E-Paper
Advertisement

డబ్బులిచ్చి మరీ పక్కోడ్ని తొక్కేస్తున్నారా.. పీఆర్ టీమ్స్ పై మిథిలేష్ రియాక్షన్!

డబ్బులిచ్చి మరీ పక్కోడ్ని తొక్కేస్తున్నారా.. పీఆర్ టీమ్స్ పై మిథిలేష్ రియాక్షన్!
Advertisement

Kissik talks Mithilesh Reddy:బిగ్ బాస్ 10 లోకి వైల్డ్ కార్డు ద్వారా అడుగుపెట్టి రెండు రోజుల్లోనే సెల్ఫ్ ఎలిమినేట్ అయిన మిథిలేష్ రెడ్డి (Mithilesh Reddy) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తనదైన పర్ఫామెన్స్ తో హౌస్ లో ఇంకొంత కాలం కొనసాగి విజేత అవుతారని అందరూ అనుకున్నారు. కానీ ఆయన తన స్ట్రాటజీ ఉపయోగించి బిగ్ బాస్ ఇచ్చిన ఆఫర్ తీసుకొని బయటకు వచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అలాంటి మిథిలేష్ రెడ్డి తాజాగా కిస్సిక్ టాక్స్ షోలో పాల్గొని సందడి చేశారు.

పీఆర్ టీమ్స్ పై మిథిలేష్ అభిప్రాయం..

పీఆర్ టీమ్స్ నెగిటివిటీని తప్పించుకొని నువ్వు 15 లక్షలు తీసుకొని బయటకు రావడం సంతోషంగా ఉంది అని తన తల్లి చెప్పినట్టు మిథిలేష్ చెప్పుకొచ్చారు. అయితే ఈ సందర్భంగా వర్షా ప్రశ్నిస్తూ.. అసలు పి.ఆర్ టీమ్స్ ఉన్నాయని మీరు నమ్ముతారా? అని ప్రశ్నించగా..” ఎందుకు ఉండవు? ప్రతి ఒక్క కంటెస్టెంట్ కి కచ్చితంగా పీఆర్ టీమ్ ఉంటుంది. అయితే ఈ పీఆర్ టీమ్స్ చాలా రకాలు.. చాలామంది తమకు పీఆర్ అంటే ఎవరో కూడా తెలియదు అన్నట్లు నటిస్తుంటారు. కానీ ప్రతి ఒక్కరికి ఒక పీఆర్ టీమ్ ఉంటుంది. మన పీఆర్ అనే వాడు ఎలా ఉంటాడు అంటే హౌస్ లో మనం ఇచ్చిన కంటెంట్ ను బయటకు ఎలివేట్ చేసి, ఆడియన్స్ కు దగ్గర చేయాలి.

Advertisement

also read:ఎవరీ మిథిలేష్.. బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?

నెగిటివ్ పీఆర్ వల్లే అసలైన నష్టం..

ఈమధ్య నెగిటివ్ పీఆర్ కూడా మొదలైంది. అది అవతల వాడి మీద పడి ఏడవడం అదొక రకమైన పీఆర్. మనం ఎదగాలన్నా పీఆర్ పెట్టుకోవచ్చు. పక్కోడిని తొక్కేయాలన్నా పీఆర్ పెట్టుకోవచ్చు అంటూ వర్షా కూడా చెప్పుకొచ్చింది. మనం చేసేది బయట జనాలకు వెళ్లి వాళ్ళు మనకు ఓట్లు వేయాలంటే కచ్చితంగా పీఆర్ టీం ఉండాల్సిందే. అందుకే పి ఆర్ పెట్టుకోవడంలో తప్పులేదు అంటూ మిథిలేష్ చెప్పుకొచ్చారు. పాజిటివ్ వేలో మనం ఏం చేసినా తప్పులేదు.. పక్కవాడిని ఇబ్బంది పెట్టకూడదు అంటూ వర్షా కూడా చెప్పుకొచ్చింది. మొత్తానికైతే నెగిటివ్ పిఆర్ ఉన్నారని ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్లు కూడా బయటపెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు బిగ్బాస్ కంటెస్టెంట్ కూడా బయటపెట్టడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

నవదీప్ రియాక్షన్?

Advertisement

ఇకపోతే నవదీప్ అన్నను కూడా నేను కలిశాను. స్మార్టెస్ కంటెస్టెంట్ వి రా నువ్వు.. నా శిష్యుడివి అనిపించుకున్నావని నన్ను పొగిడారు. ఎపిసోడ్ ని చూస్తే అందరికంటే నాగార్జున గారే ఎక్కువ షాక్ అయ్యారు అనిపించింది. నీకంటే కూడా నేనే ఎక్కువ సంతోషంగా ఫీల్ అయ్యాను. చరిత్ర క్రియేట్ చేసావ్ నువ్వు అంటూ నవదీప్ చెప్పినట్లు మిథిలేష్ తెలిపారు.

 

Related News

అగ్ని పరీక్ష పై మిథిలేష్ కామెంట్స్.. బిగ్ బాస్ తరువాతే టెలికాస్ట్ చేయాలంటూ!

మీ ఇంట్లో డబ్బు తీసుకెళ్లానా?రూ.15 లక్షల ట్రోల్స్ పై మిథిలేష్ షాకింగ్ రియాక్షన్!

ఎవరీ మిథిలేష్.. బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?

మిథిలేష్ అసలైన స్ట్రాటజీ.. 15 లక్షలకే కమిట్ అవ్వడం వెనుక ఇంత లాజిక్ ఉందా?

పెళ్లిపై ఊహించని కామెంట్స్ చేసిన ఇనయా సుల్తానా..!

ఇదేం క్రేజ్ మామా.. ‘గాజులు గల గల’ పాటకు జనం ఫిదా!

8 కాదు 12.. ఈ వారం నామినేషన్ లిస్ట్ ఇదే..ఎవరెవరున్నారంటే?

Big Stories

Advertisement
×