BigTV English

Singer Rejected Ambani’s Offer: ఎవరైతే నాకేంటి..అంబానీ కోట్ల ఆఫర్‌ని రిజెక్ట్ చేసిన సింగర్

Singer Rejected Ambani’s Offer: ఎవరైతే నాకేంటి..అంబానీ కోట్ల ఆఫర్‌ని రిజెక్ట్ చేసిన సింగర్
The Singer Who Rejected Ambani's Crore Offer
 

The Singer Who Rejected Ambani’s Crore Offer: దేశంలో అత్యంత సంపన్నుడైన రిలయన్స్‌ అధినేత ముఖేష్ అంబానీ, అనంత్‌ అంబానీ కుమారుడి ఫ్రీ వెడ్డింగ్ వేడుకలు అంగరంగ వైభవంగా, కనీవినీ ఎరుగని రీతిలో జరిగాయి. అనంత్ అంబానీ, రాధిక ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్‌లు గుజరాత్ జామ్‌నగర్‌లో వేదికగా జరిగాయి. ఈ వేడుకల మహోత్సవానికి దేశ,విదేశీ ప్రముఖులు హాజరయ్యి సందడి చేశారు. అయితే తన కొడుకు పెళ్లి వేడుకలకు పాడేందుకు ప్రముఖ సింగర్‌ని అంబానీ పిలవగా నో చెప్పాడట. ఇంతకీ ఎవరా హీరో తెలియాలంటే లెట్స్ రీడ్ దిస్ స్టోరీ.


దేశంలోనే అత్యంత సంపన్నుడు అంబానీ చిన్న కొడుకు వివాహ వేడుక కోసం బంగ్లాదేశ్‌కి చెందిన బోల్డ్ యాక్టర్, సింగర్ జాయేద్ ఖాన్‌ని ముఖేష్ అంబానీ స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారట. ఆయన ఆఫర్‌ని చాలా సున్నితంగా రిజెక్ట్ చేశారట. ప్రస్తుతం వీరిద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ఆడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతూ చెక్కర్లు కొడుతోంది.

Read More: రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ చేసింది ఇతనేనా..? అనుమానితుడి ఫోటో విడుదల చేసిన ఎన్ఐఏ.


ముఖేష్ అంబానీ మీరు నాకు బాగా తెలుసు. మీరు ఫోన్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉందంటూ జాయెద్ ఖాన్ ఆశ్చర్యపోయాడు. నువ్వు నా కొడుకు పెళ్లికి తప్పకుండా రావాలి. నువ్వు అంటే నా కొడుకు అనంత్ అంబానీకి కూడా చాలా ఇష్టం. నువ్వు రాకపోతే నా కొడుకు పెళ్లి కూడా చేసుకోనంటున్నాడు. కాబట్టి ఎలాగైనా నువ్వు రావాలి అని ముఖేష్ అంబానీ రిక్వెస్ట్ చేశాడు. దాంతో నేను చాలా బిజీగా ఉంటానని జాయేద్ అంటే.. సాధారణంగా నా పీఏ ఫోన్ చేస్తాడు. కానీ నీవు కాబట్టి నేను స్వయంగా ఫోన్ చేశాను. నీవు రిజెక్ట్ చేయవని అనుకొంటున్నాను అని అంబానీ సమాధానం ఇచ్చాడు.

ముఖేష్ అంబానీ రెక్వెస్ట్ తర్వాత.. జాయేద్ ఆన్సర్ ఇస్తూ… పెళ్లి ఎప్పుడని అడిగారు. దాంతో రెండు మూడు రోజుల తరువాత అని ముఖేష్ రిప్లై ఇచ్చాడు. దాంతో నా షెడ్యూల్ జామ్‌ ప్యాక్‌గా ఉంది. ముస్లీంల వేడుకల్లో నేను బిజీగా ఉన్నాను. కాబట్టి నేను రాలేను అని జాయెద్ రిప్లై ఇచ్చాడు. దాంతో నా ఇంట్లో జరిగే పెళ్లికి కాకుండా ముస్లింల వేడుకల్లో పాల్గొంటావా అని ముఖేష్ ప్రశ్నించాడు. నేను కమిట్ అయితే మాట తప్పను. కాబట్టి నేను రాలేను అంటూ అవతలి నుంచి సమాధానం వచ్చింది.

Read More:డీఎంకే కాంగ్రెస్‌ కూటమితో ఎంఎన్ఎమ్ పొత్తు.. పోటీకి దూరంగా కమల్ హాసన్ పార్టీ..

దాంతో నీకు ఫోన్ చేసింది ముఖేష్ అంబానీ అనే విషయం గుర్తుంచుకో అంటూ నీవు ముఖేష్ అంబానీ అయినా.. ఐ డోంట్ కేర్ అంటూ ఘాటుగా సంభాషించాడు. షారుక్‌, సల్మాన్‌ ఖాన్ లాంటి వారే నా ఫ్యాన్స్ అంటూ రిప్లై ఇచ్చాడు. అయితే 30 వేల కోసం నీవు నా రిక్వెస్ట్‌ను రిజెక్ట్ చేస్తున్నావా? నేను బిచ్చగాళ్లకు 30 వేలను బహుమతి ఇస్తాను. నేను నీకు 30 లక్షలు ఇస్తాను. నా ఇంట్లో పెళ్లికి రా..అని అంటే.. నీవు 30 కోట్ల రూపాయలు ఇచ్చినా నేను రాలేను. నేను కమిట్‌మెంట్ ఇస్తే ఎవరు అడిగినా, ఎంత పెద్ద ఆఫర్ వచ్చినా నేను నా మాట తప్పను. నా మాట నేనే వినను అని జాయెద్ ఖాన్ ముక్కుసూటిగా చెప్పేశాడు.

అనంత్ అంబానీ పెళ్లికి రాలేను అని చివరకు జాయేద్ ఖాన్ అని తేల్చేశాడు. అయితే మీ అబ్బాయికి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ విషయం నాకు దుబాయ్‌లో తెలిసింది అంటే..అవునా..అయితే అనంత్‌ను బంగ్లాదేశ్ పంపిస్తాను. నీవు అక్కడే ట్రైనింగ్ ఇవ్వు. నీకు 100 కోట్లు ఇస్తాను. మూడురోజుల తర్వాత పంపిస్తా అంటే.. లేదు..మూడు రోజులు కాదు. నెల తర్వాత పంపించు..అప్పుడు నేను ఫ్రీగా ఉంటానని జాయెద్ ఖాన్ చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియో రియల్‌ హా? లేక ఫేకా? అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక ఇదే విషయంపై నెటిజన్లు తమతమ అభిప్రాయాలను రకరకాలుగా వ్యక్తం చేస్తున్నారు.

Related News

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

Big Stories

×