Bihar: అర చేతిలోకి సెల్‌ఫోన్ వచ్చిన తర్వాత కొంత మంది కామాంధులుగా మారిపోతున్నారు. కామంతో కళ్లు మూసుకుపోతున్నాయి. ఫలితంగా చేయరాని పనులకు తెగబడుతున్నారు. కొత్తగా పెళ్లైన నవ వధువుపై అత్యాచారానికి పాల్పడ్డారు ఎనిమిది మంది సభ్యుల గ్యాంగ్. అందులో మైనర్ యువకులు ఉన్నారు. సంచలనం రేపిన ఈ ఘటన బీహార్ లో వెలుగుచూసింది. అసలు ఏం జరిగింది?
బీహార్‌లోని తూర్పు చంపారన్ జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఎనిమిది మంది సభ్యుల గల ఓ ముఠా నవ వధువుపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తూర్పు చంపారన్ జిల్లా మధుబన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. పొరుగునున్న షియోహర్ జిల్లాకు చెందిన కొత్త దంపతులు.. దసరా సందర్భంగా తమ పరిచయస్తులను కలవడానికి, దుర్గా పూజా మందిరాలను సందర్శించడానికి తమ బైక్‌పై వెళ్తున్నారు.
బంజారియా సరేహ్ గ్రామం సమీపంలో ఈ జంటను ఎనిమిది సభ్యుల ఓ ముఠా అడ్డగించింది. తొలుత వారి నుంచి డబ్బు డిమాండ్ చేశారు. డబ్బు ఇవ్వలేనని చెప్పడంతో నిందితులు అతడ్ని కొట్టారు. బెదిరించి మొబైల్ ఫోన్ లాక్కున్నారు. ఆ తర్వాత భర్తతో బలవంతంగా ఆన్‌లైన్‌లో రూ. 3,000 బదిలీ చేయించారు. ఆ తర్వాత అతడ్ని కొట్టి, మహిళను సమీపంలోని మామిడి తోటకు తీసుకెళ్లారు. భర్త కళ్ల ముందు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల దాడి తర్వాత బాధితురాలి భర్త స్పృహ కోల్పోయాడు.
ALSO READ: యూకో బ్యాంక్‌లో జాబ్స్.. మొత్తం 530 ఉద్యోగ ఖాళీలు.. ఫ్రెషర్స్‌కు మంచి ఛాన్స్
జరిగిన తతంగాన్ని నిందితులు ఈ వీడియో తీసినట్లు సమాచారం. ఈ ఘటన తర్వాత ఆ జంట అక్కడి నుండి తప్పించుకుని మధుబన్ పోలీస్ స్టేషన్‌లో జరిగినదంతా చెప్పి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన తర్వాత బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన 24 గంటల్లో నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో 38 ఏళ్లు ఒక్కరు ఉండగా, మిగిలిన ఏడుగురు 18 నుంచి 20 ఏళ్ల మధ్య వయసువారు. బాధితుల నుంచి లాక్కున్న ఫోన్‌తోపాటు ఎనిమిది మంది మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులంతా షియోహర్ జిల్లాలోని లాల్‌గఢ్ జిమ్మి సింగ్ తోలా నివాసులుగా తెలుస్తోంది. నిందితులను విచారిస్తున్నారు పోలీసు అధికారులు.