E-Paper
Advertisement

IBomma Ravi: ఫస్ట్ టైం మీడియా ముందుకు ఐ బొమ్మ రవి.. పైరసీ ఏమన్నారంటే?

IBomma Ravi: ఫస్ట్ టైం మీడియా ముందుకు ఐ బొమ్మ రవి.. పైరసీ ఏమన్నారంటే?
Advertisement

I Bomma Ravi: ఐ బొమ్మ రవి పరిచయం అవసరం లేని పేరు. సినిమాలను పెద్ద ఎత్తున పైరసీలకు పాల్పడుతూ ఈయన పోలీసులకు దొరికిన సంగతి తెలిసిందే. ఐ బొమ్మ రవి (Ibomma Ravi) థియేటర్లలో విడుదలైన సినిమాలన్నింటినీ కూడా లీక్ చేస్తూ భారీగా ఆస్తులను సంపాదించారు వందల కోట్లు డబ్బు సంపాదించడమే కాకుండా పైరసీ ద్వారా చిత్ర పరిశ్రమకు కూడా వందల కోట్ల నష్టాలను తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలోనే ఐ బొమ్మపై దృష్టి సారించిన సైబర్ క్రైమ్ ఎట్టకేలకు ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్టు చేసి జైలుకు పంపించారు. దాదాపు మూడు నెలల పాటు ఈయన జైలు జీవితం గడిపిన సంగతి తెలిసిందే. మూడు నెలల పాటు జైలులో ఉన్న ఈయన నుంచి పోలీసులు కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది.

ఆంక్షలతో కూడిన బెయిల్..

ఇలా ఐ బొమ్మ రవి మూడు నెలల జైలు తర్వాత పలు ఆంక్షలతో కూడిన బెయిల్ మీద బయటకు వచ్చారు. ఈయనకు పలు నిబంధనలను విధించిన సంగతి తెలిసిందే. రవి ఇంటర్నెట్ వాడటానికి వీలు లేదు ఈయన ఇంటర్నెట్ వాడాలి అంటే పోలీసులు అనుమతి తప్పనిసరి. ప్రతిరోజు సైబర్ క్రైమ్ పోలీసుల ముందు వచ్చి హాజరు కావాలి, పాస్ పోర్ట్ కోర్టుకు అప్పగించాలి దేశం విడిచి వెళ్లిపోకూడదు వంటి తదితర ఆంక్షలు విధిస్తూ ఈయనని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇలా రవి జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే నేడు సైబర్ క్రైమ్ పోలీసుల ముందుకు హాజరయ్యారు.

నోరు విప్పని ఐ బొమ్మ రవి…

Advertisement

ఇలా సైబర్ క్రైమ్ పోలీసులను కలిసిన తరువాత ఈయనని మీడియా ఒక్కసారిగా చుట్టుముట్టారు సినిమా పైరసీ గురించి రవిని ప్రశ్నించడంతో రవి మాత్రం మౌనవ్రతం పాటిస్తూ అందరికీ షాక్ ఇచ్చారు. మీడియా వారు ఈయనని ఎన్నో విధాలుగా ఎన్నో ప్రశ్నలు వేసిన ఆయన మాత్రం నోరు విప్పకుండా మీడియాకు దండం పెడుతూ అక్కడి నుంచి వెళ్ళపోయారు. ఇలా పైరసీ గురించి రవి మీడియాతో మాట్లాడటానికి ఈ విషయంలో తన ప్రమేయం లేదని చెప్పడానికి కూడా ఇష్టపడలేదని తెలుస్తుంది ఇలా మౌనంగా ఉండడంతో మౌనం అంగీకారానికి అర్థమా అంటూ మీడియా వారు ప్రశ్నించిన ఈయన మాత్రం నోరు విప్పలేదు. మౌనంగా ఐ బొమ్మ రవి అక్కడినుంచి వెళ్లిపోయారు.

Advertisement

ఇకపోతే ఐ బొమ్మ రవి సినిమాలను పైరసీ చేస్తున్నారు అంటూ ఈనని అరెస్టు చేసినప్పటికీ పైరసీ మాత్రం ఎక్కడ ఆగలేదు. ఈయన జైలులో ఉన్నప్పటికీ కొత్త సినిమాలు థియేటర్లో విడుదలైన వెంటనే ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చాయి . ఇక రవిని అరెస్టు చేయడంతో ఈయన అరెస్టును ఖండిస్తూ ఎంతోమంది సోషల్ మీడియా వేదికగా ఈయనకు మద్దతు తెలియజేశారు. ఇప్పుడు రవి జైలు నుంచి బయటకు రావడంతో పైరసీలో సినిమా చూసే ప్రేక్షకులు మాత్రం తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి రవి ఇప్పటికైనా చేసిన తప్పును తెలుసుకొని పైరసీని ఆపివేస్తారా లేదంటే తన నెట్ వర్క్ ను ఉపయోగించి పైరసీలను కొనసాగిస్తారా అనేది తెలియాల్సి ఉంది.

Also Read: Peddi film: భారీ ధరకు రామ్ చరణ్ పెద్ది నాన్ థియేట్రికల్ రైట్స్…చరణ కెరియర్ లోనే హైయెస్ట్!

Related News

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

ప్రమాదానికి గురైన అలీ..కాలికి పెద్ద కట్టుతో అలా..ఏమైందంటే?

Big Stories

Advertisement
×