E-Paper
Advertisement

Karnataka : పాల పాలిటిక్స్.. అమూల్ వద్దు..నందిని ముద్దు..

Karnataka : పాల పాలిటిక్స్.. అమూల్ వద్దు..నందిని ముద్దు..
Advertisement

Karnataka : కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయం హీటెక్కింది. అమూల్ పాల వ్యవహారం కాస్తా పొలిటికల్ టర్న్ తీసుకుంది. కర్ణాటకలో పాల వ్యాపారాన్ని విస్తరిస్తామని అమూల్ ప్రకటించడం అధికార బీజేపీకి చిక్కులు తెచ్చిపెట్టింది. వ్యాపార విస్తరణలో భాగంగా తమ మిల్క్ ప్రొడక్ట్స్‌ను బెంగళూరులో ప్రారంభిస్తామని అమూల్ సంస్థ ప్రకటించింది. అలాగే నందిని పాల సంస్థను అమూల్‌లో విలీనం చేయాలనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. దీంతో ఒక్కసారిగా వివాదం రాజుకుంది.

అమూల్ పాల ఉత్పత్తులను కర్ణాటకలోకి రానిచ్చే ప్రసక్తే లేదంటూ కాంగ్రెస్, జేడీఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమూల్ పాల సరఫరాపై నిషేధం విధించాలని ప్రతిపక్ష నేతలతోపాటు పలు కన్నడ సంస్థలు డిమాండ్ చేశాయి. గుజరాత్‌కు చెందిన అమూల్‌కు నందిని బ్రాండ్ ను అప్పగించేందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి..

Advertisement

కర్ణాటక పాడి ఉత్పత్తిదార్ల సహకార సంఘాల సమాఖ్యకు చెందిన నందిని బ్రాండ్ పాలకు బెంగళూరు హోటళ్ల యజమానుల సంఘం పూర్తి మద్దతు ప్రకటించింది. ఇకపై నగరంలోని తమ హోటళ్లలో నందిని పాలు, పాల ఉత్పత్తులను మాత్రమే వినియోగిస్తామని ప్రకటించింది. రాష్ట్రంలోని రైతులను ఆదుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని బృహత్ బెంగళూరు హోటల్ అసోసియేషన్ ప్రకటించింది. దీంతో బెంగళూరులో తమ వ్యాపారాన్ని విస్తరింపజేయాలనుకున్న అమూల్ సంస్థకు ఊహించని షాక్ ఎదురైంది. సోషల్‌మీడియాలో సేవ్ నందిని.. గోబ్యాక్ అమూల్ హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండింగ్ లో ఉంది.

మరి కర్ణాటకలో ఎన్నికల వేళ తలెత్తిన పాల వివాదం ప్రతిపక్షాలకు మేలు చేస్తుందా..? బీజేపీకి షాక్ తగులుతుందా..? బీజేపీ పాల వివాదాన్ని ఎలా ఎదుర్కొంటుందనేది ఆసక్తిగా మారింది.

Related News

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

Big Stories

Advertisement
×