప్రమాదం..

గేమ్ చేంజర్ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మారడంతో తర్వాత సినిమాపై ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని పెద్ది సినిమాలో నటిస్తున్నాడు. ఉప్పెన చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించిన డైరెక్టర్ బుచ్చిబాబు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.. ఈ క్రమంలో రామ్ చరణ్ కు ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఆ ప్రమాదంలో హీరో కంటిపైన గాయం అయినట్లు తెలుస్తుంది. కానీ, అది స్వల్పమైనదేనని చెబుతున్నారు. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సోషల్‌మీడియాలో పోస్టులు షేర్‌ చేస్తున్నారు. దానివల్ల ఆయన రెండు రోజుల పాటు గ్యాప్ తీసుకొని మళ్ళీ షూటింగ్ సెట్ లోకి అడుగుపెట్టినట్లు సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే చరణ్‌తో ఉన్న కీలక సన్నివేశాలను మేకర్స్‌ చిత్రీకరిస్తున్నారు.. రెండు పాటలు మిగిలి ఉన్నాయి. వాటిని త్వరగా పూర్తి చేసి సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం..

Advertisement

Also Read : రాంగ్ స్టెప్ తీసుకోబోతున్న హీరో.. ఇలా అయితే కష్టమే గురు..

రామ్ చరణ్ బర్త్ డే సర్ప్రైజ్ రెడీ.. 

గతంలో ఎన్నడూ కనిపించని లుక్ లో ఈ మూవీలో రామ్ చరణ్ కనిపిస్తున్నాడు. గ్రామీణ నేపథ్యంలో జరిగే స్పోర్ట్స్‌ డ్రామా మూవీగా ‘పెద్ది’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్‌, బాలీవుడ్‌ నటుడు దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు.. ఈ మూవీ ఏప్రిల్ 30న రాబోతుందని ముందుగా ప్రకటించిన కూడా కొన్ని కారణాలవల్ల సినిమాను మే నెలలో రిలీజ్ చేసేందుకు మేకప్ ఫిక్స్ చేశారు. అయితే ఈ నెల 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి టీజర్ విడుదల కానుందని వార్తలు వినిపిస్తున్నాయి.. అలాగే మూవీ నుంచి మరో సాంగ్ కూడా రిలీజ్ కాబోతుందని సమాచారం. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మెగా ఫ్యాన్స్ కి డబల్ ట్రీట్.. ఇకపోతే ఇప్పటివరకు ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రతి అప్డేట్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా రిలీజ్ అయిన రెండు పాటలు యూట్యూబ్ లో బాగా ట్రెండ్ అవుతున్నాయి కూడా. రిలీజ్ అయ్యాక ఈ సినిమా ఎలాంటి టాక్ని సొంతం చేసుకుంటుందో చూడాలి..

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×