E-Paper
Advertisement

యాపిల్ లవర్స్‌కు పండగలాంటి వార్త.. వచ్చే వారమే మార్కెట్లోకి 4 సరికొత్త గ్యాడ్జెట్స్!

యాపిల్ లవర్స్‌కు పండగలాంటి వార్త.. వచ్చే వారమే మార్కెట్లోకి 4 సరికొత్త గ్యాడ్జెట్స్!
Advertisement

Apple Launch 2026: యాపిల్ లవర్స్‌కి అదిరిపోయే గుడ్ న్యూస్. టెక్ మార్కెట్లో మరోసారి తమ సత్తా చాటేందుకు యాపిల్ సిద్ధమవుతోంది. త్వరలోనే సరికొత్త గ్యాడ్జెట్స్‌తో టెక్ ప్రపంచాన్ని సర్‌ప్రైజ్ చేయబోతోంది. యాపిల్ మార్కెటింగ్ హెడ్ గ్రెగ్ జోస్విక్.. Next Week.. Show and Tell అంటూ ఎక్స్‌ వేదికగా ఇచ్చిన చిన్న హింట్ ఇప్పుడు టెక్ వర్గాల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇంతకీ యాపిల్ తీసుకురాబోతున్న కొత్త ప్రొడక్ట్స్ ఏంటి? టెక్ ప్రియులను ఆకట్టుకునే ఫీచర్లు ఏముండబోతున్నాయి?

ఈ వారంలో లాస్ ఏంజిల్స్ వేదికగా కొత్త గ్యాడ్జెట్స్‌ను పరిచయం చేసేందుకు కంపెనీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈసారి భారీ లాంచ్ ఈవెంట్‌కు బదులుగా ప్రెస్ రిలీజ్‌ల ద్వారా ప్రొడక్ట్స్‌ను అనౌన్స్ చేసి, ఆ తర్వాత మీడియాకు ప్రత్యేకంగా హ్యాండ్స్-ఆన్ సెషన్స్ నిర్వహించే అవకాశం ఉంది. యాపిల్ తమ అభిమానుల కోసం ఎలాంటి సర్‌ప్రైజ్‌లు ప్లాన్ చేసిందో.. అధికారిక ప్రకటన వస్తేనే దీనిపై పూర్తి స్పష్టత వస్తుంది.

వారంలోనే సరికొత్త డివైజెస్‌:

Advertisement

మార్కెట్ నిపుణుల అంచనాల ప్రకారం.. యాపిల్ ఈసారి ఏకంగా నాలుగు కొత్త ప్రొడక్ట్స్‌ని లాంచ్ చేయనుంది. ఇందులో హై-ఎండ్ ఓఎల్‌ఈడీ టచ్‌స్క్రీన్ మాక్‌బుక్ ప్రోతో పాటు, ఎం6 చిప్‌తో కూడిన ఎంట్రీ-లెవెల్ 14-ఇంచ్ మాక్‌బుక్ ప్రో, అప్‌డేటెడ్ ఐమ్యాక్, ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ మార్కెట్లోకి రానున్నాయి. ఇవన్నీ నవంబర్ మొదటి వారంలోనే సేల్‌కి వచ్చే ఛాన్స్ ఉంది.

Also Read: స్మార్ట్‌ఫోన్‌కు అడిక్ట్ అయ్యారా? డిజిటల్ డిటాక్స్ కోసం ఈ 5 మినీ గ్యాజెట్స్‌ను ట్రై చేయండి!

