E-Paper
Advertisement

జపాన్‌లో వర్క్ కల్చర్.. ఓ భారతీయుడి కీలక వ్యాఖ్యలు, వీకెండ్స్‌లో అయితే

జపాన్‌లో వర్క్ కల్చర్.. ఓ భారతీయుడి కీలక వ్యాఖ్యలు, వీకెండ్స్‌లో అయితే
Advertisement

Indian: ప్రపంచవ్యాప్తంగా ఒక్కో దేశంలో పని కల్చర్ ఒక్కోలా ఉంటుంది. ఇండియా కంటే అక్కడి వర్క్ కల్చర్‌కు కొందరు ఫిదా అయిపోతారు. అలా అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. తాజాగా జపాన్‌లో ఉద్యోగం చేస్తున్న ఓ భారతీయుడు అక్కడి పని కల్చర్‌పై చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి. ఇంతకీ అతడు ఏం చేశాడు?

జపాన్‌లో వర్క్ కల్చర్‌పై ఓ భారతీయుడు వ్యాఖ్యలు-జపాన్‌లో పని చేస్తున్న ఓ భారతీయుడు అజయ్‌పాండే ఆ దేశంలోని పని విధానంపై ప్రశంసించాడు. ఈ క్రమంలో తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశాడు. హైబ్రిడ్ వర్కింగ్, పెయిడ్ ఓవర్‌టైమ్, అంతరాయం లేని వారాంతాలు, భారీ బోనస్‌లు వంటి ప్రయోజనాలు ఉంటాయని చెప్పుకొచ్చాడు. ఉద్యోగి అనుకూల విధానాలను ప్రశంసిస్తూ.. ఇంకోవైపు భారతీయ ఆఫీసుల పరిస్థితులను పోలుస్తూ వెరైటీగా చేసిన పోస్ట్‌కు వైరల్ అవుతోంది.

Advertisement

జపాన్‌లో వీకెండ్ బోర్-అజయ్ పాండే గడిచిన పుష్కర కాలంగా  జపాన్‌లో నివాసం ఉంటున్నాడు. జపాన్‌ కార్యాలయాల్లోని దుర్భరమైన పరిస్థితులంటూ తమాషాగా కొన్ని అంశాలను ప్రస్తావించాడు. వారానికి మూడు రోజులు ఆఫీస్‌కు వెళ్లడం, వీకెండ్  పని ఒత్తిడి లేకపోవడం, అదనపు సమయం పని చేస్తే ప్రతి 15 నిమిషాలకు లెక్క గట్టి మరీ వేతనం ఇస్తారంటూ రాసుకొచ్చాడు.

గిఫ్టులు ఇవ్వరు.. బోనస్‌గా జీతం-ఉద్యోగులకు బహుమతులకు బదులుగా కొన్ని నెలల జీతాన్ని బోనస్‌గా ఇవ్వడం వంటి విషయాలు తనకు నచ్చలేదంటూ తనదైన శైలిలో రాసుకొచ్చాడు. వారాంతాల్లో ఆఫీసు నుంచి ఒక్క ఫోన్ కాల్ రాదని, అస్సలు పట్టించుకోరని తెలిపాడు. అప్పుడప్పుడైనా ఆఫీసు వాళ్లు పిలిస్తే బాగుండు కదా అంటూ చమత్కరించాడు.

Advertisement

ఓవర్ టైమ్ పని చేయడానికి అనుమతి ఇవ్వరని, ఒకసారి అనుమతి లభిస్తే నిమిషానికి ఇంత చొప్పున వేతనం చెల్లిస్తారని అక్కడి విషయాలను పంచుకున్నాడు. 11 ఏళ్లుగా తన మేనేజర్ ప్రతి వారాంతంలో తనను ఫ్రెండ్-జోన్‌లో ఉంచుతున్నాడని రాసుకొచ్చాడు. ఆ విధంగా ప్రతి వారాంతం వృధా అవుతోందని, అప్పుడప్పుడు తనను పనికి పిలవాలన్నాడు.

ALSO READ: అమర్‌నాథ్-వైష్ణోదేవి యాత్రకు తాత్కాలికంగా బ్రేక్.. బేస్ క్యాంపుల ఆగిన యాత్రికులు, ఏం జరిగింది?

అజయ్ పాండే వీడియో సోషల్ మీడియాలో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. విజయంతో బ్రో  బాధపడుతున్నాడని ఓ వ్యక్తి కామెంట్స్ చేశాడు. నన్ను నమ్మండి, ఈ రీల్ జపాన్ గురించి కాదని మరొక వ్యక్తి రాసుకొచ్చాడు. బ్రో, నువ్వు నా కలల జీవితాన్ని గడుపుతున్నావు.. నా బకెట్ లిస్ట్‌లో జపాన్ ఉందని మరొక వ్యక్తి తన మనసులోని ఆలోచన బయటపెట్టాడు.

Related News

రిలయన్స్, బ్లింకిట్, జొమాటో సిబ్బందిపై కేసు నమోదు.. ఎందుకంటే..?

మాజీ సీఎం కోసం.. 9 హత్యలు చేశా.. లైవ్‌లో ఒప్పుకున్న ఎమ్మెల్యే!

రాత్రి నూడుల్స్.. ఉదయానికి శవాలు.. ఒకే కుటుంబంలో 5 గురు మృతి!

ఈ నెలలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. ఆ రెండు అంశాలపై వాడీ వేడీ రచ్చ!

ఢిల్లీలో వీడని సస్పెన్స్.. అభిజిత్ దీప్కే ఆచూకిపై గందరగోళం.. నేహా బోరా తీవ్ర ఆరోపణలు!

బీజేపీ అగ్రనేతకు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిన ఎల్.కే. అద్వానీ.. ప్రస్తుతం ఎలా ఉన్నారంటే?

స్పామ్, ఫ్రాడ్ కాల్స్‌ టెన్షన్‌కు ఇక చెక్.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం?

ప్రపంచాన్ని సైతం కదిలించిన చరిత్ర.. అక్టోబర్ 17 ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా..?

Big Stories

Advertisement
×