BigTV English

Dev Raturi : చైనా పాఠ్యపుస్తకాల్లో భారతీయుడు!

Dev Raturi : చైనా పాఠ్యపుస్తకాల్లో భారతీయుడు!
Dev Ratur

Dev Raturi in chinese text books (today’s international news)

పేరుకి రైతు కుటుంబమే కానీ.. సరిగ్గా తిండి కూడా దొరకనంత పేదరికం. తల్లిదండ్రులు, ఐదుగురు తోబుట్టువులకు అండగా నిలబడాల్సిన పరిస్థితి. కుటుంబం కోసం చిన్నాచితకా పనులెన్నో చేశాడు. పాలు అమ్మాడు. వెయిటర్ పని చేస్తూనే కారు డ్రైవర్ అవతారం ఎత్తాడు. సీన్ కట్ చేస్తే.. ఇప్పుడతను చైనీయులకు స్ఫూరిప్రదాత. ఓ ప్రముఖ నటుడు. అతని విజయగాథ అక్కడి విద్యార్థులకు ఓ పాఠ్యాంశం. పలు హోటళ్లకు అధిపతి. పుట్టి పెరిగింది భారతదేశంలో అయినా.. డ్రాగన్ దేశంలో నీరాజనాలు అందుకుంటున్న ఆ వ్యక్తి.. దేవ్ రతూడీ.


బ్రూస్ లీ అంటే దేవ్‌కి అమితమైన అభిమానం. చిన్నతనం నుంచీ మార్షల్ ఆర్ట్స్ అంటే మక్కువ. అదే అతడిని ఉత్తరాఖండ్‌లోని తేహ్రీ గర్వాల్‌ నుంచి చైనాకు చేర్చింది. దేవ్ 1976లో కెమ్రియాసౌర్ అనే చిన్న పల్లెటూరులో జన్మించాడు. పదో తరగతి పూర్తి కాగానే ఢిల్లీకి చేరాడు. కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు చిన్నాచితకా పనులెన్నో చేశాడు. బ్రూస్‌లీ సినిమాలు చూసి.. నటుడిని కావాలన్న అభిలాష కలిగింది అక్కడే. దీంతో సినిమాల్లో చాన్స్ కోసం 1998లో ముంబై వెళ్లాడు.

అంతా మనం అనుకున్నట్టే జరిగితే జీవితం ఎలా అవుతుంది? ముంబైలో అవకాశాలేవీ దొరకక గోడకు కొట్టిన బంతిలా తిరిగి ఢిల్లీకే చేరాల్సి వచ్చింది. అది దేవ్‌కు కోలుకోలేని దెబ్బ. ఆ తర్వాత అపజయం అన్నది చవిచూడలేదు. చైనాకు వెళ్లాలన్న కల 2005లో నెరవేరింది. చైనాలో ఇండియన్ రెస్టారెంట్లను నిర్వహిస్తున్న వ్యాపారవేత్త ఓ స్నేహితుడి ద్వారా పరిచయం అయ్యారు. వెయిటర్ ఉద్యోగం చేసే అవకాశం ఆయన ద్వారా లభించడంతో దేవ్ వెంటనే ఒప్పేసుకున్నాడు. ఆ స్నేహితుడే షెన్‌జాన్‌కు టికెట్లు కొని స్వయంగా విమానం ఎక్కించాడు.


చైనాలో పగలు వెయిటర్‌గా పనిచేస్తూనే రాత్రిళ్లు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు. చూస్తుండగానే ఐదేళ్లు గిర్రున తిరిగిపోయాయి. వెయిటర్ నుంచి సూపర్‌వైజర్ స్థాయికి.. ఆపై జనరల్ మేనేజర్ స్థాయికి చేరుకున్నాడు. ఆ అనుభవంతో 2013లో సొంతంగా రెస్టారెంట్‌ను ఆరంభించాడు. జియాన్‌లో నివసిస్తున్న దేవ్.. ప్రస్తుతం 13 గొలుసుకట్టు హోటళ్లకు యజమాని. యాంబర్ ప్యాలెస్ రెస్టారెంట్ అంటే అక్కడ తెలియనివారుండరు.

జీవితంలో ఎదిగేందుకు షార్ట్‌కట్లు ఏవీ ఉండవని.. నిర్విరామ శ్రమతోనే తానీ స్థితికి చేరానని అంటాడు 47 ఏళ్ల దేవ్. విఫల ఇంటర్య్వూలు, ఇంటర్నెట్ ద్వారా తాను ఎంతో నేర్చుకున్నానని చెప్పాడు. హోటల్ మేనేజ్‌మెంట్ డిగ్రీ ఏదీ లేకున్నా.. రూ.15 వేల నుంచి రూ.3.5 లక్షల నెల వేతనం సంపాదించే స్థాయికి చేరుకున్నానని గుర్తుచేశాడు. రోజుకు 18 గంటల కష్టపడటం ద్వారా జీవత మెళకువలను నేర్చుకున్నానని.. నిపుణతను సాధించగలిగానని గర్వంగా చెప్పాడు.

రెస్టారెంట్ నిర్వహణ నుంచి సినిమారంగంలోకి దేవ్ రంగప్రవేశం కూడా గమ్మత్తుగా సాగింది. చెంగ్డు ప్రావిన్స్‌లో 2015లో ఎంతో ఆకర్షణీయంగా ఉండే ఓ రెస్టారెంట్‌ను ఆరంభించాడు. అక్కడి ఏర్పాట్లు, అలంకరణకు చైనీస్ డైరెక్టర్ తాంగ్ ఎంతో ముగ్ధుడయ్యాడు. దేవ్ రెస్టారెంట్ లో ఒక సీన్‌ను చిత్రీకరించాలని ఆ డైరెక్టర్ నిర్ణయించాడు. తాను తీస్తున్న టీవీ సిరీస్‌లో చిన్న పాత్రను కూడా దేవ్‌కు ఆఫర్ చేశాడాయన. అలా నటనా రంగంలోకి కాలుమోపిన దేవ్ ఇప్పటివరకు 20 సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటించాడు.

జియాన్‌లో ఏడో తరగతి విద్యార్థులకు దేవ్ జీవితాన్ని ఓ పాఠంగా బోధిస్తున్నారు. ఎంత ఎత్తుకు ఎదిగినా తన మూలాలను మాత్రం మరిచిపోలేదు దేవ్. తాను పుట్టిన గ్రామం నుంచి యువకులకు ఎన్నో అవకాశాలు కల్పించాడు. ఇరు దేశాలకు చెందిన 100 మంది పనిచేస్తున్నారు. సంపాదనలో మూడోవంతు మేర భారత్, చైనా దేశాల్లో ఛారిటీకి కేటాయిస్తుండటం విశేషం.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×