E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode July 24th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: మదన్ రూంలోకి వెళ్లిన లక్కీ   

Brahmamudi Serial Today Episode July 24th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: మదన్ రూంలోకి వెళ్లిన లక్కీ   
Advertisement

Brahmamudi serial today Episode: ఇందు, నందు ఇద్దరూ కలిసి తనను తిట్టి కొట్టిన విషయం గుర్తు చేసుకుంటూ వాళ్లిద్దరికీ సరైన బుద్ది చెప్పాలి నేనేంటో వీళ్లిద్దరికీ చూపించాలి అనుకుంటూ ఐశ్వర్య ఆలోచిస్తుంటే.. అప్పుడే లక్కీ, ఐశ్వర్య రూంలోకి వెళ్తాడు. లక్కీని చూసి ఐశ్వర్య షాక్‌ అవుతుంది. ఏయ్‌ నువ్వేంటి ఇక్కడ ఉన్నావు.. అని అడగ్గానే.. నేను ఇక్కడే కదా ఉంటున్నాను.. ఈరోజు నుంచి నేను కూడా ఈ ఇంట్లోనే ఉంటాను అని చెప్పగానే.. ఐశ్వర్య ఏంటి నువ్వు కూడా ఈ ఇంట్లోనే ఉంటావా..? అని అడుగుతుంది. అవును ఆ దేవుడు చాలా గ్రేట్‌ తెలుసా..? నువ్వు లేకుండా నేను ఉండలేనని నన్ను కూడా నీ దగ్గరకే పంపించాడు తెలుసా..? ఇప్పుడు నాకు ఎంత సంతోషంగా ఉందో.. అంటూ ఆనందంతో ఎగిరిగంతేస్తుంటే..

ఐశ్వర్య కోపంగా ఏయ్‌ ఆపు అసలు నిన్ను ఇంట్లోకి ఎవరు రానిచ్చారు అంటూ తిడుతుంది. దీంతో లక్కీ మరీ అంత తక్కువ చేసి మాట్లాడకు ఐషూ.. మీ రేఖ ఆంటీనే నన్ను ఈ ఇంట్లో ఉండమని చెప్పింది అనగానే.. ఐశ్వర్య షాక్‌ అవుతుంది. ఇంట్లో ఉండమని చెప్పిందో.. లేక మరేదైనా చెప్పిందో..? ఎవరు పడితే వాళ్లు ఇంట్లోకి వచ్చేస్తున్నారు.. మొన్న ఆ శృతి వచ్చింది.. ఇవాళ నువ్వు వచ్చావు.. ముందు రేఖ ఆంటీని అడుగుతాను ఉండు అంటూ బయటకు వెళ్తుంటే.. లక్కీ, ఐశ్వర్య చేయి పట్టుకుని లాగేస్తాడు. ఎక్కడికి వెళ్తావు.. చెప్పు ఇక్కడే ఉండు.. కొద్దిసేపు మాట్లాడుకుందాం అంటూ రొమాంటిక్‌గా మాట్లాడుతుంటే.. ఇక్కడ నాకే దిక్కు లేదు.. ఇక్కడ నిన్ను ఎవరు పట్టించుకుంటారు.. అంటూ ఐశ్వర్య వెళ్లిపోతుంది. ఏది ఏమైనా నిన్ను వదిలే ప్రశక్తే లేదు అనుకుంటాడు లక్కీ.

Advertisement

రేఖతో భ్రమరాంబ కోపంగా ఆ లక్కీగాడు ఈ ఇంట్లో ఉండటానికి ఎందుకు ఒప్పుకున్నావు రేఖ. ఆ గాలికోయే కంపను ఇంట్లోకి ఎందుకు తీసుకొచ్చావు అంటూ ప్రశ్నిస్తుంది. భూషణ్‌ కూడా చెప్పు కూడా రేఖ అసలు ఏ కారణం చేత వాడు ఇంట్లో ఉండటానికి ఒప్పుకున్నావు.. ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది ఏంటో చెప్పు రేఖ అని అడగ్గానే.. ఏం చెప్పను భూషణ్‌ ఆ లక్కీ గాడు నాకు పుట్టిన కొడుకే అని చెప్పాలా..? అని మనసులో అనుకుంటుంటే.. భూషణ్‌ చెప్పు రేఖ నీ మనసులో ఏముందో చెప్పు అంటూ అడగ్గానే.. శేషు కల్పించుకుని మనసలో ఉన్నది చెప్పకూడదనే చెప్పడం లేదేమో బావ అంటాడు. రేఖ కోపంగా చూస్తుంది.

గండికోట రహస్యంలాగా నీ మనసలో ఏదో రహస్యం ఉందా చెల్లమ్మా అని అడిగితే భ్రమరాంబ కూడా అవునా రేఖ మాకు తెలియకుండా ఏదైనా రహస్యం ఉందా..? మాకు ఎందుకు చెప్పడం లేదు.. ఎందుకు తగ్గుతున్నావు  అంటూ నిలదీయగానే.. నేను తగ్గడం ఏంటి..? నేను ఎప్పుడూ ఒకేలా ఉన్నాను అంటూ రేఖ చెబితే.. భ్రమరాంబ మాత్రం రేఖ ఏంటో  నువ్వే చెప్పాలి అని అడగ్గానే.. రేఖ జరిగిన విషయం చెప్పి తాను తప్పక ఒప్పుకున్నాను అని చెప్పగానే.. మరి వాడిని ఎన్ని రోజులు భరించాలి అంటూ భ్రమరాంబ అడిగితే.. నేనే ఆ రాజు గాడి ఆగడాలకు అడ్డుకట్ట వేస్తాను.. అప్పటి వరకు మీరంతా సైలెంట్‌గా ఉండండి అంటూ చెప్పి వెళ్లిపోతుంది. భ్రమరాంబ అనుమానంగా ఈ రేఖ ఏదో దాస్తుంది అంటూ అనుమానపడుతుంది.

