E-Paper
Advertisement

పెద్ది రాకతో చిరు సినిమాకు లైన్ క్లియర్…విశ్వంభర రిలీజ్ అప్పుడేనా?

పెద్ది రాకతో చిరు సినిమాకు లైన్ క్లియర్…విశ్వంభర రిలీజ్ అప్పుడేనా?
Advertisement

Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి హీరోగా బింబిసార దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం విశ్వంభర (Vishwambhara). యు వి క్రియేషన్ బ్యానర్ పై తెరుకెక్కిన ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల వాయిదా పడుతూ వస్తుంది. ఈ సినిమాలో ఎక్కువ భాగం విఎఫ్ఎక్స్ విజువల్స్ ఉన్న నేపథ్యంలో మంచి క్వాలిటీ కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ సినిమా విడుదల ఆలస్యం అవుతూ వస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమా విడుదలకు సంబంధించి ఏ విధమైనటువంటి అధికారిక ప్రకటన మాత్రం వెలబడలేదు. నిజానికి ఈ సినిమా గత ఏడాది ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా విఎఫ్ఎక్స్ పనులు పూర్తికాని నేపథ్యంలో వాయిదా పడుతూ వస్తుంది.

ఒకే నెలలోనే రెండు మెగా హీరోల సినిమాలు..

తాజాగా విశ్వంభర సినిమా విడుదలకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా పెద్ది (Peddi) సినిమాతో పాటు జూన్ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు సమాచారం. ఇన్ని రోజులు పెద్ది సినిమా విడుదల తేదీ పై సరైన స్పష్టత లేని నేపథ్యంలో విశ్వంభర విడుదల గురించి కూడా చిత్ర నిర్మాతలు అయోమయంలో పడ్డారు. ఇక ప్రస్తుతం పెద్ది సినిమా విడుదల విషయంలో క్లారిటీ వచ్చిన నేపథ్యంలో విశ్వంభర విడుదల తేదీపై కూడా స్పష్టత వచ్చిందని చెప్పాలి.

విశ్వంభరకు లైన్ క్లియర్..

Advertisement

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పెద్ది. ఈ సినిమా ఏప్రిల్ 30వ తేదీ విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ జూన్ 4వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇలా ఈ సినిమా విడుదల తేదీ ఖరారు చేయటంతో విశ్వంభర సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయిందని చెప్పాలి. ఇండస్ట్రీ సమాచారం ప్రకారం జూన్ 10వ తేదీ చిరంజీవి విశ్వంభర సినిమాని విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్టు తెలుస్తుంది.

జూన్ 10న రాబోతున్న విశ్వంభర…

Advertisement

జూన్ 10వ తేదీ ఈ సినిమా విడుదల అయితే తదుపరి జూన్ 26వ తేదీ వరకు ఏ విధమైనటువంటి సినిమాలు విడుదల కానీ నేపథ్యంలో విశ్వంభర సినిమాకు ఇది సరైన విడుదల సమయమని నిర్మాతలు భావించినట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాని అనుకున్న విధంగానే జూన్ 10వ తేదీ విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీకి సంబంధించి అధికారక ప్రకటన రాబోతోంది. విశ్వంభర సినిమా 14 లోకాల నేపథ్యంలో కొనసాగే అద్భుతమైన ఫాంటసీ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో చిరంజీవి అద్భుతమైన శక్తులు ఉన్నటువంటి వ్యక్తిగా కనిపించబోతున్నారని చెప్పాలి. ఈ సినిమాలో పంచభూతాలను ఏకం చేసే ఓ కాలచక్రం ప్రధాన పాత్రను పోషించనుంది. మొత్తానికి ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా త్రిష హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.

Also Read: ఘనంగా బండ్ల గణేష్ కూతురి నిశ్చితార్థం… హాజరైన సినీ ప్రముఖులు!

Related News

పవన్ ఫ్యాన్స్‌కి పూనకాలే.. OG యూనివర్స్ నుంచి అదిరిపోయే ట్రీట్!

‘రోమాంచకం’కు రెండో రోజే షాక్.. కలెక్షన్లు ఇలా పడిపోయాయేంటి?

డాన్సర్స్ అసోసియేషన్‌లో మళ్లీ రచ్చ.. సుమలతపై రఘు మాస్టర్ కౌంటర్!

డ్రాగన్ పై ప్రశాంత్ నీల్ బిగ్ అప్డేట్…స్పీడుమీదున్న తారక్!

ఏంటి నాని.. ఇంత హైప్ అవసరమా? ‘ది ప్యారడైజ్’పై అప్పుడే డౌట్స్!

సినిమాలోనే మ్యాజిక్ ఉంది…ఆకట్టుకుంటున్న ఎపిక్ ట్రైలర్!

రూ.10 లక్షల ఇన్సూరెన్స్.. రూ.5 వేల పెన్షన్.. నట్టి కుమార్ ఆఫర్ ఇదే!

సమ్మర్ హీట్‌లో ప్రగ్యా జైస్వాల్ స్పెషల్ ట్రీట్.. నెట్టింట వైరల్!

Big Stories

Advertisement
×