E-Paper
Advertisement

Kashmir Snowfall : మంచు దుప్పటిలో జమ్ము-కశ్మీర్.. గుల్మార్గ్ లో కొత్త రికార్డ్..

Kashmir Snowfall : మంచు దుప్పటిలో జమ్ము-కశ్మీర్.. గుల్మార్గ్ లో కొత్త రికార్డ్..
Advertisement
kashmir snowfall time

kashmir snowfall time (telugu flash news) :

చలి మళ్లీ పెరిగింది కదా.. తగ్గినట్టే తగ్గి మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. హైదరాబాద్‌లో కనిష్ట ఉష్ణోగ్రతలు 17 డిగ్రీలుగా నమోదవుతున్నాయి. దీనికే వణికిపోతుంటే కాశ్మీర్‌లో మైనస్ 17 డిగ్రీల టెంపరేచర్ రికార్డవుతోంది. ఎస్.. అనంత్‌నాగ్ ప్రాంతంలో మైనస్ 17.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గుల్మార్గ్‌లో నిత్యం మైనస్ 10 డిగ్రీల కంటే తక్కువ టెంపరేచర్ రికార్డవుతోంది.

Advertisement

జమ్ము కాశ్మీర్ ఎటు చూసినా మంచు దుప్పటి కప్పుకుంది. మంచు వర్షం భారీగా కురుస్తోంది. గుల్మార్గ్‌లో కనిష్ట ఉష్ణోగ్రత కొత్త రికార్డు క్రియేట్ చేసింది. ప్రస్తుతం అక్కడ మైనస్ 10 డిగ్రీలకంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతోంది.

కాశ్మీర్ లోయలో హిమపాతం కంటిన్యూ అవుతోంది. శనివారం మొదలైన మంచు వర్షం నాన్‌స్టాప్‌గా కురుస్తోంది. ఇది హెవీగా మారుతుందని అక్కడి వాతావరణ శాఖ హెచ్చరించింది. మరో రెండు రోజులు భారీ హిమపాతం తప్పదని స్పష్టంచేసింది.

Advertisement

జమ్ము- కశ్మీర్‌లోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు జీరో డిగ్రీ సెల్సియస్‌కి పడిపోతున్నాయి. సున్న నుంచి మైనస్ మూడు డిగ్రీల టెంపరేచర్స్ నమోదవుతుండడంతో జనం వణికిపోతున్నారు. ఇక్కడ టెంపరేచర్స్ పడిపోవడం కామన్ అయినా.. గతంలో ఎన్నడూ లేనంతగా కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. పర్యాటకులు మాత్రం మస్త్ ఎంజాయ్ చేస్తున్నారు. మంచు పర్వతాల నుంచి అకస్మాత్తుగా మంచు పెళ్లలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున.. అడ్వెంచర్ స్పోర్ట్స్ చేస్తున్నవాళ్లు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

Related News

చనిపోయింది నూడిల్స్ వల్ల కాదట.. అసలు నిజం తెలిసి పోలీసులే షాక్!

ఐక్యరాజ్యసమితిలో ఉద్యోగం.. డిగ్రీ చేసినవారికి సూపర్ అవకాశం.. అర్హతలు ఇవే

ఆలయంలో ఓ లారీ బీభత్సం, 12 మంది మృతి-30 మందికి గాయాలు, గ్వాలియ‌ర్‌లో ఘటన

దుర్గా మండపం కూలిన ఘటన..19 మంది మృతి, 25 మందికి గాయాలు, కోల్‌కత్తాలో ఘటన

రిలయన్స్, బ్లింకిట్, జొమాటో సిబ్బందిపై కేసు నమోదు.. ఎందుకంటే..?

మాజీ సీఎం కోసం.. 9 హత్యలు చేశా.. లైవ్‌లో ఒప్పుకున్న ఎమ్మెల్యే!

రాత్రి నూడుల్స్.. ఉదయానికి శవాలు.. ఒకే కుటుంబంలో 5 గురు మృతి!

ఈ నెలలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. ఆ రెండు అంశాలపై వాడీ వేడీ రచ్చ!

Big Stories

Advertisement
×