BigTV English

Tamil Nadu: డీఎంకే కాంగ్రెస్‌ కూటమితో ఎంఎన్ఎమ్ పొత్తు.. పోటీకి దూరంగా కమల్ హాసన్ పార్టీ..

Tamil Nadu: డీఎంకే కాంగ్రెస్‌ కూటమితో ఎంఎన్ఎమ్ పొత్తు.. పోటీకి దూరంగా కమల్ హాసన్ పార్టీ..

DMK Congress MNM Alliance In Tamil NaduDMK Congress MNM Alliance In Tamil Nadu (political news telugu): తమిళనాడులో లోక్‌సభ ఎన్నికల కోసం అధికార ద్రవిడ మున్నేత్ర కళగం (DMK), కాంగ్రెస్, సినీ నటుడు కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యమ్‌తో సీట్ల భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది.


శనివారం(మార్చి 9) చెన్నైలో కమల్ హాసన్ పొత్తుపై కీలక ప్రకటన చేశారు.‘‘నేను, నా పార్టీ.. ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. అయితే ఈ కూటమికి అన్ని విధాలా సహకరిస్తాం.. ఇది కేవలం పదవి కోసమే కాదు.. దేశం కోసం” అని కమల్ హాసన్ అన్నారు.

చెన్నైలోని డీఎంకే కార్యాలయంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌, మంత్రి ఉదయనిధి స్టాలిన్‌లను కమల్ హాసన్ కలిశారు.


“మక్కల్ నీది మయ్యమ్ (MNM) లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు, MNM పార్టీ డీఎంకే, కాంగ్రెస్‌ కూటమికి మద్దతు ఇస్తుంది. వారి తరఫున ప్రచారం చేస్తుంది. రాజ్యసభలో ఎంఎన్‌ఎంకు ఒక సీటు (2025లో) రానుంది’’ అని పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణాచలం అన్నారు.

డీఎంకే.. ఇండియా కూటమి మిత్రపక్షమైన కాంగ్రెస్‌తో సీట్ల పంపకంపై కసరత్తు చేస్తోంది. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వంలో రెండు పార్టీలు కూటమి భాగస్వాములుగా ఉన్నాయి.

కమల్ హాసన్ చాలా నెలల క్రితం తమిళనాడులో డీఎంకే నేతృత్వంలోని కాంగ్రెస్ సమ్మిళిత కూటమి వైపు మొగ్గు చూపారు.

గత ఏడాది సెప్టెంబర్‌లో, డిఎంకే నాయకుడు, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ పార్లమెంటరీ ఎన్నికలకు ముందు ఎంఎన్‌ఎంతో పొత్తు పెట్టుకోనున్నట్లు సూచించాడు.

Read More: మధ్యప్రదేశ్ సెక్రటేరియట్‌లో భారీ అగ్నిప్రమాదం

తమిళనాడులో మొత్తం 39 లోక్‌సభ స్థానాలున్నాయి. కాంగ్రెస్, సీపీఐ, సీపీఐ (ఎం), విడుతలై చిరుతైకల్ (వీసీకే), చిన్న పార్టీలతో కూడిన డీఎంకే నేతృత్వంలోని కూటమి 2019లో 39 స్థానాలకు గాను 38 స్థానాలను కైవసం చేసుకుంది. మిగిలిన ఒక్క సీటును ఏఐఏడీఎంకే గెలుచుకుంది.

గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ రాణించలేకపోయిన రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటి. 2019లో, లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు ఏడు దశల్లో జరిగాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ 303 సీట్లతో ఘనవిజయం సాధించింది.

Tags

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×