Asia Cup 2025 : ఆసియా కప్ 2025 ఫైనల్ లో టీమిండియా 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్ జట్టు పై ఘన విజయం సాధించింది. దీంతో టీమిండియా 9వ సారి ఆసియా కప్ ను గెలుచుకుంది. పాకిస్తాన్ పై ఆసియా కప్ 2025 ఫైనల్స్ గెలిచినప్పటికీ టీమిండియా మాత్రం ట్రోఫీ తీసుకోవడానికి నిరాకరించింది. ఇదిలా ఉంటే భారత్ విన్నింగ్ షాట్ ను తాను కొడతానని రింకూ సింగ్ 22 రోజుల ముందే చెప్పాడట. అయితే అదృష్టవశాత్తు అదే వాస్తవం అవ్వడం విశేషం. సెక్టెంబర్ 6 న సోనీ టీవీ ఇంట్రాక్షన్లో రింకు సింగ్ ఒక కార్డు మీద ఇలా రాశాడట. ఈ మ్యాచ్ లో చివరి బంతిని తనే కొట్టి విజయం సాధిస్తానని రాశాడు. అయితే అనుకున్నట్టుగానే రింకూ సింగ్ 19.4 ఓవర్ లో హారిస్ రవూఫ్ బౌలింగ్ లో విన్నింగ్ షాట్ ఆడాడు. ప్రస్తుతం ఈ విన్నింగ్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read : Mohsin Naqvi: ట్రోఫీతో పరారైన పాకిస్థాన్ చీఫ్ నఖ్వీ….బీసీసీఐ సంచలన నిర్ణయం
రింకూ సింగ్ విన్నింగ్ షాట్ ఎప్పుడైతే కొట్టాడో దుబాయ్ స్టేడియంతో పాటు ఇండియా మొత్తం సంబురాలు జరుపుకున్నారు. టపాసులతో హంగామా చేశారు. ఇక దుబాయ్ స్టేడియంలో అయితే గెలుపు ఉత్సాహంతో, కేరింతలతో టపాసులతో సంబురాలు అంగరంగ వైభవంగా జరుపుకోవడం విశేషం. ఈ మ్యాచ్ లో ఓపెనర్లు అభిషేక్ శర్మ 5, శుబ్ మన్ గిల్ 12, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 1 విఫలం చెందడంతో పాకిస్తాన్ జట్టు సంబురాలు చేసుకుంది. తిలక్ వర్మ, సంజు శాంసన్ వికెట్ పోకుండా కొద్ది సేపు గాడిలో పెట్టారు. ఆ తరువాత సంజూ శాంసన్ 24 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. శివమ్ దూబే వచ్చి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. తిలక్ వర్మ 69 నాటౌట్, శివమ్ దూబే 33 పరుగులు చేసి ఔట్ కాగా.. చివర్లో రింకూ సింగ్ వచ్చి విన్నింగ్ షాట్ కొట్టాడు. ఇది అతని అదృష్టం మని అభిమానులు కూడా పేర్కొనడం విశేషం.
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ గ్రౌండ్ బయట ఉండి కూడా మ్యాచ్‌తో భావోద్వేగంగా ముడిపడి ఉంటారు. చివరి ఓవర్‌లో టీమిండియాకు గెలవడానికి 10 పరుగులు అవసరమయ్యాయి. హారిస్ రౌఫ్ వేసిన ఓవర్ మొదటి బంతికి 2 పరుగులు వచ్చాయి. రౌఫ్ వేసిన రెండో బంతికి తిలక్ వర్మ భారీ సిక్స్ కొట్టడంతో, గౌతమ్ గంభీర్ తన కుర్చీలో కూర్చున్న చోటు నుంచే పెద్దగా టేబుల్‌ను కొట్టడం మొదలుపెట్టాడు. ఈ సిక్స్ భారత జట్టు విజయాన్ని దాదాపు ఖరారు చేసింది. తిలక్ వర్మ కొట్టిన ఈ సిక్స్ తర్వాత మిగిలిన పనిని రింకూ సింగ్ పూర్తి చేశాడు. అతను బౌండరీ కొట్టి భారత్ తొమ్మిదో ఆసియా కప్ టైటిల్ విజయాన్ని ఖరారు చేశాడు. గౌతమ్ గంభీర్ ఇంత ఉత్సాహంగా స్పందించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఇంగ్లండ్‌తో జరిగిన ఓవల్ టెస్ట్‌లో భారత్ అద్భుత విజయం సాధించినప్పుడు కూడా గౌతమ్ గంభీర్ ఇలాగే ఆనందం వ్యక్తం చేశాడు.
When manifestation turns into reality, you know it’s 𝗚𝗼𝗱’𝘀 𝗽𝗹𝗮𝗻! ✨
PS: Tilak Varma and Rinku Singh had already written down their dreams before the tournament began… and now they’re living them! 🔥#INDvsPAK #AsiaCup #TilakVarma #RinkuSingh | 📸: SonyLIV pic.twitter.com/GlGMqVQjjZ
— OneCricket (@OneCricketApp) September 28, 2025