Shreyas Iyer Wrapped In Towel: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ (New Zealand vs India) మధ్య ఐదు మ్యాచ్ టి20 సిరీస్ (India tour of New Zealand 2026 ) కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే తొలి మ్యాచ్ గెలిచిన టీమిండియా… శనివారం రెండవ మ్యాచ్ కోసం సిద్ధమవుతోంది. ఇలాంటి క్రమంలో టీమిండియా టి20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ హోటల్ లో రచ్చ చేసిన వీడియో వైరల్ గా మారింది. టవల్ కట్టుకొని.. హోటల్ (Shreyas Iyer Wrapped In Towel) అంతా శ్రేయస్ అయ్యర్ తిరిగేసాడు.
ఈ సందర్భంగా కొంత మంది అభిమానులు అడిగితే సెల్ఫీలు కూడా చకచకా ఇచ్చేశాడు. ఆ తర్వాత లిఫ్ట్ లో ఓ రౌండ్ గ్రౌండ్ ఫ్లోర్ కు వచ్చి… మళ్లీ తన రూమ్ కు వెళ్ళిపోయాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన క్రికెట్ అభిమానులు షాక్ అవుతున్నారు. ఏంటి శ్రేయస్ అయ్యర్ ప్యాంటు లేకుండా కేవలం టవల్ పైనే ఇలా తిరిగేస్తున్నాడు… అందరిలాగే మనోడు ఊర మాస్ లాగా ఉన్నాడని కామెంట్స్ చేస్తున్నారు. తన రూంలో ఏదో సమస్య రావడంతో టవల్ తోనే బయటకు వచ్చాడని మరి కొందరు అంటున్నారు. అయితే మరికొంతమంది అతడు శ్రేయస్ అయ్యర్ కాదని, శివమ్ దూబే లేదా తిలక్ వర్మ అంటూ స్పష్టం చేస్తున్నారు.
టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య మరికాసేపట్లోనే రెండవ టి20 ప్రారంభం కానుంది. హ్యాగ్లీ ఓవల్, క్రైస్ట్‌చర్చ్
వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ మధ్యాహ్నం 12:30 గంటలకు షురూ అవుతుంది. ఈ మ్యాచ్ లో కూడా టాస్ గెలిచిన జట్టుకు అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే సెకండ్ బ్యాటింగ్ చేస్తే కచ్చితంగా విజయ అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే తొలి మ్యాచ్ లో విజయం సాధించిన టీమిండియా.. అదే ఊపుతో మళ్లీ రెండు మ్యాచ్ గెలిచే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంది.
న్యూజిలాండ్ మాత్రం ఎలాగైనా టీమిండియాపై ప్రతీకారం తీర్చుకునేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అయితే మొదటి టి20 సందర్భంగా వరల్డ్ నెంబర్వన్ ఆటగాడు ఇషాన్ కిషన్ గాయపడడం టీమిండియాకు నిజంగా ఎదురు దెబ్బ అని చెప్పవచ్చు. దీంతో అతని స్థానంలో 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ జట్టులోకి వస్తాడని అంటున్నారు. అయితే వైభవ్ వస్తే సంజు శాంసన్ పరిస్థితి ఏంటని చర్చ జరుగుతోంది. ఓపెనర్ గానే బాగా రాణిస్తున్న సంజు… వైభవ్ వస్తే మళ్లీ ఫస్ట్ డౌన్ లో దిగాల్సి ఉంటుంది. ఆ స్థానంలో సంజు బాగా రాణిస్తాడా ? లేదా ? అనేది సందేహంగా మారింది. మరి సంజు శాంసన్, వైభవ్ విషయంలో గౌతమ్ గంభీర్ ఎలాంటి ఎత్తుగడ వేస్తాడో చూడాలి.
Shreyas Iyer's leaked video from Team hotel 👀
Btw he is in Towel😭 pic.twitter.com/DVwkYOMaH9
— Shikha (@Shikha_003) October 23, 2026