యాపిల్ చరిత్రలోనే తొలిసారి:

Advertisement

లాంచ్‌లో ప్రధాన ఆకర్షణగా నిలవబోయేది ఓఎల్‌ఈడీ టచ్‌స్క్రీన్ మాక్‌బుక్ ప్రోనే. ఇప్పటివరకు లాప్‌టాప్‌లలో టచ్‌స్క్రీన్ పద్ధతిని పక్కన పెట్టిన యాపిల్.. మొదటిసారిగా యూజర్ల కోసం ఈ ఫీచర్‌ని తీసుకురానుంది. ఇందులో డీప్ బ్లాక్స్, రిచ్ కలర్స్‌తో పాటు స్క్రీన్ పైభాగంలో ఉండే నాచ్‌కి బదులుగా ఐఫోన్ లాంటి డైనమిక్ ఐలాండ్ డిజైన్ ఉండొచ్చని టాక్. అయితే ఈ మోడల్స్‌లో ఎం5 ప్రో, ఎం5 మాక్స్ చిప్‌లనే వాడే అవకాశం ఉండటంతో ధర కాస్త ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది.

శక్తివంతమైన మాక్‌బుక్, ఐమ్యాక్:

కేవలం హై-ఎండ్ మోడల్స్ మాత్రమే కాకుండా.. సాధారణ యూజర్స్ కోసం 14-ఇంచ్ మాక్‌బుక్ ప్రోని కొత్త ఎం6 చిప్‌తో యాపిల్ అప్‌డేట్ చేస్తోంది. ఇది తక్కువ బ్యాటరీ వినియోగంతో సూపర్ స్పీడ్‌ని ఇస్తుంది. అలాగే 2024 తర్వాత మళ్లీ ఇప్పుడు అప్‌డేట్ అవుతున్న ఐమ్యాక్ కూడా కొత్త కలర్ ఆప్షన్లతో రానుంది. ఇవన్నీ రెగ్యులర్ యూజర్స్‌కి మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాయడంలో ఎలాంటి సందేహం లేదు.

క్రేజా ఫీచర్లతో కొత్త ఐప్యాడ్ మినీ:

ఈసారి ఐప్యాడ్ మినీలో భారీ మార్పులే ఉండబోతున్నాయి. ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేతో పాటు శక్తివంతమైన ఏ20 ప్రో చిప్ దీని సొంతం. ఇంకా సన్నని బెజెల్స్, ల్యాండ్‌స్కేప్ ఎడ్జ్‌లో ఫ్రంట్ కెమెరా, వై-ఫై 7 సపోర్ట్ వంటి లేటెస్ట్ ఫీచర్లు రానున్నాయి. ఈ ప్రొడక్ట్స్ అన్నింటి ధరలు, పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడవుతాయి. యాపిల్ నుంచి వస్తున్న ఈ కొత్త గ్యాడ్జెట్స్ టెక్ ప్రియులను ఎంతవరకు ఆకట్టుకుంటాయో చూడాలి.

Also Read: దారి చూపే గూగుల్ మ్యాప్స్ వెనుక ఇంత పెద్ద ప్రమాదం ఉందా? అసలు విషయం ఏమిటంటే..

Tags

Related News

12 జీబీ ర్యామ్, సరికొత్త ఆండ్రాయిడ్‌తో పోకో కొత్త ఫోన్.. ఫీచర్లు అదుర్స్!

క్రియేటర్లకు బంపరాఫర్.. 15 వీడియోలు పెట్టు, లక్షలు సొంతం చేసుకో! ‘ఎక్స్’ ఆఫర్ వెనుక..

పాత ఇన్‌స్టా యూజర్‌నేమ్‌తో విసిగిపోయారా? ఇలా ఈజీగా మార్చుకోండి!

ఫోన్ కెమెరా బ్లర్‌గా ఉందా? వాటర్ మాయిశ్చర్ తొలగించే బెస్ట్ హ్యాక్స్!

120Hz డిస్‌ప్లే నిజంగానే ఎక్కువ ఛార్జింగ్ లాగేస్తుందా?అసలు నిజం ఇదే!

ఫోన్ ఛార్జింగ్ అవట్లేదా? ఈ చిన్న పొరపాట్లే USB పోర్ట్‌ను పాడుచేస్తాయి

ఆస్ట్రేలియాలో రాక్షస సాలీడు.. శాటిలైట్ ఫోటోతో అసలు సంగతి చెప్పేసి నాసా

Big Stories

Advertisement
×