BigTV English

Almora – Uttarakhand : ప్రకృతి ప్రేమికులకు కనులవిందు.. ‘ఆల్మోరా’ అందాలు

Almora – Uttarakhand : ప్రకృతి ప్రేమికులకు కనులవిందు.. ‘ఆల్మోరా’ అందాలు

Almora – Uttarakhand : ఉత్తరాఖండ్‌లోని కుమావోన్ కొండల దక్షిణ అంచున ఉన్న ‘ఆల్మోరా’ ఓ అందమైన పర్యాటక ప్రదేశం. ఈ ప్రాంతం సూయల్ నది, కోసి నది మధ్య ఉంది. ఆల్మోరా దట్టమైన అరణ్యాలు, వారసత్వ దేవాలయాలు, గొప్ప సాంస్కృతిక వారసత్వం, ప్రత్యేకమైన హస్తకళ, రుచికరమైన వంటకాలకు ప్రసిద్ధి. ప్రకృతి ఒడిలో సేదతీరాలనుకునే వారు ఈ అందమైన హిల్ స్టేషన్‌‌ను చుట్టిరావచ్చు.


స్వామి వివేకానంద ధ్యానం చేసిన కొండ..

ఆల్మోరా కొండలపై స్వామి వివేకానంద ధ్యానం చేస్తూ గడిపారని విశ్వసిస్తారు. అయితే, నేటి ఆల్మోరా ప్రశాంతమైన శివారు ప్రాంతాలు, ఉత్కంఠ భరితమైన దృశ్యాలతో సందడిగా ఉండే పట్టణం. అందుకే సుదూర ప్రాంతాల నుండి పర్యాటకులు అధిక సంఖ్యలో ఈ ప్రాంతానికి తరలి వస్తారు. అల్మోరా నుండి కొద్ది దూరంలో రాతి యుగం నాటి గుహ చిత్రాలను ఫూలసీమ, ఫర్కనౌలి, లఖుదియార్ కూడా సందర్శించవ్చు.


డీర్ పార్క్ మర్చిపోవద్దు..

ఈ ప్రదేశం నుంచి సూర్యోదయ, సూర్యాస్తమయ దృశ్యాలను చూడటానికే పర్యాటకులు అధికంగా వస్తుంటారు. ఆల్మోరాకు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘డీర్ పార్క్‌’లో చిరుతలు, హిమాలయ నల్ల ఎలుగు బంట్లు.. వంటి జంతువులను చూడవచ్చు. ఈ ప్రదేశంలో గోవింద్ వల్లభ పంత్ పబ్లిక్ మ్యూజియం, బిన్సార్ వైల్డ్ లైఫ్ సాన్క్చురి ప్రత్యేక ఆకర్షణలు. ట్రెక్కింగ్, మౌంటెన్ బైకింగ్ ఇక్కడ ప్రసిద్ధ క్రీడలు. నవంబర్ నెలలో చూడాల్సిన బెస్ట్ లొకేషన్ ఆల్మోరా.

Related News

Vastu Tips: వాస్తు ప్రకారం.. ఇంట్లో డబ్బు ఎక్కడ దాచాలి ?

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Big Stories

×