BigTV English

Tunnels Of Maoist : అండర్ గ్రౌండ్ సామాజ్ర్యం.. మావోయిస్టుల కొత్త స్కెచ్.. హమాస్‌ను ఫాలో అవుతున్నారా..?

Tunnels Of Maoist : అండర్ గ్రౌండ్ సామాజ్ర్యం.. మావోయిస్టుల కొత్త స్కెచ్.. హమాస్‌ను ఫాలో అవుతున్నారా..?

Tunnels Of Maoist : మావోయిస్టుల వ్యూహాలు భద్రతా బలగాలను కలవరపెడుతున్నాయి. వారు హమాస్‌ను ఫాలో అవుతున్నారా..? కూంబింగ్ దళాల్ని దెబ్బతీయడానికి కొత్త స్కెచ్‌ వేశారా..? అండర్‌ గ్రౌండ్‌లో పెద్ద సామ్రాజ్యాన్నే సృష్టించుకున్నారా..? అంటే అవుననే సమాధానం చెప్పొచ్చు. దంతెవాడలో భారీ సొరంగం చూశాక.. పోలీసులే అవాక్కు అయ్యారంటే దాని నిర్మాణం ఏ విధంగా ఉందో ఊహించవచ్చు.


మావోయిస్టులు సొరంగం ఏర్పాటు చేసుకున్నారు. తమను తాము కాపాడుకోవటంతోపాటు వారి వద్ద ఉన్న ఆయుధాలను దాచేందుకు ఏకంగా కొత్త సామ్రాజాన్నే సృష్టించుకున్నారు. పక్కా సమాచారంలో అక్కడకి వెళ్లిన పోలీసులు.. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆ ప్రదేశాన్ని చూసి.. చత్తీస్‌గఢ్‌ అడవుల్లో ఏం జరుగుతోందనే ఆలోచనలో పడ్డారు.

గతంలో మావోయిస్టులు అడవులను అండగా చేసుకుని పోరాటాలు చేసేవారు. అయితే.. దంతెవాడ అడవుల్లో వారు ఏకంగా భారీ సొరంగాలు ఏర్పాట్లు చేసుకున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అందులోనే వారు భద్రతంగా ఉండటంసహా తమ ఆయుధాలను దాచుకుంటున్నారు. అడవుల్లో అసలు గుర్తించేందుకు కూడా అవకాశం లేకుండా.. చదును నేలపై కొన్ని ఇనుప రాడ్డులను అడ్డంగా పెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఆ ఇసుపరాడ్డులను తొలగించి కిందకు దిగితే.. బాహుబలిని మించిన సెట్టు లాంటి సొరంగం బయటపడింది.


ఒక మనిషి నడిచే వెళ్లే అంత వెడల్పుతో.. గాలి, వెలుతురు కోసం తెరచి ఉంచిన ఈ సొరంగాల వీడియోలను భద్రతా బలగాలు విడుదల చేశాయి. వీటిని చూసిన వారంతా.. ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Related News

Himachal floods: ఉత్తరాదిలో వర్ష బీభత్సం.. ఉప్పొంగిన రావి, బియాస్‌ నదులు

Modi New Strategy: అమెరికాను దెబ్బ కొట్టేందుకు మోదీ స్వదేశీ మంత్రం.. ఫలిస్తుందా?

Tariff Affect: ట్రంప్ సుంకాల మోత అమలులోకొచ్చింది.. ఎక్కువ ప్రభావం వీటిపైనే

Bihar: బీహార్ యాత్రలో సీఎం రేవంత్.. రాహుల్ గాంధీ ప్లాన్ అదేనా!

Jammu Kashmir: ఘోర ప్రమాదం.. కొండచరియలు విరిగిపడి 30 మంది మృతి..

Trump-Modi: 4సార్లు ట్రంప్ ఫోన్ కాల్ కట్ చేసిన మోదీ.. జర్మనీ పత్రిక సంచలన కథనం

Big Stories

×