E-Paper
Advertisement

రాత్రి పూట కేవలం పండ్లు మాత్రమే తింటున్నారా? అయితే ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి!

రాత్రి పూట కేవలం పండ్లు మాత్రమే తింటున్నారా? అయితే ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి!

Side effects of eating fruits at night: ప్రస్తుతం బరువు తగ్గాలనే ఆరాటంతో చాలా మంది రాత్రి భోజనానికి బదులుగా కేవలం పండ్లను మాత్రమే తింటున్నారు. పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి అనడంలో సందేహం లేదు. కానీ డిన్నర్ సమయంలో కేవలం పండ్లపైనే ఆధారపడటం వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు అందవు. దీని వల్ల జీర్ణ క్రియ మందగించడం, రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగడం వంటి సమస్యలు తలెత్తుతాయి. రాత్రివేళ పండ్లు మాత్రమే తినడం ఎందుకు సరైన పద్ధతి కాదో.. దాని వల్ల కలిగే ఆరోగ్య ఇబ్బందులేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

రాత్రి భోజనంలో కేవలం పండ్లు మాత్రమే తింటే కలిగే నష్టాలు:

చాలా మంది పండ్లను తేలికపాటి ఆహారంగా భావిస్తారు. అయితే.. రాత్రి పూట మన శరీరానికి కావాల్సిన పోషకాల సమతుల్యత దెబ్బతింటే అది దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. దానికి గల ప్రధాన కారణాలు ఇవే..

1.ప్రోటీన్, కొవ్వుల లోపం:
పండ్లలో విటమిన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి కానీ.. కండరాల మరమ్మత్తుకు అవసరమైన ప్రోటీన్, హార్మోన్ల సమతుల్యతకు కావాల్సిన ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండవు. రాత్రి వేళ శరీరం తనను తాను రీపేర్ చేసుకుంటుంది. ఆ సమయంలో.. కేవలం పండ్లు మాత్రమే ఇస్తే, శరీరానికి తగినంత పోషకాలు అందక కండరాల బలహీనత ఏర్పడుతుంది.

2.రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం:
పండ్లలో ఫ్రక్టోజ్ అనే సహజ చక్కెర ఉంటుంది. రాత్రి పూట శారీరక శ్రమ తక్కువగా ఉంటుంది కాబట్టి.. పండ్లు తిన్న వెంటనే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు వేగంగా పెరుగుతాయి. ఇది ఇన్సులిన్ నిరోధకతకు దారితీస్తుంది. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారికి లేదా ప్రీ-డయాబెటిక్ దశలో ఉన్నవారికి ఇది చాలా ప్రమాదకరం.

3. నిద్రలేమి సమస్య:
అధికంగా చక్కెర ఉండే పండ్లను రాత్రి పూట తీసుకోవడం వల్ల శరీరానికి శక్తి అందుతుంది. దీని వల్ల మెదడు చురుగ్గా మారి, గాఢ నిద్రకు ఆటంకం కలుగుతుంది. అంతేకాకుండా.. పండ్లు తిన్న కొద్ది సేపటికే మళ్లీ ఆకలి వేయడం వల్ల అర్థరాత్రి నిద్రలేచి ఏవో ఒకటి తినే అలవాటు మొదలవుతుంది.

4.జీర్ణక్రియ, అసిడిటీ :
కొన్ని రకాల పండ్లు (ముఖ్యంగా సిట్రస్ పండ్లు) రాత్రి పూట తింటే కడుపులో.. యాసిడ్ స్థాయిలు పెరుగుతాయి. దీనివల్ల గుండెల్లో మంట, అసిడిటీ సమస్యలు వస్తాయి. ఆయుర్వేదం ప్రకారం కూడా.. సూర్యాస్తమయం తర్వాత పండ్లు తీసుకోవడం వల్ల శరీరంలో ‘కఫం’ పెరిగే అవకాశం ఉంది.

Also Read: రూపాయి ఖర్చు లేకుండా.. క్షణాల్లోనే చెదలను వదిలించే అద్భుతమైన మార్గాలు ఇవే!

5. పోషకాహార అసమతుల్యత :
మనం తినే ఆహారం ‘సమతుల్యంగా’ ఉండాలి. ఒక పూట భోజనంలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు,ఫైబర్ సరైన నిష్పత్తిలో ఉండాలి. కేవలం పండ్లనే డిన్నర్‌గా తీసుకోవడం వల్ల శరీరం ఇతర పోషకాలను కోల్పోతుంది. ఇది జీవక్రియ మందగించడానికి కారణమవుతుంది.

సరైన మార్గం ఏంటి?
మీరు పండ్లు తినాలనుకుంటే.. వాటిని సాయంత్రం స్నాక్స్‌గా లేదా ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకోవడం బెస్ట్. రాత్రి పూట  జొన్న రొట్టె, ఉడికించిన కూరగాయలు, లేదా పప్పు వంటివి తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. ఒకవేళ పండ్లు తినాల్సి వస్తే.. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫ్రూట్స్ తినండి. వాటితో పాటు కొన్ని డ్రై ఫ్రూట్స్ కలిపి తీసుకోండి.

Tags

Related News

ప్రతి తండ్రి తన కుమారుడికి ఈ జీవిత పాఠాలు తప్పనిసరిగా నేర్పాలి.. పిల్లల వ్యక్తిత్వానికి ఇవి చాలా అవసరం

శ్రమ లేకుండా టిఫిన్ స్నాక్స్ రెడీ.. కరకరలాడే సూపర్ టేస్టీ రవ్వ కట్లెట్ రెసిపీ

పెరుగు తినేటప్పుడు అందరూ చేసే తప్పులు ఇవే.. ఎలా తినాలో చెప్పిన డాక్టర్

బ్యూటీ ప్రొడక్ట్స్ ఎక్కువగా వాడుతున్నారా? ఈ కొత్త ట్రెండ్ గురించి తెలిస్తే షాకవుతారు!

ఏసీలో పడుకుంటే తలనొప్పి వస్తోందా? నిపుణులు చెబుతున్న అసలు కారణాలివే!

టీనేజర్ల ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్న ఎనర్జీ డ్రింక్స్.. తస్మాత్ జాగ్రత్త!

ఇంటి బయట ॐతో పాటు ఈ నాలుగు చిహ్నాలుంటే.. మీ జీవితంలో సుఖ సంతోషాలే

మార్కెట్‌ నుంచి తెచ్చిన మొక్కలు ఇంట్లో ఎండిపోతున్నాయా? ఈ టిప్స్ పాటిస్తే ఏళ్ల తరబడి పచ్చగా పెరుగుతాయి

Big Stories

×