Actress Himaja : తెలుగు సినీ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు హిమజ.. ఒకప్పుడు సీరియల్స్ తో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ. ఈమధ్య సినిమాలలో ఎక్కువగా కనిపిస్తూ బిజీగా ఉంది.. ఈమె ఇప్పటివరకు చిత్రాలహరి, వినయ విధేయ రామ, జంబలకడిపంబ, ఉన్నది ఒక్కటే జిందగీ, వరుడు కావలెను, స్పైడర్ ఇలా పలు సినిమాలలో నటించి హిమజ మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. కేవలం సినిమాలో సీరియల్స్ మాత్రమే కాదు టాప్ రియాలిటీ షో అయిన బిగ్ బాస్ లో కూడా ఈ ముద్దుగుమ్మ పాల్గొన్నారు.. తన డేరింగ్ ఆటిట్యూడ్ తో జనాలని బాగా ఆకట్టుకునింది. ఈమధ్య సినిమాలు కన్నా కూడా ఎక్కువగా బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు స్పెషల్ ఈవెంట్లలో సందడి చేస్తూ కనిపిస్తుంది.. సోషల్ మీడియాలో కూడా హిమజ ఆక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది. అయితే ఈమె ఇప్పటివరకు ఎంత ఆస్తిని సంపాదించుకుంది అన్నది ప్రస్తుతం ఇంటర్నెట్లో హాట్ టాపిక్ గా మారింది.. మరి హిమజ ఆస్తుల వివరాల గురించి మనం ఒకసారి ఇప్పుడు తెలుసుకుందాం..
సినీ నటి హిమజ స్టార్ హీరోల సినిమాలలో సైడ్ క్యారెక్టర్లలో నటిస్తూ బాగానే ఫేమస్ అయ్యింది. ఒకప్పుడు సీరియస్ తో బాగా క్రియేట్ ని సంపాదించుకున్న ఈమె సినిమాలలో అంతకుమించి ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంది.. చేతినిండా సినిమాలు అలాగే బుల్లితెర షోలతో ప్రస్తుతం ఫుల్ బిజీగా గడుపుతుంది హిమజా. అయితే ఈమె ఆస్తుల గురించి సోషల్ మీడియాలో ఓ వార్త గత కొద్ది రోజులుగా ప్రచారంలో ఉంది. గతంలో ఆమె కారు కొన్న తర్వాత అంతా డబ్బులు ఆ మీ దగ్గర ఎలా వచ్చాయి అన్న వార్తలు వినిపించాయి. ఆ వార్తలు పై స్పందించిన హిమజ తాను కష్టపడి సంపాదించుకున్నానని అడ్డదారులు ఏవి తొక్క లేదంటూ గట్టిగానే సమాధానం చెప్పింది. అయితే ఆమె వరుసగా సినిమాలు షాపింగ్ మాల్ ఓపెనింగ్ చేస్తూ రెండు చేతుల సంపాదిస్తుంది. ఇప్పటివరకు సొంత ఇల్లు, అలాగే కారు, బంగారం బాగానే సంపాదించుకుంది.. అంతేకాదు సొంత ఊర్లో ఆమెకు స్థలాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది.. ఏది ఏమైనా కూడా సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకొని ఇలా ఆస్తులు వెనకేసుకోవడం మామూలు విషయం కాదు అంటూ కొందరు నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Also Read :ఎట్టకేలకు ఇంట్లోకి వచ్చేసిన ప్రభా.. మీనాకు కండీషన్.. రోహిణి ప్లాన్ అదుర్స్..
టాలీవుడ్ క్రేజీ యాక్టర్ హిమజ చిరునవ్వు వెనకాల కన్నీళ్లు తెప్పించే స్టోరీ కూడా ఉందన్న విషయం అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు.. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె బ్రేకప్ స్టోరీని బయటపెట్టిన విషయం తెలిసిందే. ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. హిమజ ప్రేమ,పెళ్లి పై పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. నిజానికి ప్రస్తుతం తను ప్రేమ, పెళ్లి గురించి పట్టించుకోవడం లేదని, తన దృష్టి మొత్తాన్ని ప్రస్తుతం తన కెరీర్ మీదనే పెట్టినట్టు తెలిపింది.. జీవితంలో ఒకసారి లవ్ చేస్తే అది లైఫ్ లాంగ్ అలాగే ఉంటుంది. అది సినిమాలలో నటించే క్యారెక్టర్ లాంటిది కాదు అని క్లారిటీ ఇచ్చింది.. అంతే కాదు స్కూల్లో ఉన్నప్పుడు ఆమె బ్రేకప్ స్టోరీ ని కూడా పంచుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురించేసింది. ఇకపోతే ప్రస్తుతం ఈమె కెరియర్ విషయానికొస్తే.. షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ తో పాటుగా బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు ఫెస్టివల్ ఈవెంట్లలో సందడి చేస్తుంది. అంతే కాదు సినిమాలలో కూడా నటిస్తూ జనాలని ఎంటర్టైన్ చేస్తూ వస్తుంది..