E-Paper
Advertisement

Black Magic: చేతబడి.. టీనేజ్ అమ్మాయి తలలో నుంచి 77 సూదులు తొలగించిన డాక్టర్లు

Black Magic: చేతబడి.. టీనేజ్ అమ్మాయి తలలో నుంచి 77 సూదులు తొలగించిన డాక్టర్లు
Advertisement

Black Magic| ఓ 19 ఏళ్ల అమ్మాయి తీవ్ర తలనొప్పి చికిత్స కోసం ఆస్పత్రికి వస్తే.. డాక్టర్లకు షాకింగ్ విషయం తెలిసింది. అమ్మాయి తల స్కానింగ్ చేస్తే.. తలలో 77 సూదులు ఉన్నాయని తెలిసింది. ఆ సూదులు తల నుంచి తొలగించడానికి డాక్టర్లు రెండు సార్లు ఆపరేషన్ చేయాల్సి వచ్చింది.

ఈ కేసుని విచారణ చేసిన పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా లోని ఇచ్ గావ్ కు చెందిన రేష్మా బెహెరా అనే 19 ఏళ్ల అమ్మాయి.. భీమా భోయ్ మెడికల్ కాలేజీలో తనకు తీవ్ర తలనొప్పి ఉందని చికిత్స కోసం వచ్చింది. ఆమె మందులతో నయం కాకపోవడంతో డాక్టర్లు ఆమె తలకు స్కానింగ్ చేశారు. స్కానింగ్ రిపోర్టులో రేష్మా తల నిండా ఇనుప సూదలున్నట్లు డాక్టర్లు గుర్తించారు.

Advertisement

ఆమె తల లోపలి భాగంలో సూదులు గుచ్చుకోవడం వల్ల టిష్యూ డ్యామేజ్ అయిందని.. అయితే తలలోని ఎముకలకు ఎటువంటి హాని కలుగలేదని తెలిసింది. సూదులు తల లోపల కలిగించిన గాయల కారణంగా ఆమెకు ఈ నొప్పి ఉందని నిర్ధారించారు. అయితే ఆ సూదులు తొలగించడం నైపుణ్యం కలిగిన శస్త్ర చికిత్స డాక్టర్లు చేయాలని వీర్ సురేంద్ర సాయి మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్(విమ్ సార్) ఆస్పత్రికి రేష్మా కేసుని బదిలీ చేశారు.

విమ్ సార్ ఆస్పత్రి డాక్టర్లు రేష్మా తలలో సూదులు తొలగించడానికి ఆపరేషన్ చేసి 70 సూదులు తొలగించారు. అన్ని సూదులు ఒకేసారి తొలగించడం కష్టంగా ఉండడంతో ఆమెకు రెండోసారి సర్జరీ చేసి మిగతా ఏడు సూదులు తొలగించారు.

Advertisement

Also Read: ముంచుకొస్తున్న మరో వైరస్.. గుజరాత్‌లో 16 మంది మృతి

ఈ కేసులో పోలీసులు విచారణ చేసి.. తల్లి చనిపోయిన తరువాత రేష్మా ఆమెనే తలుచుకుంటూ మానసికంగా బాధపడేది. అలా 2021లో రేష్మా మానసిక వ్యాధితో బాధపడుతుంటే.. ఆమెను కుటుంబ సభ్యులు ఒక తాంత్రిక బాబా వద్దకు తీసుకెళ్లారు. ఆ తాంత్రికుడు రేష్మాని ఆమె తల్లి ఆవహించిందని చెప్పి.. పరిష్కారం కోసం రేష్మా తలలో అప్పుడప్పుడూ సూదులు గుచ్చాడు. ఆ సూదులు ఉన్నంత వరకు రేష్మా నుంచి ఆమె తల్లి ఆత్మ దూరంగా ఉంటుందని చెప్పాడు.

కానీ రేష్మా తలలో సూదులు పెట్టుకొని తీవ్ర నొప్పితో బాధపడేది. ఈ కేసులో ఇప్పటికే తాంత్రికుడి శిష్యుడిని పోలీసులు అరెస్టు చేయగా.. ఆ తాంత్రిక బాబా పరారీలో ఉన్నట్లు సమాచారం.

Tags

Related News

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

Big Stories

Advertisement
×