E-Paper
Advertisement

త్రివిక్రమ్ ఆ తప్పు ఎందుకు చేశాడు..? వెంకీ ఫ్యాన్స్ హర్ట్..!

త్రివిక్రమ్ ఆ తప్పు ఎందుకు చేశాడు..? వెంకీ ఫ్యాన్స్ హర్ట్..!
Advertisement

Adarshakutumbam : తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని సంపాదించుకున్న డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తన డైలాగులతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వచ్చిన ఈ డైరెక్టర్ ఈమధ్య సరైన హిట్ సినిమా లేకపోవడంతో కాస్త గ్యాప్ తీసుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ తో ఈయన సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఆ సినిమా పేరే ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47’.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన ప్రతి అప్డేట్ కూడా జనాలని విపరీతంగా ఆకట్టుకుంటూ వస్తున్నాయి. రెండుసార్లు వాయిదా వేసుకున్న ఈ సినిమా ఈనెల 30వ తారీఖున థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమవుతుంది. తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ఆ ట్రైలర్ ని చూసిన వెంకీ అభిమానులు త్రివిక్రమ్ ఇలాంటి తప్పు చేస్తాడని అస్సలు అనుకోలేదు అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు. త్రివిక్రమ్ చేసిన తప్పేంటి? ట్రైలర్ లో ఏదైనా మిస్టేక్ కనిపించిందా? అసలు ఏం జరిగింది అన్నది కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..

 త్రివిక్రమ్ హిట్ కొడతాడా..? 

టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తన మార్క్ డైలాగులతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ వస్తున్నాడు. అయితే ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలలో హీరోలు ఎక్కువగా రిచ్ గా కనిపిస్తూనే ఉన్నారు. కానీ ఆదర్శ కుటుంబం సినిమాలో వెంకటేష్ ఒక సాదాసీదా వ్యక్తిగా కనిపించడం ఏంటో అని త్రివిక్రమ్ అభిమానుల సైతం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పట్లాగే తన మార్క్ కనిపించేలా చూపించట్లేదా? వెంకీ మీద నమ్మకంతోనే ఇలాంటి స్టోరీని ఎంచుకున్నారా? కామెడీ అంతా ఓకే కానీ కాన్సెప్ట్ కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది అంటూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటివరకు వచ్చిన ఈ సినిమా అప్డేట్స్ అన్ని జనాలని బాగానే ఆకట్టుకుంటూ వచ్చాయి. మరి ఈ మూవీ ఏ విధంగా ఆకట్టుకుంటుందో అన్నది తెలియాలి అంటే ఈ నెల 30వ తేదీ వరకు వేచి ఉండాల్సిందే..

‘ఆదర్శకుటుంబం’ సినిమా విషయానికొస్తే.. 

Advertisement

టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ అంటే కామెడీకి కేరాఫ్ అడ్రస్ అని అందరికీ తెలిసిందే. తన కామెడీ డైలాగులతో యాక్షన్ సన్నివేశాలతో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాడు వెంకీ. అయితే ఆదర్శ కుటుంబం సినిమాలో డిఫరెంట్ గా స్టోరీ ఉండడంతో వెంకీ మార్క్ మరింత పెరుగుతుంది అని కొందరు అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు వచ్చిన ట్రైలర్లు టీజర్లను చూస్తుంటే వెంకటేష్ ఎప్పటిలాగే తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించేందుకు రెడీ అవుతున్నాడని అర్థమవుతుంది. ఇక ఈ సినిమా పాజిటివ్ వైబ్స్ ని సొంతం చేసుకుంది. గత కొద్ది రోజులుగా సినిమా కోసం ఫాన్స్ వెయిట్ చేస్తున్నారు తాజాగా నిన్న రిలీజ్ అయిన ట్రైలర్ జనాలని బాగానే ఆకట్టుకుంటూ వచ్చింది. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్లో భారీ వ్యూస్ ని సొంతం చేసుకుంటూ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. మరి ఈ సినిమా ఎలాంటి టాక్ని సొంతం చేసుకుంటుందో అన్నది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.. ఇక వెంకటేష్ సినిమాల విషయానికొస్తే ఈయన టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో జనవరి 12 విడుదల అనే సినిమాలో నటిస్తున్నాడు. ఆ తర్వాత మరొక సినిమాలో నటించేందుకు సైన్ చేసినట్టు సమాచారం. ఇక త్రివిక్రమ్ విషయానికొస్తే ఎన్టీఆర్ తో ఓ సినిమా చేసేందుకు కథని సిద్ధం చేస్తున్నాడు అన్న వార్తలు వినిపిస్తున్నాయి.

Related News

బాలయ్య లెక్క తప్పదు.. స్టార్ హీరో సినిమాలో గెస్ట్ రోల్..?

ప్రభాస్ చేతిలో గన్.. ‘ఫౌజీ’ పోస్టర్ మామూలుగా లేదుగా!

ప్రేమ, పెళ్లి గురించి వెంకీ మామ కామెడీ.. స్టేజ్ మీద నవ్వులే నవ్వులు!

ప్రభాస్ సలార్ 2 షూటింగ్ పై ప్రశాంత్ నీల్ బిగ్ అప్డేట్!

ఆదర్శ కుటుంబం ట్రైలర్ వచ్చేసింది.. కథలో ఏదో కొత్తగా ఉందే!

రాధేశ్యామ్ లాగా తీస్తే బాగుండదుగా.. ప్రభాస్ పై పంచ్ వేసిన ప్రశాంత్ నీల్!

కళే నా ప్రాణం.. కానీ నన్నే మోసం చేశారు.. గరివిడి లక్ష్మి కన్నీటి కథ!

Big Stories

Advertisement
×