BigTV English

US President Elections : అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో జో బైడెన్ తొలి గెలుపు.. మెరియన్ విలియమ్స్‌పై విజయం..

US President Elections : అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో జో బైడెన్ తొలి గెలుపు.. మెరియన్ విలియమ్స్‌పై విజయం..

America : అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో జో బైడెన్ డెమోక్రటిక్‌ పార్టీ తరఫున తొలి గెలుపు నమోదు చేశారు. దక్షిణ కరోలినా ప్రైమరీలో ఆయన ఘన విజయం సాధించారు. మిన్నెసొటా ప్రతినిధి డీన్‌ ఫిలిప్స్‌, రచయిత మెరియన్ విలియమ్సన్‌పై జో బైడెన్ విజయం సాధించారు. 2020లో అంచనాలను తలకిందులు చేస్తూ దక్షిణ కరోలినా ఓటర్లు తన విజయానికి బాటలు వేశారని ఆయన పేర్కొన్నారు. 2024లోనూ తిరిగి ఇదే పునరావృతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు .


ఈ సందర్భంగా డ్రోనాల్డ్ ట్రంప్ పై అధ్యక్ష పదవికి పోటీ చేయటంపై స్పందించారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌నకు ఓటమి తప్పదని ఆయన తెలిపారు. అమెరికాలో దక్షిణ కరోలినాలో రిపబ్లికన్లకు మంచి పట్టున్న ప్రాంతం. ఇక్కడి ఓటర్లలో 26 శాతం నల్లజాతీయులే నివాసం ఉంటున్నారు. అమెరికా దేశం మొత్తం ఓటర్లలో వీరు 11 శాతాన్ని కలిగి ఉన్నారు. దీంతో వీరి ఓట్లు గెలుపు, ఓటమిల్లో కీలకంగా మారుతాయి.

గత ఎన్నికల్లో ప్రతి 10 మంది నల్లజాతీయుల్లో 9 మంది బైడెన్‌కు ఓటేశారని ఏపీ ఓట్‌క్యాస్ట్‌ సర్వేల్లో ప్రకటించింది. తాజా ప్రైమరీలోనూ బైడెన్‌ గెలుపునకు వారే కారణమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఫిబ్రవరి 6 నెవాడాలో, ఫిబ్రవరి 27న మిషిగన్‌ రాష్ట్రంలో, మార్చి 5న పలు రాష్ట్రాల్లో డెమోక్రటిక్‌ పార్టీ ప్రైమరీలు జరగనున్నాయి.


Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×