E-Paper
Advertisement

The Raja Saab: ప్రభాస్ నానమ్మగా నటించింది ఈమె ..బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా ?

The Raja Saab: ప్రభాస్ నానమ్మగా నటించింది ఈమె ..బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా ?
Advertisement

The Raja Saab:రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. టాలీవుడ్ డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో తాజాగా వస్తున్న చిత్రం ది రాజా సాబ్. హారర్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్దీ కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అంతేకాదు మాళవిక మోహనన్ ఈ సినిమా ద్వారా తొలిసారి తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పాటలు, ట్రైలర్, టీజర్ అన్నీ కూడా సినిమాపై అంచనాలు పెంచేసాయి.

ఆమె కూడా హీరోనే..

2026 జనవరి 9న సంక్రాంతి సందర్భంగా విడుదల కానున్న నేపథ్యంలో నిన్న హైదరాబాద్ వేదికగా ఘనంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఇకపోతే ఈ సినిమా ఈవెంట్లో ప్రభాస్ మాట్లాడుతూ..” ఈ సినిమాలో తనకు నానమ్మ పాత్రలో నటించిన నటి గురించి చాలా ప్రత్యేకంగా మాట్లాడారు. ఇది నానమ్మ, మనవడి కథ. నేను కాదు ఆమె కూడా ఈ సినిమాలో హీరోనే అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఇకపోతే ప్రభాస్ ప్రత్యేకంగా ఆమె గురించి ప్రస్తావించడంతో ఆమె ఎవరు ? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అని తెలుసుకోవడానికి అభిమానులు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు.

ప్రభాస్ నానమ్మగా బాలీవుడ్ నటి..

Advertisement

ప్రభాస్ ది రాజా సాబ్ సినిమాలో ప్రభాస్ కి నానమ్మగా నటించిన ఆమె ఎవరో కాదు ప్రముఖ బాలీవుడ్ నటి జరీనా వాహబ్. హిందీతో పాటు తెలుగు, తమిళ్ చిత్రాలలో కూడా నటించింది. ఈమె విశాఖపట్నం కి చెందిన ఒక ముస్లిం కుటుంబానికి చెందిన అమ్మాయి. సినిమాల పట్ల ఆసక్తి ఉండడంతో బాలీవుడ్ వైపు అడుగులు వేసింది. అలా మొదటిసారి 1974లో ఇష్క్.. ఇష్క్.. ఇష్క్ అనే చిత్రం ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో వరుసగా అవకాశాలు తలుపు తట్టాయి.

జరీనా నటించిన తెలుగు చిత్రాలు..

తెలుగులో గాజుల కిష్టయ్య, అమర ప్రేమ, హేమా హేమీలు వంటి చిత్రాలలో నటించింది. ఈ కాలంలో కూడా సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. రక్త చరిత్ర, రక్త చరిత్ర 2, విరాటపర్వం, దసరా, దేవర, విశ్వరూపం వంటి సూపర్ హిట్ చిత్రాలలో నటించింది .

Advertisement

ALSO READ:Peddi: లేటెస్ట్ అప్డేట్.. విలేజ్ డ్రామాకి క్లాసిక్ టచ్ తోడైతే?

జరీనా వ్యక్తిగత జీవితం..

ఈమె వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. 1986లో నటుడు ఆదిత్య పంచోలీని వివాహం చేసుకుంది. అతడు ఈమె కంటే ఆరు సంవత్సరాలు చిన్నవాడు కావడం గమనార్హం. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అటు వారు కూడా నటులే కావడం గమనార్హం. ఇకపోతే మళ్ళీ ఇప్పుడు ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది జరీనా. మరి ఈ సినిమాతో ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.

ప్రభాస్ తదుపరిచిత్రాలు..

ఇక ప్రభాస్ విషయానికొస్తే ప్రస్తుతం ది రాజా సాబ్ సినిమాను విడుదలకు సిద్ధం చేస్తున్నారు. అలాగే స్పిరిట్, కల్కి 2, సలార్ 2 వంటి చిత్రాలను లైన్ లో పెట్టారు ప్రభాస్. ఈ సినిమాల తర్వాత యంగ్ డైరెక్టర్ లకు అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×