E-Paper
Advertisement

రీల్ కాస్త రియల్ లైఫ్.. ఓ యువకుడి పెళ్లాడిన ముగ్గురు అక్కాచెల్లెళ్ళు, ఆ ఒక్క కారణంతో- వీడియో వైరల్

రీల్ కాస్త రియల్ లైఫ్.. ఓ యువకుడి పెళ్లాడిన ముగ్గురు అక్కాచెల్లెళ్ళు, ఆ ఒక్క కారణంతో-  వీడియో వైరల్
Advertisement

Uttar Pradesh: వింతలు.. విశేషాలకు కేరాఫ్‌గా మారుతోంది యూపీ. అసలే అమ్మాయిలు దొరక్క దేశంలో పెళ్లికాని ప్రసాదుల సంఖ్య పెరుగుతోంది. కానీ ఓ వ్యక్తి.. ముగ్గురు అక్కాచెల్లెళ్లను వివాహం చేసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. అందులో ఒకరు బీటెక్ చదువుతున్న అమ్మాయి ఉంది. ఇంతకీ ముగ్గురు అమ్మాయిలు ఎలా ఓకే చేశారు?  దానికి కారణాలేంటి? అనే దానిపై ఓ లుక్కేద్దాం.

యూపీలో విచిత్ర ఘటన-ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ధౌరియా గ్రామానికి చెందిన అల్కా-దేవిక-సంతోష్‌లు అక్కా చెల్లెళ్లు. వీరంతా ఏ పని చేసినా కలిసి చేస్తుంటారు. అంతేకాదు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. రీల్స్‌, వీడియో కంటెంట్‌ క్రియేట్ చేస్తుంటారు. వీరికి ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌ల్లో ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ భారీగానే ఉంది.

Advertisement

ఓ యువకుడి పెళ్లాడిన ముగ్గురు అక్కాచెల్లెళ్ళు- అదే జిల్లాకు చెందిన వికాస్‌ అనే యువకుడు వీరి రీల్స్ వీడియోలు షూట్ చేస్తుంటాడు. కంటెంట్ క్రియేట్ చేసే క్రమంలో  కొన్ని వీడియోల్లో ముగ్గురు అక్కాచెల్లెళ్లకు భర్తగా నటించాడు. దీంతో ఈ నలుగురు మాంచి ఫేమస్ అయ్యారు. డబ్బులు అలాగే వచ్చేవి. అందులో సరోజ బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతోంది. మరో ఇద్దరు ఇంటర్ పూర్తి చేశారు.

కేవలం ఆ ఒక్క కారణంతో- ఇటీవల ముగ్గురు అక్కా చెల్లెళ్లలో ఓ భయం మొదలైంది. వయస్సు పెరుగుతోందని, వివాహం చేసుకుంటే వేర్వేరు కుటుంబాలకు వెళ్లిపోతామని అనుకున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులను పెళ్లి చేసుకుంటామని మనసులోని మాట పేరెంట్స్‌కు చెప్పారట. ఆ తర్వాత వారిలో అమ్మాయిల మనసులో రకరకాల సందేహాలు వ్యక్తమయ్యాయి.

Advertisement

వికాష్ ఏమన్నాడు? చివరకు విడిపోవడం ఇష్టం లేక వారికి కెమెరామన్‌గా పని చేస్తున్న సంతోష్ అనే యువకుడ్ని వివాహం చేసుకోవాలని డిసైడ్ అయ్యారు.  ఈ విషయాన్ని కెమెరామెన్‌ వికాస్ చెప్పడం, ఆ తర్వాత స్థానికంగా ఉండే ఓ ఆలయంలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు-వికాష్ వివాహం చేసుకోవడం జరిగిపోయింది. దీనికి  ఇరు కుటుంబాల పెద్దలు దూరంగా ఉన్నారు.

ఈ వివాహం విషయం బయటకు తెలియగానే కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత మొదలైంది. ఈ నేపథ్యంలో  వీటిపై స్పందిస్తూ ఓ వీడియో విడుదల చేశారు వారంతా.  మేము చిన్నప్పటి నుండి కలిసి జీవించామని, విడివిడిగా జీవించడాన్ని ఊహించలేమని తెలిపారు. పెళ్లి.. తమను వేరు చేస్తుందని తెలియగానే మా జీవితాలను ముగించుకోవాలని అనుకున్నాము.

ALSO READ: 26 రోజుల పోరాటానికి సుఖాంతం.. దీక్ష విరమించిన సోనమ్ వాంగ్‌చుక్, అసలేం జరిగిందంటే?

చనిపోవడానికి బదులుగా కలిసి ఒకే వ్యక్తిని వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మేమంతా ఇష్ట పూర్వకంగా నిర్ణయం తీసుకున్నామని తెలియజేశారు. అక్కాచెల్లెళ్ల మధ్య ఉన్న బంధం గురించి తనకు తెలుసని, వారితో కలిసి జీవించడానికి అంగీకరించి పెళ్లి చేసుకున్నానని వికాస్ చెప్పాడు. ఈ వ్యవహారం చివరకు స్థానిక పోలీసుల దృష్టికి వెళ్లడంతో వారితో ఇదే విషయాన్ని చెప్పినట్టు తెలిపారు. ముగ్గురు అక్కాచెల్లెళ్లలో ఇద్దరు తోబుట్టువులు. మరొకరు వరుసకు సోదరి, కాకపోతే వీరంతా ఒకే ఇంట్లో కలిసి పెరిగారు.

 

 

Related News

2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఇంటర్ విద్యార్హతతో స్టాఫ్ సెలెక్షన్ కమిషన్‌లో జాబ్స్

ప్రధాని పర్యటన వేళ కలకలం.. తుపాకీ, నకిలీ గుర్తింపు కార్డుతో ఇద్దరు అరెస్టు

చిరుతను ఢీకొట్టిన కారు.. సాయం కోసం వచ్చిన అధికారిపై దాడి చేసిన క్రూరమృగం.. షాకింగ్ వీడియో!

పరీక్షల్లో 95.7 శాతం మార్కులు.. అయినా స్టూడెంట్ ఆత్మహత్య.. అసలేం జరిగిందంటే?

ఉపాధ్యాయుల నియామకాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. వాళ్ల ఉద్యోగాలు ఔట్!

టీచర్ల నియామకాలపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు, అలాంటివారి నో ఛాన్స్

శ్రీవారి దర్శనం తర్వాత బెంగళూరు వెళ్తుండగా.. డివైడర్‌ను ఢీ కొట్టిన కారు, నలుగురు మృతి

విపక్షానికి స్ట్రాంగ్ కౌంటర్.. డబుల్ మీనింగ్స్ వద్దు, చట్టం ఊరుకోదని హెచ్చరించిన సీఎం విజయ్

Big Stories

Advertisement
×