E-Paper
Advertisement

Crime: అక్కే వ్యభిచార రొంపిలోకి దింపింది.. చెన్నైలో వెలుగుచూసిన ఘటన

Crime: అక్కే వ్యభిచార రొంపిలోకి దింపింది.. చెన్నైలో వెలుగుచూసిన ఘటన
Advertisement

Chennai: తమిళనాడులో ఓ అవాంఛనీయ ఘటన చోటుచేసుకుంది. అక్కే చెల్లిని వ్యభిచార రొంపిలోకి దింపింది. కొన్నాళ్లపాటు వేర్వేరు పట్టణాలు తింపుతూ ఆమెతో వ్యభిచారం చేయిస్తూ డబ్బులు సంపాదించారు. కానీ, ఈ వ్యవహారం ఎంతో కాలం సాగలేదు. చెన్నై పోలీసులకు సమాచారం అందగానే కూపీ లాగి.. ఆరుగురిని అరెస్టు చేశారు. మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

చెమ్మెంచేరిలో నివసించే 14 ఏళ్ల బాలిక.. తన అక్కతో ఉండటానికి పాదువంచేరికి వెళ్లింది. అక్కడే అక్క, అత్త.. కలిసి ఈ బాలికను వ్యభిచార కూపంలోకి నెట్టేశారు. ఆ తర్వాత ఆ బాలికను కేకే నగర్, చెంగల్‌పట్టు సహా పలు ప్రాంతాలకు తింపారు. కానీ, చెంగల్‌పట్టులోని ఓ చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి ఈ బాలిక గురించి తెలిసిందే. వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. సెలయ్యూర్ ఆల్ విమెన్ పోలీసులు ఒక ప్రత్యేక బృందంగా ఏర్పడి కేసు ఛేదించింది.

Advertisement

Also Read: వ్యూహకర్తగా ఫుల్ స్టాప్.. ఇక ఫుల్ టైమ్ పొలిటిషయన్

కాల్ రికార్డులు, దర్యాప్తుల ఆధారంగా పోలీసులు లక్ష్మీ, ప్రకాశ్, దామోదరన్, కవిత, కర్పగమ్, శ్రీనివాస్‌లను పోలీసులు అరెస్టు చేశారు. వారిపై కేసు నమోదు చేశారు. మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని ఈ కేసు గురించే విచారిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతున్నది.

Advertisement

స్కూల్ పిల్లలను వ్యభిచారంలోకి బలవంతంగా దింపిన కేసులో పోలీసులు మే నెలలో ఏడుగురిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తమిళనాడులో కలకలం రేపింది.

Related News

సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం విడుదలకు డేట్ ఫిక్స్..!

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

Big Stories

Advertisement
×