Advertisement

ఇందు, రాజుతో రేఖను ఎలా మారుస్తావు.. ఆ రేఖ మనసులోంచి నిజాన్ని ఎలా బయటకు తీసుకొస్తావని అడిగితే.. ప్రపంచానికి తెలిసిన కొడుకును అడ్డుపెట్టుకుని ప్రపంచానికి తెలియని కొడుకును బయటకు తీసుకురావడానికి ప్లాన్‌ చేద్దాం అంటాడు. అప్పుడే లక్కీ వచ్చి తాను ఏ రూంలో ఉండాలి అని అడుగుతాడు. మదన్‌ రూంలో ఉండమని చెప్తాడు. ఆ మాటకు లక్కీ షాక్‌ అవుతాడు. మదన్‌ రూంలో పడుకోనని భయపడతాడు. ఇందు, రాజు ధైర్యం చెప్పి లక్కీని మదన్‌ రూంలో ఉండేట్టు చేస్తారు. మదన్‌ రూంలోకి వచ్చిన లక్కీని చూసి ఏయ్‌ ఏంటి నా గదిలోకి వచ్చావు.. బయటకు వెళ్లు అనగానే.. నేను ఇక్కడే ఉంటాను.. నీ గదిలోనే ఉండమని మీ మమ్మే చెప్పింది అనగానే.. మదన్‌ కోపంగా ఇప్పుడే మా మమ్మీతో మాట్లాడతాను అంటూ కిందకు వెళ్లి రేఖను పిలుస్తాడు మదన్‌. రేఖ రాగానే.. వీడిని నా రూంలో ఉండమని నువ్వే చెప్పావా..? అని అడిగితే రేఖ నేను చెప్పలేదు అంటుంది.

గుమ్మంలోంచి నేను చెప్పాను పిన్ని అంటూ వస్తాడు. భ్రమరాంబ కోపంగా హలో రాజు నువ్వు చెప్పడం ఏంటి..? అని అడిగితే.. నేను చెబితే..ఏంటి..? రేఖ పిన్ని చెబితే ఏంటి..? అనగానే.. అయినా ఇద్దరు ఒకే రూంలో ఉంటే అన్నదమ్ముల్లా ఒకరినొకరు కలిసిపోతారు.. అని చెప్పగానే.. భ్రమరాంబ నేను ఒప్పుకోను.. ఈ అనాథ వెదవ నా అల్లుడితో కలిసి ఉంటాడా..? నా అల్లుడి స్థాయి ఏంటి..? వీడి స్థాయి ఏంటి..? అంటే స్థాయి ఏంటి అత్తయ్యా వాళ్లిద్దరూ అన్నదమ్ముల్లే కదా..? అనగానే.. అందరూ షాక్‌ అవుతారు. శేషు ఏంటి అన్నదమ్ముల్లా..? అని అడిగితే.. అన్నదమ్ముల్లే కదా..? రేఖ పిన్ని లక్కీకి తల్లి కదా..? అనగానే.. అందరూ మరింత డబుల్‌ షాక్‌ అవుతారు.

అదే రేఖ పిన్ని లక్కీ గాడికి తల్లిలాంటిదే కదా..? మదన్‌, లక్కీకి తమ్ముడు అవుతాడు అని చెప్పగానే.. మదన్‌ కోపంగా తిడతాడు. భూషణ్ కూడా కోపంగా రాజును తిడతాడు. భ్రమరాంబ కూడా కోపంగా ఈ లక్కీగాడిని ఎందుకు ఇంట్లోకి తీసుకొచ్చావు అంటుంది. తీసుకొచ్చాను మీరు సైలెంట్‌గా ఉండండి అంటాడు. మేం దీనికి ఒప్పుకోము అంటాడు భూషణ్‌.. ఒప్పుకునేది మీరు కాదు బాబాయ్‌ రేఖ పిన్ని ఒప్పుకుంటే సరిపోతుంది. అనగానే.. మదన్‌ మమ్మీ నీకు ఇష్టం లేదని చెప్పు అని అడగ్గానే.. రేఖ మౌనంగా ఉండిపోతుంది. ఇంతలో ఈరోజు బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

పోలీస్ స్టేషన్ లో యూట్యూబర్ నందన.. బిగ్ బాస్ కోసమే వచ్చి దొరికిపోయారా?

బీబీ కొంపలో బెట్టింగ్ మాఫియా.. మరోసారి నాగార్జున పై రెచ్చిపోయిన నా అన్వేష్!

ఏం తప్పు చేశాను.. రాబందులలా పొడుచుకు తింటున్నారు..రాజకుమారి ఎమోషనల్!

బిగ్ బాస్ 10.. ఆ ముగ్గురు కంటెస్టెంట్స్ కి సపోర్టుగా హైపర్ ఆది!

ఆరోజు జరిగిందిందే.. నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి అసిస్టెంట్!

మొదలైన వార్.. కృష్ణుడు ఫైర్!

Podarillu Serial : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆ క్యారక్టర్ అవుట్..

Nindu Noorella Saavasam Serial Today EpisodeSeptember 8th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: బుజ్జమ్మ శక్తులు హరించేందుకు వెళ్లిన ప్రచండ

Big Stories

Advertisement
×