BigTV English

Ex CS SomeshKumar case: చిక్కుల్లో తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్‌కుమార్, 1000 కోట్ల స్కామ్..

Ex CS SomeshKumar case: చిక్కుల్లో తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్‌కుమార్, 1000 కోట్ల స్కామ్..

Ex CS SomeshKumar case: తెలంగాణలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. వాణిజ్య శాఖలో దాదాపు 1000 కోట్ల మేరా ఈ స్కామ్ జరిగినట్టు అధికారులు అంచనాకు వచ్చారు. దీంతో అధికారుల ఫిర్యాదు మేరకు తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్‌కుమార్‌పై తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.


దాదాపు 70 కంపెల ఐజీఎస్టీ చెల్లింపులో భారీగా అవకతవలకు పాల్పడినట్టు కమర్షియల్ ట్యాక్స్ అధికారు లు గుర్తించారు. అంతేకాదు ఇన్‌ఫుట్ ట్యాక్స్ క్రెడిట్ చెల్లింపుల్లో 1000 కోట్ల మేరా అవినీతి జరిగినట్టు తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ విచారణలో తేలింది. దీంతో ఆ శాఖ కమిషనర్ మూడు రోజుల కిందట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.

ఇంతకీ కుంభకోణం ఏంటి? ఒక రాష్ట్రంలో డీలర్లు మరో రాష్ట్రంలో విక్రయించే వస్తువులపై కేంద్రం ఐజీఎస్టీని వసూలు చేస్తోంది. ఇందుకో కొంతభాగం వస్తువు సంబంధించిన రాష్ట్రానికి ఆదాయం వెళ్తుంది. దీన్ని ఆదాయ వనరుగా మార్చుకున్నారు కొంతమంది డీలర్లు. ఫేక్ ట్యాక్స్ ఇన్వాయిస్‌లను క్రియేట్ చేశారు. దాదాపు 18 రకాల వస్తువులను ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసినట్టు అందులో పేర్కొన్నారు.


నిజానికి ఎలాంటి వస్తువులు ట్రాన్స్‌పోర్టు చేయలేదు. కాగితాల్లో మాత్రం సరఫరా కనిపించింది. తెలంగాణ లోని పలువురు డీలర్లు, ఇతర రాష్ట్రాల్లోని డీలర్లతో డీల్ కుదుర్చుకున్నారు. దీంతో ప్రభుత్వ ఖజానా నుంచి కోట్లాది రూపాయలు కొల్లగొట్టారు. దీని విలువ అక్షరాలా 1000 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారుల అంచనా.

ఫిబ్రవరిలో ఈ కుంభకోణం వెలుగులో రాగానే వాణిజ్య పన్నులశాఖ అంతర్గత విచారణ చేపట్టింది. దీంతో ఈ కుంభకోణం బయటపడింది. నిజానికి రేవంత్ సర్కార్ అధికారంలోకి రాగానే కొందరు అధికారుల బదిలీ లు జరిగాయి. ఆ సమయంలో కొత్తగా వచ్చిన అధికారులు ఈ స్కామ్‌ని వెలికితీశారు.

ALSO READ: పంచాయతీ ఎన్నికల్లో వాళ్లను గెలిపించుకుంటాం: సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

మాజీ సీఎస్‌పై విచారణ చేయవద్దంటూ కొందరు అధికారులు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. దీనిపై ప్రభుత్వం తన పని తాను చేసింది. 2019లో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సొమేష్‌కుమార్ నియమితు లయ్యారు. అప్పుడు వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ శాఖలను తనవద్దే పెట్టుకున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వ్యవహారంలో తీగలాగితే డొంక కదలడం ఖాయం.

Related News

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Rain Alert: ఓర్నాయనో.. ఇంకా 3 రోజులు వానలే వానలు.. ఈ జిల్లాల్లో పిడుగుల పడే అవకాశం

Big Stories

×