E-Paper
Advertisement

కేవలం ప్రియుడి కోసం.. కవలలను చంపిన కసాయి తల్లి, రాజస్థాన్‌లో దారుణం

కేవలం ప్రియుడి కోసం.. కవలలను చంపిన కసాయి తల్లి, రాజస్థాన్‌లో దారుణం
Advertisement

Rajasthan: అక్రమ సంబంధాలు పచ్చని సంసారంలో చిచ్చుపెడుతున్నాయి. ఫలితంగా ఫ్యామిలీలు చిన్నాభిన్నం కావడం, హత్యలకు పాల్పడడం వంటి ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా అలాంటి ఘటన రాజస్థాన్‌లో వెలుగుచూసింది. తన అక్రమ సంబంధానికి తన ట్విన్స్ అడ్డుగా ఉన్నారని భావించి చంపేసింది కసాయి తల్లి. అసలే ఏం జరిగింది?

రాజస్థాన్‌లో దారుణమైన ఘటన

యూపీలోని హత్రాస్ జిల్లాకు చెందిన నిరంజన్ సింగ్‌-ప్రీతికి రెండు దశాబ్దాల కింద వివాహం జరిగింది. ఈ జంటకు నలుగురు పిల్లలు. కూతురికి 18 ఏళ్లు కాగా, కొడుక్కి 6 ఏళ్లు. కవలలు 13 ఏళ్లు ఉంటాయి. హాయిగా సాగుతున్న ఈ దంపతుల జీవితంలో కోలుకోలేని దెబ్బ తగిలింది. కొన్నేళ్ల కిందట భర్త నిరంజన్ మృతి చెందాడు. దీంతో భార్య ప్రీతి తన పిల్లలను తీసుకుని పుట్టింటికి వచ్చేసింది. ఆమె సొంత గ్రామం బడేస్రా.

ప్రియుడి కోసం.. కవలలను చంపిన కసాయి తల్లి

Advertisement

ప్రీతి ఆ గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. దీన్ని కవల పిల్లలు తీవ్రంగా వ్యతిరేకించారు. పెద్ద కొడుకు, కూతురు తల్లికి మద్దతుగా నిలిచాడు.  తమ ప్రేమకు కవలలు అడ్డుగా మారుతున్నారని భావించింది ప్రీతి. ఈ విషయాన్ని తన ప్రియుడితో చెప్పింది. కవలలను అడ్డు తొలగించుకోవాలని ప్రీతి, ఆమె లవర్ నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ప్రియుడిని ఇంటికి పిలిపిన ప్రీతి, పెద్ద కుమారుడితో కలిసి హత్యకు ప్లాన్ చేసింది.

వారితో కవల పిల్లల గొంతులు కోయించి హత్య చేయించింది. మంగళవారం తెల్లవారుజామున బయటకు వెళ్లిన పిల్లలు ఎంతకీ రాలేదని డ్రామా క్రియేట్ చేసింది. వారి మేనత్త గాలించగా ఇంటి సమీపంలోని ఓ ఖాళీ స్థలంలో ఇద్దరు కవలలు విగతజీవులుగా పడి ఉన్నారు. ఈ ఘటనపై పిల్లల మేనత్త పోలీసులకు సమాచారం ఇచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు, దర్యాప్తు చేపట్టారు. కేవలం ఆరు గంటల్లో కవలల తల్లి ప్రీతితోపాటు ఆమె ప్రియుడు, పెద్ద కుమారుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

Advertisement

ALSO READ: డార్క్‌వెబ్‌లో ఎస్‌బీఐ కస్టమర్ల డేటా.. అసలేం జరిగింది?

దసరా రోజున ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కవలల మృతదేహాలకు వైద్య బృందం పోస్ట్‌మార్టంకు తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

Related News

ఇన్‌ఫ్లుయెన్సర్ సూసైడ్.. వేధింపుల వెనుక ఏం జరిగింది? చెన్నైలో ఘటన

మోదీ సర్కార్‌ని కూల్చేందుకు కుట్ర.. దసరా వేళ భగవత్ హాట్ కామెంట్స్, పశ్చిమం నుంచి తుఫాను మొదలు

పెళ్లైన జంట.. భర్త ముందే భార్యపై 8 మంది, బీహార్‌లో షాకింగ్ ఘటన

యూకో బ్యాంక్‌లో జాబ్స్.. మొత్తం 530 ఉద్యోగ ఖాళీలు.. ఫ్రెషర్స్‌కు మంచి ఛాన్స్

ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో ఏం జరిగింది.. పారిపోతున్న వ్యక్తిని పట్టేశారు, అసలు గుట్టు బయటకు

కొండ చిలువల తోక పట్టుకుని రీల్స్.. వైరల్ కావడానికి ఏమైనా చేస్తేస్తారా?

టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల కేసులో.. ముగ్గురు నిందితులు అరెస్ట్!

Big Stories

Advertisement
×