E-Paper
Advertisement

సీఎం విజయ్‌పై నాకు కడుపు మంట లేదు.. మౌనం వీడిన సౌత్ సూపర్‌స్టార్ నటుడు రజినీకాంత్.. స్టాలిన్‌తో భేటీపై

సీఎం విజయ్‌పై నాకు కడుపు మంట లేదు.. మౌనం వీడిన సౌత్ సూపర్‌స్టార్ నటుడు రజినీకాంత్.. స్టాలిన్‌తో భేటీపై
Advertisement

Chennai: ఎట్టకేలకు రెండువారాలుగా తమిళనాడులో నలుగుతున్న రాజకీయాలపై నోరు విప్పారు సౌత్ సూపర్‌స్టార్ రజినీకాంత్. తన మౌనాన్ని ఆయన వీడారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ఎన్నికైన వెంటనే ఆయనకు అభినందనలు చెప్పినట్టు మనసులోని మాట వెల్లడించారు.

ఎట్టకేలకు నోరు విప్పిన నటుడు రజినీకాంత్

Advertisement

ఎట్టకేలకు సౌత్ సూపర్‌స్టార్ నటుడు రజినీకాంత్ నోరు విప్పారు. విజయ్ సీఎం అయ్యారని తెలిసి ఆశ్యర్యానికి గురయ్యానని తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఉదయం చెన్నైలోని తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సూపర్ స్టార్, రెండు ప్రధాన పార్టీలను ఎదుర్కొని విజయ్ సీఎం అయ్యారని అన్నారు. పాలిటిక్స్‌లో అసూయ కోసం రాలేదన్నారు.

విజయ్ గెలిచిన వెంటనే తాను ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపానని గుర్తు చేశారు. తాను రాజకీయాల నుంచి తప్పుకుని చాలా కాలం అయ్యిందన్నారు. ఎన్నికల ఫలితాలు తర్వాత మాజీ సీఎం స్టాలిన్‌తో సమావేశమయ్యానని అన్నారు. ఆ సమయంలో స్టాలిన్‌తో భేటీ కావడంపై చాలామంది తనను రకరకాలుగా విమర్శించారని గుర్తు చేశారు. తాను పోటీ చేస్తే కచ్చితంగా 100 శాతం గెలిచేవాడినని అన్నారు.

Advertisement

గెలిచిన వెంటనే విజయ్‌కు శుభాకాంక్షలు చెప్పారు.. ఓటమి తర్వాత స్టాలిన్‌తో భేటీ

స్టాలిన్‌తో తనకు పార్టీలకు అతీతమైన మంచి స్నేహం ఉందన్నారు. అంతేకాదు స్టాలిన్ ఎమ్మెల్యేగా ఓడిపోవడం బాధ కలిగిందన్నారు. అనవసరమైన విషయాలు మాట్లాడి దిగజారే వ్యక్తిని తాను కాదని కుండబద్దలు కొట్టేశారు. విజయ్ విషయంలో తనకు ఎలాంటి కడుపు మంట లేదన్నారు. ప్రజలు మార్పు కోరుకున్నారని, అందుకే ఆయన గెలిచారని చెప్పుకొచ్చారు. ఎంజీఆర్-ఎన్టీఆర్ సాధించిన ఘనతను 52 ఏళ్ల వయస్సులో విజయ్ సాధించడం సంతోషంగా ఉందన్నారు.

ఎన్నికల ఫలితాలు తర్వాత తనపై లేనిపోని విమర్శలు వచ్చాయని, చాలామంది అవి నిజమేనని పరిగణిస్తున్నందున, తన వైఖరిని స్పష్టం చేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. అందుకే మీడియా ముందుకు వచ్చానని తెలిపారు. తనకు-విజయ్‌కి మధ్య 28 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉందన్నారు. రెండు ప్రధాన పార్టీలకు వ్యతిరేకంగా నిలబడి స్వతంత్రంగా గుర్తింపు సంపాదించుకున్నారని అన్నారు.

ALSO READ: వాహనదారులకు మళ్లీ షాక్‌.. రెండోసారి పెరిగిన సీఎన్‌జీ ధరలు, లబోదిబో మంటున్న ఆటోలు, క్యాబ్‌లు

తమిళనాడు ఎన్నికల ఫలితాలు వెలువడిన రెండో రోజు మాజీ సీఎం స్టాలిన్‌తో సమావేశమయ్యారు.ఆ సమయంలో ఇరువురు నేతల భేటీపై మరొక ప్రచారం సాగింది. డీఎంకె-అన్నాడీఎంకెలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సూపర్ స్టార్ ప్రయత్నాలు చేస్తున్నారంటూ జోరుగా ప్రచారం సాగింది. వస్తున్న వార్తలు, జరుగుతున్న ప్రచారంపై ఆదివారం నోరు విప్పారు సూపర్‌స్టార్.

సీఎం విజయ్-నటుడు రజినీకాంత్ మధ్య ఎపిసోడ్‌కు ఎండ్ కార్డు పడింది. అన్నట్లు రాజకీయ నేతలను అందర్నీ కలిసిన సీఎం విజయ్, రజినీకాంత్‌తో సమావేశమైన సందర్భం లేవు. దీంతో వీరి మధ్య ఏదో జరుగుతోందన్న చర్చ లేకపోలేదు. రానున్న రోజుల్లో ఇంకెన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.

 

Related News

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

Big Stories

Advertisement
×