E-Paper
Advertisement

Naa Anvesh: ప్రపంచ యాత్రికుడు నా అన్వేష్ కు షాక్ ఇచ్చిన ఇంస్టాగ్రామ్…

Naa Anvesh: ప్రపంచ యాత్రికుడు నా అన్వేష్ కు షాక్ ఇచ్చిన ఇంస్టాగ్రామ్…
Advertisement

Naa Anvesh: యూట్యూబ్ నా అన్వేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన యూట్యూబర్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి ఎన్నో దేశ విదేశాలలో పర్యటిస్తూ అక్కడికి సంబంధించిన విషయాలన్నింటిని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులకు చూయిస్తూ సోషల్ మీడియా వేదికగా ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ఇలా ప్రపంచయాత్రికుడిగా పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న అన్వేష్ కేవలం యూట్యూబ్లో మాత్రమే కాకుండా ఇంస్టాగ్రామ్ లో కూడా విపరీతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ఇలా యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈయన ప్రతినెల కొన్ని లక్షల్లో ఆదాయం అందుకుంటున్నారు.

ఇండియా పై వివాదాస్పద వ్యాఖ్యలు..

ఇకపోతే ఇటీవల కాలంలో నా అన్వేష్ వీడియోలు పెద్ద ఎత్తున విమర్శలకు కారణం అవుతున్నాయి. ఈయన ఏదైనా ఒక వివాదం జరిగితే ఆ వివాదాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటూ వరుస వీడియోలను విడుదల చేస్తూ ఉంటారు ఇటీవల కాలంలో నా అన్వేష్ భారతదేశాన్ని దూషిస్తూ మాట్లాడిన సంగతి తెలిసిందే. ఇలా ఇండియాకు చెందిన వ్యక్తిగా ఈయన ఇండియాని అగౌరవ పరుస్తూ మాట్లాడటమే కాకుండా తన ఇంస్టాగ్రామ్ ప్రొఫైల్లో ఇతర దేశాల జాతీయ పతాకాలు ఉన్నప్పటికీ భారతదేశ జాతీయ పతాకం లేకపోవడంతో ఈయన పట్ల చాలామంది విమర్శలు కురిపించారు.

1.8 మిలియన్ ఫాలోవర్స్…

Advertisement

ఈ విధంగా ఇండియా గురించి నా అన్వేష్ చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్ సీసీఎస్ లో కేసు నమోదు చేశారు. భారతదేశం గురించి చెడుగా మాట్లాడుతూ మతవిద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేసినందుకు అన్వేష్ ఇంస్టాగ్రామ్ ఐడి తొలగించాలి అంటూ సీసీఎస్ పోలీసులు ఇంస్టాగ్రామ్ కు లేఖ రాశారు ఈ విషయంపై స్పందించిన ఇంస్టాగ్రామ్ అన్వేష్ పై చర్యలు తీసుకుంటూ తన ఇంస్టాగ్రామ్ ఐడి బ్లాక్ చేసేసారు. ఇంస్టాగ్రామ్ లో నా అన్వేష్ కు సుమారు 1.8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇలా ఇంస్టాగ్రామ్ వేదికగా భారీ స్థాయిలో ఆదాయం అందుకుంటున్న అన్వేష్ పై వేటుపడటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈయన భారతదేశం గురించి హిందువుల గురించి మాట్లాడేటప్పుడు దాదాపు పది లక్షల మందికి పైగా సబ్స్క్రైబర్లు తనని అన్ ఫాలో చేసిన విషయం తెలిసిందే.

అన్వేష్ ఇంస్టాగ్రామ్ ఐడి బ్లాక్…

Advertisement

ఇలా సోషల్ మీడియాలో తనకు వ్యతిరేకత మొదలు కావడంతో అన్వేష్ ఇకపై తాను ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయను అంటూ ఒక వీడియో వదిలారు అదే విధంగా ఇకపై తాను ఎలాంటి వీడియోలు కూడా చేయనని చెప్పిన సంగతి తెలిసిందే. ఇలా ఈయన తన ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ద్వారా తనకు సంబంధించిన విషయాల గురించి మాత్రమే కాకుండా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలు రాజకీయాలకు సంబంధించిన విషయాల గురించి మాట్లాడుతూ నిత్యం వివాదాలలో నిలుస్తూ ఉన్నారు. ఇలా ఇంస్టాగ్రామ్ ఐడి బ్లాక్ చేయడంతో నా అన్వేషణ రియాక్షన్ ఏంటి అనేది తెలియాల్సి ఉంది.

Also Read: IBomma Ravi: ఫస్ట్ టైం మీడియా ముందుకు ఐ బొమ్మ రవి.. పైరసీ ఏమన్నారంటే?

Related News

చిన్న విషయాలకే వణికిపోయే స్టార్ హీరోయిన్లు వీళ్లే!

పాన్ ఇండియా స్టార్ కావాలంటే.. ఇప్పుడు కత్తి పట్టాల్సిందేనా?

చిరంజీవిపై హీరో సుమన్ షాకింగ్ కామెంట్స్!

సౌత్ స్టైల్‌లో ‘స్పైడర్ మ్యాన్’కు పెళ్లి.. అతిథులుగా అవేంజర్స్, ఏం క్రియేషన్ భయ్యా!

కోర్టు మెట్లెక్కిన టబు!

రెండు పెళ్లిళ్లు.. కేసులు.. క్యాన్సర్‌..ప్రదీప్ రావత్ పర్సనల్ లైఫ్ తెలుసా?

డైలాగ్ చేంజెస్ తో సెన్సార్ పూర్తి చేసుకున్న కొరియన్ కనకరాజు.. రన్ టైమ్ లాక్!

రాజకీయాలపై అక్కినేని కోడలు హాట్ కామెంట్స్!

Big Stories

Advertisement
×