Varanasi Movie : రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో రాబోతున్న వారణాసి మూవీ కోసం యావత్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీని ప్రకటించి రెండేళ్లు అయ్యింది. ఈ ఏడాదికి షూటింగ్ కు కొబ్బరికాయ కొట్టేశారు. ఇటీవలే సెట్స్ మీదకు తీసుకెళ్లిన జక్కన్న శరవేగంగా షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు.. ఇటీవలే గ్రాండ్ గా ఈవెంట్ చేసి టైటిల్ ను అనౌన్స్ చేశాడు. టైటిల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. కానీ ఆ ఈవెంట్ లో జక్కన్న హనుమంతుడి పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన పై పలు కేసులు కూడా నమోదు అవుతున్నాయి. వీటిపై రెస్పాండ్ అవ్వని రాజమౌళి షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఇదిలా ఉండగా ఈ మూవీ గురించి సోషల్ మీడియాలో ఓ చర్చ జరుగుతుంది. అదేంటంటే మహేష్ బాబు రాజమౌళి సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తాడా..? ఏంటి ఆ సెంటిమెంట్ అనే డౌట్ కూడా వస్తుంది కదూ.. అదేంటో ఒకసారి తెలుసుకుందాం..
రాజమౌళితో సినిమా అంత ఈజీ కాదు. లైఫ్ ను కొన్నిసార్లు రిస్క్ పెట్టాల్సిన పరిస్థితి రావొచ్చు. రాజమౌళి చేసిన సినిమాల్లో చాలా సినిమాలు రిస్క్ తో కూడుకొన్నవి. ఇప్పటికే ఆయన సినిమాల్లో నటించిన హీరోలకు గాయాలు కూడా అయ్యాయి. ఆ సినిమాల షూటింగ్ సమయాల్లో గాయాల కారణంగా షూటింగ్ కు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే.. అయితే ప్రతి హీరో గాయాలు తగిలిన పెద్ద సాహసాలు చేశారు. వారి కష్టం వృధాగా పోలేదు.. ఆ సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి.. ఇప్పుడు ఈ మూవీలో కూడా మహేష్ కు గాయాలు అవుతాయ? లేక ఏళ్ల నాటి సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తాడా? అని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వార్తల పై క్లారిటీ రావాలంటే మాత్రం సినిమా వచ్చేవరకు వెయిట్ చెయ్యాల్సిందే మరి…
Also Read :శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..
గతంలో ఎన్నడూ లేని విధంగా మహేష్ బాబు ఈ మూవీలో పెద్ద సాహసాలే చేస్తున్నాడు. భారీ యాక్షన్ సీక్వెన్స్ లో మూవీ రాబోతుంది. మహేష్ విషయంలో జక్కన్న కాస్త ఎక్స్‌ట్రా కేర్ తీసుకుంటాడనే చర్చ కూడా సాగుతోంది.. ఈ మూవీలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా పృథ్వీరాజ్ సుకుమార్ విలన్‌గా నటిస్తున్నారు. కెఎల్ నారాయణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఏం ఏం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నాడు. టైటిల్, గ్లింప్స్ తో ఈ మూవీ పై భారీ బజ్ ను క్రియేట్ చేశాడు జక్కన్న.. మరోవైపు సినిమా మొదలవ్వగానే వివాదాలు పుట్టుకోస్తున్నాయి. ఇప్పటివరకు జక్కన్న ఎక్కడా ఓవర్ గా రియాక్ట్ అవ్వలేదు. ఇకపోతే భారీ యాక్షన్ సీక్వెన్స్ లో రాబోతున్న ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. 2027 లో మూవీని థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. ఈ సినిమాతో జక్కన్న ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తాడో చూడాలి..