BigTV English

Bride Family Escape: అనుకోని పరిచయం.. పెళ్లికి ముందు పెళ్లికూతురు ఫ్యామిలీ ఎస్కేప్.. ఏం జరిగింది..?

Bride Family Escape: అనుకోని పరిచయం.. పెళ్లికి ముందు పెళ్లికూతురు ఫ్యామిలీ ఎస్కేప్.. ఏం జరిగింది..?

Shock to Groom Bride Family Escaped: పెళ్లి అంటే ఆ మజాయే వేరు..మ్యారేజ్ సెట్ అయిన తర్వాత అమ్మాయి -అబ్బాయి గురించి కుటుంబసభ్యులు ఆరా తీసేశారు. పాజిటివ్ సంకేతాలుంటే మ్యారేజ్ చేసేవారు. ఇదంతా ఒకప్పుడు రోజుల మాట.


టెక్నాలజీ యుగంలో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న రోజులివి. ఇవాళ అబ్బాయి-అమ్మాయి చూసుకోవడం, రేపు మ్యారేజ్ చేసుకోవడం.. పరిస్థితులు అనుకూలించకపోతే విడిపోయే రోజులివి. కానీ యూపీలో సోనూ పరిస్థితి డిఫరెంట్. చండీఘర్‌లో ఓ అమ్మాయితో ఏర్పడిన పరిచయం కాస్త పెళ్లికి దారితీసింది. పెళ్లి రోజు అమ్మాయి ఫ్యామిలీ ఎస్కేప్ అయ్యింది.

ఉత్తర‌‌ప్రదేశ్‌లోకి లక్నోకు చెందిన సోనుకు చంఢీఘర్‌లో ఓ అమ్మాయితో పరిచయం ఏర్పడింది. అమ్మాయి పేరు కాజల్, ఊరు చండీఘర్ అని చెప్పింది. మాటా మాటా కలవడంతో ఇద్దరి మధ్య ఫ్రెండ్ షిప్‌‌కు దారి తీసింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెళ్లికి అమ్మాయి తండ్రి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చే శాడు.


Also Read:

జూలై 11న పెళ్లికి ముహూర్తం పెట్టుకోవాలని కాజల్ తండ్రి.. కాబోయే అల్లుడికి చెప్పాడు. ఈ తతంగ మంతా ఫోన్‌లో జరిగింది. మ్యారేజ్ కోసం కుటుంబసభ్యులు, బంధువులతో కలిసి వరుడు సోనూ, అమ్మాయి చెప్పిన చిరునామాకు వెళ్లాడు. అమ్మాయి ఇచ్చిన అడ్రస్ ఎక్కడ కనిపించలేదు. దాదాపు నాలుగైదు గంటల సేపు వరుడు, బంధువులు వెతికారు. కనీసం పెళ్లి మండలం కూడా కనిపించలేదు.

చివరకు కాజల్ కుటుంబసభ్యులకు ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ అని వచ్చింది. కాజల్, వారి ఫ్యామిలీ గురించి ఆరా తీశాడు సోనూ. అలాంటివారు ఆ ప్రాంతంలో ఎవరూ లేరని తెలిసి వరుడు సోనూ అవాక్కయ్యాడు. దీనిపై కుటుంబసభ్యులు సోనూను ప్రశ్నించారు. తాను అమ్మాయి తండ్రిని కేవలం ఫోన్‌లో మాత్రమే మాట్లాడనని, ఆయనే ముహూర్తం ఫిక్స్ చేశారని తెలిపాడు.

Also Read:  నేను నిర్దోషిని.. తొలిసారి స్పందించిన పూజా ఖేడ్కర్

పెళ్లికి కాజల్ కూడా ఓకే చెప్పిందన్నాడు సోనూ. వారి మాటలు నమ్మి ఆ గ్రామానికి వెళ్లిన వరుడు, బంధువు లకు చేదు అనుభవం ఎదురైంది. ఈ వ్యవహరంపై సోనూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వధువు కుటుంబ సభ్యుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు పోలీసులు. అబ్బాయి.. ఇలాంటి పరిచయాలు, పెళ్లిళ్ల విషయంలో ఒకటిరెండు సార్లు ఆలోచించి పెద్దల సలహాలు తీసుకుంటే మంచింది. లేకుంటే సోనూ పరిస్థితే ఎదురవుతుంది.

Tags

Related News

New House To MPs: ఎంపీలకు 184 కొత్త ఇళ్లను ప్రారంభించిన పీఎం.. ఈ 5 బెడ్ రూమ్ ఫ్లాట్స్ ప్రత్యేకతలు ఇవే

Retail Real Estate: మళ్లీ ఊపందుకున్న రీటైల్ రియల్ ఏస్టేట్.. ఏకంగా 69 శాతానికి..?

Supreme Court: లక్షల వీధి కుక్కలను షెల్టర్లకు తరలించండి.. సుప్రీం సంచలన ఆదేశాలు

Delhi Politics: ఢిల్లీలో రాహుల్, ప్రియాంక అరెస్ట్, భగ్గుమన్న విపక్షాలు, ప్రజాస్వామ్యం కోసమే పోరాటం-సీఎం రేవంత్

Air India: మరో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. ఫ్లైట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

Big Stories

×