Intinti Ramayanam Serial Today Episode: అక్షయ్ కోపంతో జాబ్‌కు రిజైన్ చేస్తాడు. దీంతో అవని బాధపడుతుంది. మీ భార్యగా కాకుండా మీ శ్రేయోభిలాషిగా చెప్తున్నాను.. మీరు జాబ్‌కు రిజైన్ చేయకండి. మేడం మీరు ఆయన రిజైన్‌ను యాక్సెప్ట్ చేయకండి అని చెప్తుంది. దీంతో మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా నేను ఇక్కడ జాబ్ చేయాలనుకోవడం లేదు.. చేయను కూడా అంటాడు అక్షయ్. దీంతో చాముండేశ్వరి కోపంగా వర్క్ గురించి అడిగితే ఇలా ఎవరైనా జాబ్‌కు రిజైన్ చేస్తారా..? ఇలా పించ్చి నిర్ణయాలు తీసుకోవడం ఏంటి అక్షయ్ అంటుంది. దీంతో వర్క్ గురించి నేను రిజైన్ చేయడం లేదు. ఇక్కడ వర్క్ చేస్తే ఎలాంటి సిచ్యుయేషన్స్ ఎదురవుతాయో నాకు తెలుసు అందుకే రిజైన్ చేశాను. నేను గర్వంగా తలెత్తుకుని బతక్కపోయినా పర్వాలేదు కానీ తల దించుకుని మాత్రం బతకలేను అందుకే రిజైన్ చేశాను అంటాడు అక్షయ్.
దీంతో అవని ఏవండి ఆవేశంలో మనం తీసుకునే నిర్ణయాలు మన జీవితాలను తారుమారు చేస్తాయి.. మీరు ముందు ప్రశాంతంగా ఉండండి.. ఆవేశం తగ్గితే మీ డిసీజన్ తప్పని మీకే తెలుస్తుంది.. ఫ్లీజ్ అండి ఒక్కసారి ఆలోచించండి అంటూ బతిమాలుతున్నా..? అక్షయ్ కోపంగా ఎవరు చెప్పినా నేను వినను.. నా నిర్ణయం మారదు.. సారీ మేడం మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను.. మనసు చంపుకుని నేను ఇక్కడ పని చేయలేను అంటూ అక్షయ్ వెళ్లిపోతాడు. మేడం ఆయన ఏదో కోపంలో ఉన్నారు. ఆయన విషయంలో మీరు ఎలాంటి డిసీజన్ తీసుకోవద్దు.. ఆయనతో నేను మాట్లాడతాను అంటూ అవని బతిమాలుతుంది. చాముండేశ్వరి సైలెంట్‌గా వెళ్లిపోతుంది.
తర్వాత ఇంటికి వచ్చిన అక్షయ్‌కి అవని కాఫీ తీసుకొస్తుంది. దీంతో కోపంగా అక్షయ్ ని అవనిని తిడతాడు. ఏయ్ కడుపులో కారం కొట్టి కళ్లు తుడిచినట్టు ఆఫీసులో చేయాల్సిందల్లా చేసి ఇక్కడ సర్వీస్ చేస్తున్నావా..? అంటాడు. దీంతో అవని నేనేం చేశాను. మీకు వర్క్ బర్డెన్ తగ్గించడానికి నేను హెల్ప్ చేయాలనుకుంటే.. మీరు చిన్న విషయానికి అంతలా ఆవేశపడిపోయారు. మీరు తప్పు చేసి నన్ను అంటారేంటండి.. అయినా ఎండీ గారు ఏదైనా అన్నారనుకోండి కూల్ గా సమాధానం చెప్తే సరిపోయేది. నేను కవర్ చేస్తున్నా కూడా మీకు కనిపించ లేదు.. అంటూ అవని చెప్తుండగానే రాజేంద్రప్రసాద్ ఏం జరిగిందమ్మా అని అడుగుతాడు.
ఆఫీసులో జరిగింది చెప్తుంది అవని. అందరూ షాక్ అవుతారు. అక్షయ్‌ని అందరూ తిడతారు.. రిజైన్ చేసి తప్పు చేశావంటారు. దీంతో అక్షయ్ కోపంగా తాను ఇంట్లోనే ఉండనని చెప్పి వెళ్లిపోతాడు. దీంతో అవని ఎమోషనల్ అవుతుంది. తన పేరు మీద ఉన్న ఇంట్లో ఆయన ఉండలేకనే అలా మాట్లాడుతున్నారు. అలాంటప్పుడు నేను లోన్ తీసుకుని ఇస్తే ఆయన ఎట్టి పరిస్థితుల్లో తీసుకోరు. అందుకే మీరే లోన్ తీసుకుని అమౌట్ అరైంజ్ చేస్తున్నట్టుగా మీరే చెప్పాలి మామయ్యగారు.. అంటుంది అవని.. దీంతో రాజేంద్ర ప్రసాద్ సరే రేపే బ్యాంకుకు వెళ్లి మాట్లాడతానని చెప్తాడు. నేను ఆల్‌రెడీ మాట్లాడాలనని అవని చెప్తుంది. బ్యాంకు వాళ్లు చెప్పిన విషయాలు చెప్తుంది. ప్రయివేటు బ్యాంకు వాళ్లు ఇమీడియట్‌గా మనీ ఇస్తామన్నారని చెప్తుంది.
తర్వాత రాజేంద్రప్రసాద్ అందరినీ పిలిచి బ్యాంకు నుంచి డబ్బు తీసుకొస్తున్నానని అది అక్షయ్ బిజినెస్ పెట్టుకోవడానికి అని చెప్తాడు. దీంతో అక్షయ్ హ్యాపీగా ఫీలవుతాడు. మళ్లీ బిజినెస్‌లో నా పవర్ ఏంటో చూపిస్తాను.. ఆఫీసులో నన్ను హేళన చేసిన వారికి నేనేంటో ప్రూవ్ చేస్తాను అంటాడు అక్షయ్. ఇంతలో పార్వతి, శ్రియ అడ్డు పడతారు. అక్షయ్‌కి డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకోరు దీంతో అందరి మధ్య గొడవ జరుగుతుంది. ఇంతటితో ఇవాళ్టీ ఇంటింటి రామాయణం సీరియల్ ఏపిసోడ్ అయిపోతుంది.