BigTV English

Pooja Khedkar: నేను నిర్దోషిని.. తొలిసారి స్పందించిన పూజా ఖేడ్కర్

Pooja Khedkar: నేను నిర్దోషిని.. తొలిసారి స్పందించిన పూజా ఖేడ్కర్

Pooja Khedkar: మహారాష్ట్ర ట్రెయినీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ వివాదం రోజు రోజుకు ముదురుతోంది. తప్పుడు సర్టిఫికెట్స్ సమర్పించి ఎంబీబీఎస్‌లో చేరినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆమె తొలిసారి స్పందించారు. వాటి గురించి తాను నిపుణుల ముందు ప్రస్తావించానని అన్నారు. ప్రస్తుతం విచారణ జరుగుతోందని తెలిపారు. ప్రజలందరూ దీనిని గమనిస్తున్నారని తెలిపారు.


నిపుణుల కమిటీ ముందే వాంగ్మూలం ఇస్తాను.. విషయాలను అన్నింటినీ వారితో ప్రస్థావిస్తా. కమిటీ తుది నిర్ణయానికి కట్టుడి ఉంటా. ప్రస్తుతం ఏం విచారణ జరుగుతుందో నేను మీకు చెప్పలేను. వాటన్నింటినీ తర్వాత వెల్లడిస్తాను.. నేరం రుజువు అయ్యేంతవరకు అందరూ నిర్దోషులే మీడియా నన్ను దోషిగా చూపించడం తప్పు అని పూజా ఖేడ్కర్ అన్నారు.

ఇదిలా ఉంటే మరోవైపు ఖేడ్కర్ తల్లిదండ్రుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఓ భూ వివాదం వ్యవహారంలో ఆమె తల్లి మనోరమ కొందరిని గన్‌తో బెదిరించిన వీడియో కూడా వైరల్‌గా మారింది. దీంతో పూజా తల్లిదండ్రులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు వారి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా బాణీ ప్రాంతంలోని మనోరమ దిలీప్ ఖేడ్కర్ నివాసానికి వెళ్లారు. లోపల తలుపు లాక్ చేసి ఉన్నట్లు గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు.


Also Read: పంక్చర్ షాప్ తెరవండి.. విద్యార్థులకు బీజేపీ ఎమ్మెల్యే సలహా

పుణేలోని ఓ గ్రామంలో భూవివాదం విషయంలో మనోరమ తన సెక్యూరిటీ గార్డుతో కలిసి ఇష్టం వచ్చినట్లు బెదిరింపులకు దిగుతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వ్యవహారంలో వారిపై కాకుండా.. మరో నలుగురిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణకు పిలిచినా మనోరమ దంపతులు రాలేదని మొబైల్ ఫోన్లు స్విచాఫ్ చేశారని పోలీసులు తెలిపారు. వారిపై చట్టపరంగా తీసుకుంటాం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Tags

Related News

Alien Attack on Earth: దూసుకొస్తున్న UFO! భూమిపై ఏలియన్స్ దాడి.. ఎప్పుడంటే!

NIRF Rankings 2025: NIRF ర్యాం‘కింగ్‌’లో ఐఐటీ చెన్నై.. ఐఐఎం అహ్మదాబాద్, తెలుగు రాష్ట్రాల యూనివర్సిటీలెక్కడ?

Delhi: పొంగిన యమునా నది.. ఫ్లైఓవర్ మధ్య భారీ హోల్, ఆటోకు తప్పిన ప్రమాదం

Scholarship scheme: అదిరిపోయే స్కీమ్.. ఇంటర్ పాసైతే చాలు.. ఏడాదికి రూ.20వేలు పొందొచ్చు..

Onam Tragedy: హుషారుగా డ్యాన్స్.. ఒక్కసారిగా ఆగిన గుండె.. కళ్ళముందే కుప్పకూలిన అసెంబ్లీ ఉద్యోగి!

Solar Storm: భూమికి మరో ముప్పు.. ముంచుకోస్తున్న సౌర తుఫాన్..

Big Stories

×