BigTV English

Tigers : భారత్ లో పులులు గాండ్రింపు.. దేశంలో ఎన్ని ఉన్నాయో తెలుసా..?

Tigers : భారత్ లో పులులు గాండ్రింపు.. దేశంలో ఎన్ని ఉన్నాయో తెలుసా..?

Tigers : దేశంలో ఏటా పులుల సంఖ్య పెరుగుతోంది. 2022 నాటికి పులుల సంఖ్య 3,167కు చేరింది. కర్ణాటక మైసూరులో ప్రాజెక్ట్‌ టైగర్‌ స్వర్ణోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ పులుల తాజాగా లెక్కలు వెల్లడించారు. అఖిల భారత పులుల అంచనా నివేదికను విడుదల చేశారు.


ప్రధాని చెప్పిన వివరాలు ప్రకారం..దేశంలో పులుల సంఖ్య 2006లో 1,411, 2010లో 1,706, 2014లో 2,226, 2018లో 2,967, 2022లో 3,167గా ఉంది. భారత్‌ కేవలం పులులను సంరక్షించడమే కాకుండా.. వాటి సంఖ్య పెరగడానికి అనువైన వాతావరణాన్ని సృష్టించిందని ప్రధాని మోదీ అన్నారు. ప్రాజెక్ట్‌ టైగర్‌ విజయవంతం కావడం కేవలం యావత్‌ ప్రపంచానికి గర్వకారణమని అన్నారు.

అంతర్జాతీయ పులల కూటమిని మోదీ ప్రారంభించారు. ఈ కూటమి ప్రపంచవ్యాప్తంగా ఏడు రకాల పులుల సంరక్షణకు కృషి చేస్తుందని తెలిపారు. పులుల సంరక్షణ కార్యక్రమం విజయానికి చిహ్నంగా రూ.50 స్మారక నాణేన్ని ఆవిష్కరించారు. అమృత్‌ కాల్‌లో పులుల సంరక్షణకు సంబంధించిన ప్రణాళికను మోదీ విడుదల చేశారు. ప్రకృతిని రక్షించడం భారత సంస్కృతిగా పేర్కొన్నారు. ప్రపంచంలోని మొత్తం పులలలో 75 శాతం భారత్‌లోనే ఉన్నాయని వివరించారు.


ప్రపంచ భూభాగంలో భారత్‌ వాటా 2.4 శాతంగా ఉన్న విషయాన్ని మోదీ గుర్తు చేశారు. ప్రపంచ జీవవైవిధ్యంలో 8 శాతం వాటా భారతదేశానిదని తెలిపారు. నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి ఇటీవల చీతాలను భారత్‌కు తీసుకొచ్చిన విషయాన్ని ప్రధాని గుర్తుచేశారు. దాదాపు 30 వేల ఏనుగులతో ప్రపంచంలోనే అత్యధిక ఆసియా ఏనుగులు ఉన్న దేశంగా భారత్‌ నిలిచిందని తెలిపారు.

Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×