E-Paper
Advertisement

NO Nonveg Day : ఆ రాష్ట్రంలో నో నాన్ వెజ్.. ఎందుకంటే..

NO Nonveg Day : ఆ రాష్ట్రంలో నో నాన్ వెజ్.. ఎందుకంటే..
Advertisement

NO Nonveg Day : ఒక జంతువును చంపి.. మనుషులు ఆకలి తీర్చుకోవడం మహాపాపం అని మన పురాణాలు చెబుతున్నాయి. ఇవన్నీ తెలిసినా సరే.. మనం నాన్ వెజ్ తినడం ఆపం. నాన్ వెజ్ తినకుండా ఉండేందుకు కూడా ఒక ప్రత్యేకమైన రోజును కేటాయించాల్సి వస్తుంది. నేడు (నవంబర్ 25) ఇంటర్నేషనల్ నో నాజ్ వెజ్ డే. ఈ సందర్భంగా.. యూపీ సర్కార్ మాంస రహిత దినోత్సవాన్ని పాటించాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సాధు వాస్వానీ పుట్టినరోజు కూడా నవంబర్ 25నే కావడంతో శనివారం రాష్ట్రంలో మాంసం దుకాణాలు, కబేళాలను మూసివేసినట్లు యోగి ఆదిత్యనాథ్ సర్కార్ వెల్లడించింది.

ఎవరీ సాధువస్వానీ..

Advertisement

సాధువస్వానీ ఒక భారతీయ విద్యావేత్త. ఆయన పాకిస్థాన్ లో ఉన్న సింధ్ లో సెయింట్ మీరా స్కూల్ ను స్థాపించారు. అలాగే పూణేలో తన బోధనలకు సంబంధించిన మ్యూజియం, దర్శన్ మ్యూజియంలను ఏర్పాటు చేశారు. హలాల్ సర్టిఫికేషన్ తో ఆహార ఉత్పత్తుల ఉత్పత్తి, నిల్వ, పంపిణీ, విక్రయాలపై యోగీ సర్కారు ఇటీవలే నిషేధం విధించింది. ఆ తర్వాత ఎగుమతి కోసం తయారు చేసిన మాంసం ఉత్పత్తుల్నీ మినహాయిస్తూ యూపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.

మెక్ డొనాల్డ్స్ లో హలాల్ ఉత్పత్తులు

Advertisement

హలాల్ సర్టిఫైడ్ ఉత్పత్తులపై నిషేధం విధించిన అనంతరం.. నవంబర్ 22న యూపీలోని లక్నో లో ఉన్న ప్రముఖ ఫాస్ట్ ఫుడ్ దిగ్గజం మెక్ డొనాల్డ్స్ అవుటెల్స్ పై ఎఫ్ఎస్డీఏ బృందం దాడి చేసింది. అక్కడ హలాల్ కు సంబంధించిన ఉత్పత్తులు, ప్రత్యేకంగా ప్యాక్ చేసిన మూటల్నీ అధికారులు కనుగొన్నారు. సహారా మాల్ లోనూ దాడులు చేశారు. మొత్తం 8 కంపెనీల్లో హలాల్ సర్టిఫైడ్ ఉత్పత్తుల్ని విక్రయిస్తున్నట్లు గుర్తించి వారందరిపై కేసులు నమోదు చేశారు.

Tags

Related News

మెట్లపై నుంచి జారిపడి చనిపోయిన గ్లోబల్ టెర్రరిస్ట్

ఆర్మీ రహస్యాలు చైనాకు లీక్.. జమ్ము కాశ్మీర్‌లో తెలంగాణ మహిళ అరెస్ట్!

చనిపోయింది నూడిల్స్ వల్ల కాదట.. అసలు నిజం తెలిసి పోలీసులే షాక్!

ఐక్యరాజ్యసమితిలో ఉద్యోగం.. డిగ్రీ చేసినవారికి సూపర్ అవకాశం.. అర్హతలు ఇవే

ఆలయంలో ఓ లారీ బీభత్సం, 12 మంది మృతి-30 మందికి గాయాలు, గ్వాలియ‌ర్‌లో ఘటన

దుర్గా మండపం కూలిన ఘటన..19 మంది మృతి, 25 మందికి గాయాలు, కోల్‌కత్తాలో ఘటన

రిలయన్స్, బ్లింకిట్, జొమాటో సిబ్బందిపై కేసు నమోదు.. ఎందుకంటే..?

మాజీ సీఎం కోసం.. 9 హత్యలు చేశా.. లైవ్‌లో ఒప్పుకున్న ఎమ్మెల్యే!

Big Stories

Advertisement
×