E-Paper
Advertisement

తమిళనాడు సీఎంగా విజయ్ పట్టాభిషేకం.. రేపు ఉదయం 11 గంటలకు ముహూర్తం ఖరారు

తమిళనాడు సీఎంగా విజయ్ పట్టాభిషేకం.. రేపు ఉదయం 11 గంటలకు ముహూర్తం ఖరారు
Advertisement

తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలవబోతోంది. తమిళ వెట్రి కళగం (TVK) అధినేత దళపతి విజయ్ రేపు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. చెన్నైలోని నెహ్రూ స్టేడియం ఈ చారిత్రక ఘట్టానికి వేదిక కానుంది. రేపు ఉదయం 11 గంటల నుంచి 11.30 గంటల మధ్య ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇందుకోసం భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. సుమారు ఐదు వేల మంది ప్రముఖులు రాజకీయ నాయకులకు మాత్రమే లోపలికి అనుమతినిస్తూ పాసులు జారీ చేశారు. ఈ వేడుకను కనులారా వీక్షించేందుకు అభిమానులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో నగరం అంతటా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

విజయ్ ప్రమాణ స్వీకారానికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నేత రాహుల్ గాంధీ హాజరుకానుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఒంటరిగా పోరాడి 108 స్థానాలను కైవసం చేసుకుంది. ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు కోసం విజయ్ ఇతర పార్టీల వైపు మొగ్గు చూపారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు విజయ్‌కు మద్దతు ప్రకటించారు. దీంతో టీవీకే బలం 112కు చేరుకుంది. మ్యాజిక్ ఫిగర్ కోసం అవసరమైన మిగిలిన ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతు కోసం కమ్యూనిస్టులు స్వతంత్ర అభ్యర్థులతో చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల జాబితాను విజయ్ గవర్నర్‌కు సమర్పించారు.

Advertisement

ఈ రాజకీయ పరిణామాలు ఇండియా కూటమిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఎన్నికల సమయంలో డీఎంకేతో కలిసి నడిచిన కాంగ్రెస్ ఫలితాల అనంతరం టీవీకేకు మద్దతు ఇవ్వడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా రాహుల్ గాంధీ తన మిత్రపక్షమైన డీఎంకేను కాదని విజయ్ వైపు మొగ్గు చూపడంపై విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కూటమిలోని ప్రధాన పార్టీకే రాహుల్ హ్యాండ్ ఇచ్చారనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుకే తాము ప్రాధాన్యత ఇస్తున్నామని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి.

సినిమా రంగంలో రారాజుగా వెలిగిన విజయ్ ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో కీలక బాధ్యతలు చేపట్టడం తమిళ రాజకీయాల్లో పెద్ద మార్పుగా భావిస్తున్నారు. తన సుదీర్ఘ సినీ ప్రస్థానానికి ముగింపు పలికి పూర్తిస్థాయిలో ప్రజా సేవకు అంకితమవుతానని ఆయన ఇప్పటికే ప్రకటించారు. దళపతి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తారో అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. కేవలం అభిమానులే కాకుండా సామాన్య ప్రజలు సైతం కొత్త ప్రభుత్వంపై గంపెడంత ఆశలతో ఉన్నారు. రేపటి ప్రమాణ స్వీకార కార్యక్రమంతో తమిళనాడు రాజకీయ చిత్రం పూర్తిగా మారిపోనుంది.

Advertisement

ALSO READ: తమిళనాడులో విజయ్ గెలవడంలో ఆశ్చర్యం లేదు..నటి శ్రియ కామెంట్స్ వైరల్!

Related News

స్పామ్, ఫ్రాడ్ కాల్స్‌ టెన్షన్‌కు ఇక చెక్.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం?

ప్రపంచాన్ని సైతం కదిలించిన చరిత్ర.. అక్టోబర్ 17 ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా..?

డేంజర్ బెల్స్.. ఏఐతో భారీగా పర్యావరణం విధ్వంసం.. ఎలానో తెలుసా..?

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. అభిజిత్ దీప్కే ‘తిరంగా యాత్ర’ అడ్డుకున్న పోలీసులు.. ఇంటికెళ్లి నోటీసులు అందజేత!

అమ్మబాబోయ్.. 75 ఏళ్ల తాతతో 30 ఏళ్ల యువతి పెళ్లి.. నిశ్చితార్థం వీడియో వైరల్!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రైల్వేలో 1,688 ఖాళీలు, సాలరీ, దరఖాస్తు పూర్తి వివరాలివిగో

నా ఇంటి చుట్టూ నిఘా పెట్టారు.. ఏ క్షణమైనా అరెస్ట్ చేయవచ్చు, సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే

ఉక్రెయిన్ యుద్ధభూమిలో ఎలాన్ మస్క్ బిగ్ ట్విస్ట్..?

Big Stories

Advertisement
×