Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: విద్యా వాళ్ల ఇంటికి పూలు అల్లడం నేర్పడం కోసం మీనా వెళ్తుంది. నీకు పూలు అల్లడం తెలుసా..? అని అడుగుతుంది. రాదని విద్య చెప్పగానే.. అయినా సరే అరగంటలో తెలుసుకుంటావులే అంటుంది మీనా.. కానీ నువ్వు అరగంలో వెళ్లిపోతే ఎలా అక్కడ రోహిని వాళ్లను పంపేదాకా నిన్ను ఇక్కడ నుంచి వెళ్లనివ్వను కదా అని మనసులో అనుకుంటుంది విద్య. నేను బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకునేటప్పుడు నాకు నేర్పే మేడం ఒక మాట చెప్పేది. ఒకటి నేర్చుకోవడానికి వెళ్లినప్పుడు మనకు కొంచెం తెలిసినా.. మనకు ఏమీ తెలియదని మొదటి నుంచి నిదానంగా నేర్చుకోవాలని చెప్పింది. కాబట్టి నాకు నిదానంగా మొత్తం నేర్పాలి నువ్వు అంటుంది విద్య.
సరే అంటుంది మీన. నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నువ్వు ఇంట్లో అన్ని పనులు చేస్తుంటావు పైగా పూలు అమ్ముతుంటాడు.. ఇటు ఫ్యామిలీని.. కుటుంబాన్ని బ్యాలెన్స్ చేస్తుంటావు.. పాపం ఆ మున్సిపాలిటీ వాళ్లు నీ పూల బండి తీసుకెళ్లిపోయారట కదా అంటూ విద్య అనగానే.. మా నాన్న చెప్పేవారు.. ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి అని ఆ బండి పోయినా స్కూటీ వచ్చింది. పైగా ఇంటింటికి వెళ్లి నేనే పూలు ఇస్తాను కాబట్టి గిరాకి కూడా పెరిగింది అంటూ మీన చెప్పగానే.. ఇందులో కూడా మంచే వెతుకుతున్నావా.? అంటుంది విద్య. మంచే కదా జరిగింది అంటుంది మీన.
కానీ ఇంత మంచి తనం ఈ కాలంలో పనికిరాదేమో.. అనగానే.. ఏ కాలంలో అయినా మంచితనమే పనికి వస్తుంది. చెడ్డ వాళ్లను కర్మ వదలదు. అది ఎప్పుడైనా అంటుంది మీన. దీంతో విద్య ఆ మంచితనమే రోహిణికి ఇన్ని సమస్యలు దానికి ఒకటి పోతే ఒకటి మెడకు చుట్టుకుంటాయి.. అని మనసులో అనుకుని మీన వాళ్ల అత్త గురించి విద్య అడగ్గానే.. మీన కోపంగా దయచేసి మా అత్తయ్యను ఏమీ అనొద్దు ఆవిడ ఉన్నారు కాబట్టే మేమందరం ఒక కుటుంబంలా కలిసి ఉన్నాము అంటూ చెప్పగానే.. అలాంటి అత్త గురించి కూడా ఇంత గొప్పగా చెప్తున్నావా..? హాట్సాప్ అంటుంది విద్య.
మరోవైపు ఇంట్లో ఉన్న రోహిణి అందరూ బయటకు వెళ్లారు కానీ బాలు వెళ్లడం లేదేంటి అని కిచెన్ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో బాలు బయటకు హాల్లోకి వస్తాడు. బామ్మ ఎక్కడికి వెళ్తున్నావు బాలు అని అడగ్గానే.. అవునండి ట్రిప్ వచ్చింది వెళ్తున్నాను అని చెప్తాడు. దీంతో రోహిణి హమ్మయ్యా తను కూడా వెళ్లిపోతున్నాడు అనుకుంటుంది. బాలు బాయ్ చింటూ అని చెప్పి వెళ్లిపోతుంటే చింటూ కూడా వస్తానంటాడు. వద్దని మీన పని మీద బయటకు వెళ్లిందమ్మా అంటాడు. చెప్పే వెల్లిందని అంటుంది బామ్మ.. మీనను ఇప్పట్లో విద్య రానివ్వదు నువ్వు ముందు త్వరగా వెళ్లు అనుకుంటుంది రోహిణి. బాలు బయలకు వెళ్లిపోతాడు.
తర్వాత రోహిణి బామ్మ దగ్గరకు వెళ్లి తిడుతుంది. ఇంటికి ఎందుకు వచ్చావని ప్రశ్నిస్తుంది. కూతురు కాపురం ఏమైపోతుందోనన్న జ్ఞానం లేదా..? అంటూ ప్రశ్నిస్తుంది. ఒకసారి నా జీవితం నాశనం చేసింది చాలలేదా..? ఇంకా నాశనం చేయాలని చూస్తున్నావా..? అంటూ తిడుతుంది. దీంతో బామ్మ ఏడుస్తుంది. వాడికి అమ్మ కావాలనే కోరిక పెరిగిపోతుంది. వాడికి నేను ఎలా చెప్పాలి అంటూ ఎమోషనల్ అవుతుంది. తర్వాత చింటూను తీసుకుని హగ్ చేసుకుని ఏడుస్తుంది. ఇంతటితో గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఏపిసోడ్ అయిపోతుంది.