E-Paper
Advertisement

గ్యాస్ కష్టాలు తీరినట్టే.. ఆలస్యం లేకుండా క్షణాల్లో గ్యాస్ డెలివరీ, వినియోగదారుల క్యూ లైన్ మాటేంటి?

గ్యాస్ కష్టాలు తీరినట్టే.. ఆలస్యం లేకుండా క్షణాల్లో గ్యాస్ డెలివరీ, వినియోగదారుల క్యూ లైన్ మాటేంటి?
Advertisement

LGP Gas: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో నౌకలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఫలితంగా చమురు కష్టాలు తీవ్రమయ్యాయి. గ్యాస్ లేక చాలామంది వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితి గమనించిన గ్యాస్ కంపెనీలు ఐదు కేజీల సిలిండర్లను రంగంలోకి దించాయి. ఎలాంటి ఆలస్యం లేకుండా వెంటనే వెళ్లి సంబంధిత డీలర్ వద్దకు వెళ్లి తెచ్చుకోవచ్చు. ప్రస్తుతానికి ఇది ఉపశమనం మాత్రమే.

గ్యాస్ కష్టాలు తీరినట్టే.. ఆలస్యం లేకుండా క్షణాల్లో గ్యాస్ డెలివరీ

Advertisement

ఇరాన్ యుద్ధం నేపథ్యంలో చాలా దేశాల్లో చమురు సంక్షోభం వెంటాడుతోంది. ఫలితంగా పరిశ్రమలు మూతపడ్డాయి. ముఖ్యంగా ఇండియా లాంటి దేశాల్లో ఈ పరిస్థితి మరింత జఠిలంగా మారింది. హోర్మూజ్ జలసంధి మూసివేయడంతో ఉన్న నిల్వలతో మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాయి దేశంలోని ఆయిల్ కంపెనీలు. వివిధ దేశాల నుంచి చమురు దిగుమతి చేసుకుంటోంది భారత్.

గ్యాస్ సిలిండర్లకు ఎలాంటి కొరత లేదని కంపెనీలు పదే పదే చెబుతున్నాయి. కానీ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. వివిధ ఏజెన్సీల వద్ద గ్యాస్ సిలిండర్ల కోసం గృహ వినియోగదారులు భారీగా క్యూ కట్టిన సందర్భాలు కళ్లకు కనిపిస్తున్నాయి. పరిస్థితి గమనించిన చమురు సంస్థలు కొత్త ఆలోచనకు పదును పెట్టాయి. ఉన్న సంక్షోభాన్ని నివారించాలంటే ఒక్కటే మార్గమని భావించాయి.

Advertisement

ఐదు కిలోల గ్యాస్ సిలిండర్లను దించిన గ్యాప్ కంపెనీలు

ఈ నేపథ్యంలో 5 కేజీల గ్యాస్ రంగంలోకి తెచ్చింది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. ఛోటు పేరుతో 5 కేజీల ఎల్పీజీ సిలిండర్ సామాన్యులకు అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం బ్యాచిలర్స్, వలస కార్మికులకు ఉపయోగకరంగా మారింది. ఛోటు అంటే ఏమిటి? అనేది అసలు ప్రశ్న. ఇండియన్ ఆయిల్ సంస్థ కంపెనీ పేరు మీద ఐదు కేజీల ఎల్పీజీ సిలిండర్‌ను ప్రమోట్ చేస్తోంది.

దీనికి ఎలాంటి గ్యాస్ బుకింగ్ చేయాల్సిన అవసరం లేదు. నేరుగా ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ వద్దకు వెళ్లి డబ్బులు చెల్లించి క్షణాల్లో గ్యాస్ సిలిండర్లను తీసుకోవచ్చు. చిన్న సిలిండర్ సౌకర్యవంతంగా ఉండటమే కాదు, ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లవచ్చు కూడా.  ఈ ఐదు కేజీల గ్యాస్ సిలిండర్ పొందాలంటే ఏం కావాలి. అడ్రస్ ప్రూఫ్ అవసరం లేదు, కేవలం ఐడీ కార్డ్ ఉంటే సరిపోతుంది.

ALSO READ: రాఘవ్ చద్దాను మోకాళ్లపై కూర్చోబెట్టి మరీ కొట్టారా? అసలు విషయం చెప్పిన ఆప్ మాజీ నేత

సాధారణ గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలంటే ఆధార్ కార్డు, అడ్రస్ ప్రూఫ్, ఇతర డాక్యుమెంట్లు కావాలి. కానీ ఛోటు సిలిండర్ కొనుగోలుకు అడ్రస్ ప్రూఫ్ ఉంటే సరిపోతుంది. ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ-FTL కేటగిరీ కిందకు వస్తుంది. అత్యవసరంగా గ్యాస్ కావాల్సిన వారికి ఇదొక అద్భుతమైన ప్రత్యామ్నాయం. రెగ్యులర్ సిలిండర్ బుక్ చేసినా అది వచ్చే లోపు వంట ఆగిపోకూడదని అనుకునేవారికి బ్యాకప్ మాదిరిగా వినియోగించుకోవచ్చు.

 

Related News

రిలయన్స్, బ్లింకిట్, జొమాటో సిబ్బందిపై కేసు నమోదు.. ఎందుకంటే..?

మాజీ సీఎం కోసం.. 9 హత్యలు చేశా.. లైవ్‌లో ఒప్పుకున్న ఎమ్మెల్యే!

రాత్రి నూడుల్స్.. ఉదయానికి శవాలు.. ఒకే కుటుంబంలో 5 గురు మృతి!

ఈ నెలలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. ఆ రెండు అంశాలపై వాడీ వేడీ రచ్చ!

ఢిల్లీలో వీడని సస్పెన్స్.. అభిజిత్ దీప్కే ఆచూకిపై గందరగోళం.. నేహా బోరా తీవ్ర ఆరోపణలు!

బీజేపీ అగ్రనేతకు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిన ఎల్.కే. అద్వానీ.. ప్రస్తుతం ఎలా ఉన్నారంటే?

స్పామ్, ఫ్రాడ్ కాల్స్‌ టెన్షన్‌కు ఇక చెక్.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం?

ప్రపంచాన్ని సైతం కదిలించిన చరిత్ర.. అక్టోబర్ 17 ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా..?

Big Stories

Advertisement
×