E-Paper
Advertisement

UGC Fake Universities: ఈ 32 యూనివర్సిటీలు ఫేక్.. ఏపీలో రెండు

UGC Fake Universities: ఈ 32 యూనివర్సిటీలు ఫేక్.. ఏపీలో రెండు
Advertisement

UGC Fake Universities: దేశ వ్యాప్తంగా 12 రాష్ట్రాలలో 32 ఫేక్ యూనివర్సిటీలను ఉన్నాయని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) గుర్తించింది. విద్యార్థులు ఈ యూనివర్సిటీల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గత రెండు సంవత్సరాలలో ఫేక్ యూనివర్సిటీలో సంఖ్య 20 నుంచి 32కి పెరిగింది. యూజీసీ చట్టం ప్రకారం గుర్తింపు పొందని, చెల్లుబాటు అయ్యే డిగ్రీలను ప్రదానం చేసే అధికారం లేని సంస్థలలో అడ్మిషన్లు తీసుకోవద్దని యూజీసీ సూచించింది.

దిల్లీలో అత్యధికంగా

ఫేక్ వర్సిటీలున్న జాబితాలో కొత్తగా హర్యానా, రాజస్థాన్, జార్ఖండ్, అరుణాచల్ ప్రదేశ్ చేరాయి. గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ పేరుతో బెంగళూరులో ఫేక్ వర్సిటీ ఉందని యూజీసీ హెచ్చరించింది. దీనికి విశ్వవిద్యాలయంగా పనిచేయడానికి అర్హతలు లేవని పేర్కొంది. దేశ రాజధాని దిల్లీలో అత్యధికంగా నకిలీ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. దిల్లీలో మొత్తం 12 ఫేక్ యూనివర్సిటీలున్నాయి. వీటిలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అండ్ ఫిజికల్ హెల్త్ సైన్సెస్, కమర్షియల్ యూనివర్సిటీ లిమిటెడ్, యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ, విశ్వకర్మ ఓపెన్ యూనివర్సిటీ ఫర్ సెల్ఫ్-ఎంప్లాయ్మెంట్ అండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ ఇంజినీరింగ్ వంటివి ఉన్నాయి.

ఏ రాష్ట్రాల్లో

Advertisement

ఉత్తర్ ప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలలో కూడా ఫేక్ విశ్వవిద్యాలయాలు ఉన్నట్లు కమిషన్ గుర్తించింది. ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లలో గాంధీ హిందీ విద్యాపీఠ్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ సంస్థలకు యూజీసీ గుర్తింపు లేదు. హర్యానాలో, ఫరీదాబాద్‌లోని మ్యాజిక్ అండ్ ఆర్ట్ వర్సిటీ, జార్ఖండ్‌ రాంచీలోని దక్ష విశ్వవిద్యాలయానికి యూజీసీ అనుమతులు లేవు.

విద్యార్థుల కెరీర్ ప్రమాదంలో

ఈ యూనివర్సిటీలు జారీ చేసిన డిగ్రీలు చెల్లవని యూజీసీ పేర్కొంది. ఇలాంటి విద్యా సంస్థల్లో చేరిన విద్యార్థుల కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం ఉందని తెలిపింది. అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకునే ముందు విద్యార్థులు యూజీసీ వెబ్‌సైట్‌లో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాల జాబితాను చెక్ చేసుకోవాలని కోరింది.

తక్కువ ఫీజులతో

Advertisement

నకిలీ విశ్వవిద్యాలయాలు… తక్కువ టైమ్ లో డిగ్రీలు, తక్కువ ఫీజులు, నచ్చిన కోర్సులను హామీ ఇస్తూ విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. చాలా విశ్వవిద్యాలయాలు సరైన మౌలిక సదుపాయాలు, ప్రొఫెసర్లు లేదా సరైన విద్యా ప్రమాణాలు లేకుండా పనిచేస్తున్నాయి. ఇటీవల ఫేక్ వర్సిటీల సమస్య మరింతగా పెరిగింది. నకిలీ సంస్థలు తమను తాము విదేశీ విశ్వవిద్యాలయాలుగా పేర్కొంటున్నాయి. ఫేక్ వర్సిటీలపై అవగాహన కల్పించేందుకు యూజీసీ క్రమం తప్పకుండా నకిలీ విశ్వవిద్యాలయాల జాబితాను విడుదల చేస్తుంది.

ఏపీలో రెండు

ఏపీలోని క్రైస్ట్ న్యూ టెస్టమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ(గుంటూరు), బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా(విశాఖ) వర్సిటీను నకిలీవని యూజీసీ గుర్తించింది.

ఫేక్ యూనివర్సిటీ జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read:  చిచ్చు రేపిన యూజీసీ ‘ఈక్విటీ’ నిబంధనలు.. సుప్రీంకోర్టులో పిటిషన్, విద్యార్థుల నిరసనలు

Related News

డీజీపీ అనురాగ్‌ సూసైడ్‌, విచారణకు ప్రభుత్వ ఆదేశం, ఆఫీసులో ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

రన్నింగ్‌ బస్సులో జుట్టు పట్టుకొని కొట్టుకున్న లేడి కండక్టర్, మహిళా ప్యాసింజర్.. ఇదిగో వీడియో!

తమిళనాడులో వేడెక్కిన రాజకీయం.. సీఎం విజయ్‌కు బెదిరింపులు, డీఎంకె ఎమ్మెల్యే అరెస్ట్

ట్రీట్‌మెంట్‌కి వచ్చిన పేషెంట్.. ఫ్యాన్ చంపేసింది, ఆసుపత్రిలో ఆ రాత్రి ఏం జరిగిందంటే..

కేంద్రానికి ఆఖరి గడువు.. మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

Big Stories

Advertisement
×