BigTV English

Delhi News: ఢిల్లీలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. సీఎం రేఖాగుప్తా, ఉపాసన హాజరు

Delhi News: ఢిల్లీలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. సీఎం రేఖాగుప్తా, ఉపాసన హాజరు

Delhi News: తెలంగాణ వ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు అంబరాన్ని తాకాయి. విదేశాల్లో కాకుండా దేశంలో వివిధ రాష్ట్రాల్లో బతుకమ్మ సంబరాలను జరుపుకుంటున్నారు ప్రజలు ప్రజలు. దేశ రాజధాని ఢిల్లీలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి.


తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగను తెలుగు స్టూడెంట్స్ అసోసియేషన్ అత్యంత వైభవంగా నిర్వహించింది. ఢిల్లీ యూనివర్సిటీలోని రామ్జాస్ కళాశాల గ్రౌండ్‌లో వేడుకలు జరిగాయి. నాలుగు వేల మందికి పైగా తెలుగు విద్యార్థులు, వారి కుటుంబాలు హాజరై సందడి చేశారు.

ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఈ వేడుకకు హాజరై బతుకమ్మ పూజలో పాల్గొన్నారు. గౌరవ అతిథిగా విచ్చేశారు ప్రముఖ పారిశ్రామికవేత్త, అపోలో హాస్పిటల్స్ డైరెక్టర్ ఉపాసన. సీఎం రేఖా‌గుప్తాతో వేదికను పంచుకున్నారు ఆమె. జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం కార్యక్రమాన్ని మొదలు పెట్టారు.


ఈ సందర్భంగా మాట్లాడిన ఉపాసన.. బతుకమ్మ కేవలం పూల పండుగ కాదన్నారు. మహిళా శక్తికి-సామాజిక ఐక్యతకు-సృజనాత్మకతకు అద్దం పడుతుందన్నారు. దసరాతో ముడిపడిన ఈ వేడుక ఉత్సాహాన్ని-విజయాన్ని సూచిస్తుందన్నారు. ఢిల్లీలో తెలుగు ప్రజలు మన సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లడం గర్వంగా ఉందన్నారు.

ALSO READ:  ఆ జిల్లాలకు హైఅలర్ట్.. ఉరుములు, పిడుగులు పడే ఛాన్స్

తెలంగాణ సంస్కృతిని గౌరవించినందుకు సీఎం రేఖా గుప్తాకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. టీఎస్ఏ ప్రెసిడెంట్, సలహాదారుల పర్యవేక్షణలో ఈ బతుకమ్మ సంబరాల వేడుక అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా సంప్రదాయ పూజలు, బతుకమ్మ నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ముఖ్య అతిథిగా హాజరైన ఉపాసనను నిర్వాహకులు జ్ఞాపికతో సత్కరించారు. ఢిల్లీలోని తెలుగు విద్యార్థుల మధ్య ఐక్యత, సాంస్కృతిక బంధాన్ని మరింత బలోపేతం చేసింది. మొత్తానికి ఈసారి ఢిల్లీలో జరిగిన వేడుకలు బాగా జరిగాయని హాజరైన తెలుగు ప్రజలు చెప్పడం గమనార్హం.

అటు విదేశాల్లో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని తాకాయి.  న్యూజిలాండ్ మొదలు అమెరికా వరకు తెలుగు ప్రజలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వాహించారు కూడా.

 

Related News

TG Local Body Elections: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు.. ఈసీ షెడ్యూల్ రిలీజ్, అక్టోబర్ నుంచి మొదలు

Hyderabad News: హైదరాబాద్‌లో ఇందిరమ్మ క్యాంటీన్లు ప్రారంభం.. ఐదు రూపాయలకే బ్రేక్ ఫాస్ట్-భోజనం

Weather Update: హై అలర్ట్..! నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే ఛాన్స్..

CM Revanth Reddy: బతుకమ్మకుంటతో తొలి అడుగు.. కబ్జా కోరల్లో చిక్కిన ప్రతి చెరువును రక్షిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

Hydra Commissioner: ఇది ఒక చారిత్రక ఘట్టం, ఇందులో నేను భాగస్వామ్యం కావడం అదృష్టంగా భావిస్తున్నా: హైడ్రా కమిషనర్

CM Revanth: తాట తీస్తాం.. సీఎం రేవంత్ మాస్ వార్నింగ్

CM Revanth Reddy: అంబర్ పేట్‌లో సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్.. ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

Big Stories

×