Navratri 2025: నవరాత్రుల సమయం చాలా పవిత్రమైంది. ఈ సమయం దుష్ట శక్తులు, చెడును తొలగించేందుకు మంచిదని భావిస్తారు. ఇదిలా ఉంటే ఈ పవిత్రమైన తొమ్మిది రాత్రుల్లో మాంత్రికుల ప్రభావాలను తొలగించడానికి కొన్ని అద్భుతమైన మార్గాలు కూడా ఉన్నాయి. నవరాత్రుల్లో దుర్గాదేవిని పూజించడం వల్ల మనపై ఉన్న చెడు శక్తులు కూడా తొలగిపోతాయి. దుర్గాదేవి శక్తికి ప్రతీక. ఈ సమయంలో చేయాల్సిన కొన్ని ముఖ్యమైన నివారణ మార్గాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1. దుర్గా సప్తశతి పారాయణం:
నవరాత్రి సమయంలో దుర్గా సప్త శతి ప్రతి రోజూ పారాయణం చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది దుష్ట శక్తులను నాశనం చేసే శక్తివంతమైన మంత్రాల సమాహారం అని చెబుతారు. ఈ గ్రంథాలను పఠించడం వల్ల మన చుట్టూ ఉన్న ప్రతి కూడల శక్తులు కూడా తొలగిపోయి. సానుకూల వాతావరణం కూడా ఏర్పడుతుంది.
2. దేవీ కవచం పఠించడం:
నవరాత్రుల సమయంలో దేవీ కవచం ప్రతి రోజు పఠించడం వల్ల దేవి రక్షణ మనకు లభిస్తుంది. అంతే కాకుండా ఇది మనల్ని దృష్ట శక్తుల ప్రభావం నుంచి కూడా కాపాడుతుంది. ఈ కవచం మనకు ఒక రక్షణ కవచంలాగా కూడా పని చేస్తుంది.
3. శతనామ స్తోత్రం పఠించడం:
అమ్మవారికి అనేక రకాల పేర్లు ఉంటాయి. నవరాత్రుల్లో శతనామ స్త్రోత్రం పఠించడం వల్ల దేవి అనుగ్రహం మీకు లభిస్తుంది. ఈ స్తోత్రం పఠించడం వల్ల కూడా మనపై ఉన్న చెడు ప్రభావాలు కూడా తొలగిపోతాయి.
4. హోమం చేయడం:
ప్రతి రోజు నవరాత్రుల సమయంలో హోమం చేయడం చాలా మంచిది. హోమం చేయడం వల్ల మన ఇంట్లోని ప్రతికూల శక్తులు కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా నవదుర్గ హోమం లేదా చండీ హోమం వంటివి చేయడం వల్ల మాంత్రికుల ప్రభావం కూడా తొలగిపోతుంది.
5. నిమ్మకాయ, మిరపకాయలు:
దృష్ట శక్తుల ప్రభావం నుంచి బయటపడటానికి నిమ్మకాయలతో పాటు మిరపకాయలను ఉపయోగించడం చాలా ప్రాచీనమైన పద్దతి. ఏడు మిరపకాయలు, ఒక నిమ్మకాయ తీసుకుని వాటిని ఒక దారంతో కట్టి, ఇంటి ప్రధాన ద్వారం దగ్గర వేలాడదీయాలి. ఇది ప్రతికూల శక్తులను తొలగించడంలో ఉపయోగపడుతుంది.
6. హారతి:
నవరాత్రుల సమయంలో ప్రతి రోజు దుర్గాదేవికి హారతి ఇవ్వడం చాలా ముఖ్యం. హారతికి ఒక శక్తివంతమైన వైబ్రేషన్ కూడా ఉంటుంది. ఇది దుష్ట శక్తులను తొలగించడంలో కూడా ఉపయోగపడుతుంది. కర్పూరం, నెయ్యి దీపాలతో హారతి ఇవ్వడం కూడా మంచిది.
7. ఆవాల గింజలు:
నవరాత్రుల సమయంలో చెడు దృష్టి నుంచి బయటపడటానికి ఆవాల గింజలు చాలా బాగా ఉపయోగపడతాయి. వీటిని ఇంట్లోని ప్రతి మూల కొద్దిగా చల్లడం మంచిది. ఇవి ఇంట్లో ఉన్న ప్రతి కూల శక్తులను గ్రహించి తొలగించడంలో కూడా చాలా బాగా ఉపయోగపడతాయి.
8. ఉప్పు నీటి స్నానం:
నవరాత్రుల్లో ప్రతి రోజు కాస్త ఉప్పు నీటిలో వేసుకుని వాటితో స్నానం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అంతే కాకుండా ప్రతి కూల శక్తులు కూడా తొలగిపోతాయి.