BigTV English

OG Piracy: ఓజీని పైరసీ చేసిన ముఠా అరెస్ట్… హార్డ్ డిస్క్‌లన్నీ స్వాధీనం

OG Piracy: ఓజీని పైరసీ చేసిన ముఠా అరెస్ట్… హార్డ్ డిస్క్‌లన్నీ స్వాధీనం

OG Piracy:సినిమా పైరసీ.. ఇది ప్రతి ఒక్కరిని ఎంత ప్రభావితం చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా నిర్మాతలు వందల కోట్లు ఖర్చుపెట్టి సినిమా చేస్తారు. కానీ ఆ సినిమాకు తగ్గ ప్రతిఫలం లభించక ముందే ఈ పైరసీ ముసుగులో సైబర్ క్రైమ్ నేరస్తులు ప్రతి శ్రామికుడి కష్టాన్ని దోచుకుంటున్నారనే చెప్పాలి. అయితే తాజాగా ఇటీవల విడుదలైన ఓజీ (OG) సినిమా కూడా పైరసీ అయిన విషయం తెలిసిందే. థియేటర్లలోకి వచ్చిన రెండు రోజుల్లోనే హెచ్డి ప్రింట్ లీకవ్వడం సంచలనం సృష్టించింది. అయితే అలాంటిది ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద సినిమా పైరసీ ముఠాను తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు.


పైరసీ ముఠాను అదుపులోకి తీసుకున్న పోలీసులు..

ముఖ్యంగా పైరసీ ముఠాకు చెందిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు. ముఠా నుంచి హార్డ్ డిస్కులు, రికార్డింగ్ సీక్రెట్ కెమెరాలతో పాటు తదితర పరికరాలను హైదరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ సిపి మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు.. ముఖ్యంగా చిత్ర పరిశ్రమకు , నిర్మాతలకు, సెలబ్రిటీలకు ఇది అతిపెద్ద శుభవార్త అని చెప్పడంలో సందేహం లేదు.


నిందితుల స్థావరాలు అక్కడే..

ఇదిలా ఉండగా గతంలో #సింగిల్ సినిమా పైరసీపై పోలీసులకు ఫిర్యాదు అందిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టి జూలై 3న వనస్థలిపురానికి చెందిన కిరణ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతడిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నట్లు కూడా తెలిపారు. అయితే ఇప్పుడు ఆ పైరసీ ముఠా దుబాయ్ , నెదర్లాండ్, మయన్మార్ లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.

కంటెంట్ ను ఇతర వెబ్సైట్లకు విక్రయిస్తూ..

ఇకపోతే థియేటర్లలో ప్రసారమవుతున్న శాటిలైట్ కంటెంట్ ఐడి పాస్వర్డ్ లను నేరగాళ్లు ట్రాక్ చేసి మరీ.. ఏజెంట్లకు రికార్డు కెమెరాలు అందజేసి.. రహస్యంగా చిత్రాన్ని చిత్రీకరిస్తున్నారు. ఆ తర్వాత వారికి టికెట్లు బుక్ చేసి థియేటర్లలో చిత్రాన్ని చిత్రీకరించడం లాంటివి చేస్తున్నారు. ముఖ్యంగా చొక్కా జేబులు, పాప్కార్న్ డబ్బాలు, కెమెరాలు పెట్టి ఇలా సినిమా రికార్డింగ్ చేస్తున్నట్లు మజాగా పోలీసులు గుర్తించారు.. పైగా ఏజెంట్లకు క్రిప్టో కరెన్సీ రూపంలో ముఠా కమిషన్లు కూడా అందిస్తున్నట్లు సమాచారం. అంతేకాదండోయ్ ఈటీవీ వంటి యాప్ ల కంటెంట్ ను పైరసీ చేసి అమ్మిన మరో నిందితుడిని కూడా ఇప్పుడు పోలీసులు అరెస్టు చేశారు. మరి ఈరోజు జరగబోయే పీసీ సమావేశంలో ఏం జరుగుతుందో చూడాలి.

also read:Samantha: నిజమైన ప్రేమ కోసం సమంత తాపత్రయం.. అంతా అయిపోయిందంటూ!

Related News

Samantha: నిజమైన ప్రేమ కోసం సమంత తాపత్రయం.. అంతా అయిపోయిందంటూ!

OG collections: భారీగా పడిపోయిన ఓజీ కలెక్షన్స్… ఆ ఒక్క మిస్టేక్ వల్లే?

Tollywood: హమ్మయ్య టాలీవుడ్ కి మంచి రోజులు.. త్వరలో కమిటీ నియామకం!

Film Industry: ఇండస్ట్రీలో విషాదం…ఎన్టీఆర్ విలన్ భార్య కన్నుమూత!

The Raja saab : ప్రభాస్ ఫ్యాన్స్ కి క్రేజీ అప్డేట్, ఒక్క ట్వీట్ తో రచ్చ లేపిన మారుతి

Kantara Chapter1 pre release: ఎన్టీఆర్ నాకు హీరో కాదు… బ్రదర్ రిషబ్ ఇంట్రెస్టింగ్ స్పీచ్!

OG Film: ఓజి నిర్మాతలను రిక్వెస్ట్ చేస్తున్న యంగ్ ప్రొడ్యూసర్ రాహుల్ యాదవ్

Big Stories

×