E-Paper
Advertisement

వాహనదారులకు మళ్లీ షాక్‌.. రెండోసారి పెరిగిన సీఎన్‌జీ ధరలు, లబోదిబో మంటున్న ఆటోలు, క్యాబ్‌లు

వాహనదారులకు మళ్లీ షాక్‌.. రెండోసారి పెరిగిన సీఎన్‌జీ ధరలు, లబోదిబో మంటున్న ఆటోలు, క్యాబ్‌లు
Advertisement

CNG price Hike: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ముడి చమురు ధరలు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలపై ఒత్తిడిని కొనసాగిస్తున్న నేపథ్యంలో రెండు రోజుల్లో ఇంధన ధరలను పెంచడం ఇది రెండోసారి. ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్-సిఎన్‌జి ధరలు పెరిగాయి. లోకు రూపాయి పెంచడంతో రెండు రోజుల్లో ఇది మరోసారి పెంచినట్లుయ్యింది.

వాహనదారులకు మళ్లీ షాక్‌.. రెండోసారి పెరిగిన సీఎన్‌జీ ధరలు

Advertisement

ఢిల్లీ- ఎన్‌సిఆర్ ప్రాంతంలో వేలాది ఆటోలు, క్యాబ్‌లు సిఎన్‌జితో తిరుగుతున్నాయి. దీనిపై లక్షలాది మంది జీవనం సాగిస్తున్నారు. తాజాగా పెరిగిన ధరల మేరకు ఢిల్లీలో కిలోకు రూ. 80.09 ధర పలుకుతుంది. నోయిడా-ఘజియాబాద్‌లలో కిలోకు రూ. 88.70 కాగా, గురుగ్రామ్‌లో రూ. 85.12గా ఉంది. ముజఫర్‌నగర్-మీరట్-షామ్లీలలో దీని ధర కిలోకు రూ. 88.58గా కొనసాగుతోంది.

రెండు రోజుల కిందట ఢిల్లీలో సీఎన్‌జీ ధర కిలోకు రూ. 77.09 నుండి రూ. 79.09 కు పెంచాయి. ముంబైలో ఇదే విధమైన పెంపు కనిపించింది. అక్కడ కిలోకు రూ. 84లకు చేరింది. గృహాలకు సరఫరా అయ్యే పైపుల ద్వారా సహజ వాయువు, LPG సిలిండర్ల ధరలు ప్రస్తుతానికి మారలేదు. ధరలు ఇలా పెంచుకుంటూ పోతే మా పరిస్థితి ఏంటని సీఎన్‌జీ ఆటోల వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు.

Advertisement

లబోదిబోమంటున్న ఆటోలు, క్యాబ్‌ యజమానులు

పొదుపు చర్యల నేపథ్యంలో ఇప్పటికే చాలామంది తమ వాహనాలు ఎక్కలేదని, ధరల పెంపు మాకు కష్టాలు మొదలైనట్టు చెబుతున్నారు. ఇంకోవైపు ఎల్పీజీ సిలిండర్ ధరలు పెరిగే అవకాశముందంటూ వార్తలు వస్తున్నాయి. మార్చి మొదటివారంలో గ్యాస్ సిలిండర్‌పై రూ.60 పెంచింది. మరో రూ. 30 నుంచి 50 వరకు పెరిగే అవకాశముందంటూ జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

రానున్న రోజుల్లో వీటిపై ధరలు పెంచే అవకాశముందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు నేపథ్యంలో హోర్ముజ్ జలసంధి గుండా చమురు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రపంచ ముడి చమురు ధరలు 50 శాతానికి పైగా పెరిగాయి.

ALSO READ: అప్పుడు ఆయన.. ఇప్పుడు ఈయన, కేజ్రీవాల్ దారిలో సీఎం విజయ్ 

అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగినప్పటికీ పెరుగుతున్న వ్యయాల నుండి వినియోగదారులను కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. అదే సమయంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు రావడంతో ధరలు  పెంచేందుకు కేంద్రం ఆలస్యం చేస్తోందంటూ ప్రతిపక్ష పార్టీలు ఆరోపించిన విషయం తెల్సిందే. 2022 మే తర్వాత పెట్రోల్-డీజిల్ ధరలు అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు మార్చిలో లీటరుకు రూ. 2 చొప్పున ఒకేసారి తగ్గించిన విషయం తెల్సిందే.

Related News

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

ఆసుపత్రి నుంచే పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు.. సోనమ్ వాంగ్‌చుక్ లేఖతో ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

వానల కోసం సరికొత్త పూజ.. వర్షాలు కురవాలని గాడిదలకు స్వీట్లు తినిపించిన స్థానికులు!

Big Stories

Advertisement
×