E-Paper
Advertisement

TOXIC The Movie : మరింత పవర్‌ఫుల్‌గా నాలుగో హీరోయిన్ లుక్… అందరూ లేడీ డాన్‌లే

TOXIC The Movie : మరింత పవర్‌ఫుల్‌గా నాలుగో హీరోయిన్ లుక్… అందరూ లేడీ డాన్‌లే
Advertisement

TOXIC The Movie: కేజిఎఫ్ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న నటుడు యష్ (Yash)త్వరలోనే టాక్సిక్ సినిమా (Toxic Movie)ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. కేజిఎఫ్ 2 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి దాదాపు మూడు సంవత్సరాలవుతున్న ఇప్పటివరకు యష్ నుంచి తదుపరి సినిమా ప్రేక్షకుల ముందుకు రాలేదు దీంతో ప్రేక్షకులు సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాని 2026 మార్చి 19 వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే సినిమా నుంచి వరుస అప్డేట్స్ తెలియజేస్తూ ప్రమోషన్లను కూడా ప్రారంభించారు.

టాక్సిక్ నుంచి తారసుతారియ ఫస్ట్ లుక్..

ఇక ఈ సినిమాలో ఏకంగా నలుగురు హీరోయిన్లు నటించబోతున్నట్లు చిత్రబృందం విడుదల చేసిన అప్డేట్స్ చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి నయనతార గంగా పాత్రలో,కియార అద్వానీ నదియా పాత్రలో నటించబోతున్నారు. హుమా కురేషీ ఎలిజిబెత్ నటించబోతున్నట్లు చిత్రబృందం వారికి సంబంధించిన పస్ట్ లుక్ పోస్టర్స్ విడుదల చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి నాలుగవ హీరోయిన్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు .ఈ సినిమాలో తారాసుతారియా(Tara Sutaria ) సైతం నటించబోతున్నట్లు తెలియజేశారు. ఈ సినిమాలో ఈమె రెబెక్కా పాత్రలో కనిపించబోతున్నారు.

రెబెక్కాగా తారా సుతారియా..

Advertisement

తాజాగా ఈమెకు సంబంధించిన ఈ పోస్టర్ విడుదల చేస్తూ.. పెద్దల కోసం విషపూరితమైన కథ రెబెక్కాగా తారా సుతారియా అంటూ ఈ పోస్టర్ విడుదల చేశారు. ఇందులో భాగంగా ఈమె గన్ పట్టుకొని లేడీ డాన్ రేంజ్ లో కనిపిస్తున్నారు. ఇక ఇదివరకు విడుదల చేసిన ముగ్గురు హీరోయిన్ల ఫస్ట్ లుక్ పోస్టర్లు కూడా ఇదే తరహాలో ఉండడంతో ఈ సినిమాలో హీరోయిన్లందరూ లేడీ డాన్లుగా కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో నటి రుక్మిణి వసంత్, అక్షయ్ ఒబెరాయ్, సుదేవ్ నాయర్ వంటి తదితరులు కూడా కీలకపాత్రలలో కనిపించబోతున్నారు.

Advertisement

ఇక ఈ సినిమాకు గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించగా, ఫెయిరీ టేల్స్ ఫర్ గ్రోన్ అప్, కేవీఎన్ ప్రొడక్షన్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే సినిమా నుంచి యష్ కు సంబంధించిన పోస్టర్లు కూడా సినిమా పట్ల మంచి అంచనాలనే పెంచేసాయి. ఈ సినిమా పిరియాడిక్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఈ సినిమా మొత్తం డ్రగ్స్ నేపథ్యంలోనే కొనసాగుతుందని తెలుస్తోంది. కే జి ఎఫ్ 2 ఇలాంటి బ్లాక్ బస్టర్ తర్వాత యష్ హీరోగా నటించిన సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఇక మార్చి 19వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా వాయిదా పడుతుందంటూ ఇటీవల వార్తలు వచ్చినప్పటికీ ఈ వార్తలన్నింటిని కొట్టి పారేస్తూ చెప్పిన సమయానికి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.

Also Read: Dil Diya Movie: యంగ్ హీరో న్యూ*డ్‌గా నటించిన మూవీ ఫస్ట్ లుక్ అవుట్

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×