E-Paper
Advertisement

విజయ్ మే 16న ముహూర్తం!.. సంపద అంతా రియల్ ఎస్టేట్, మరి కార్ల మాటేంటి? ఆస్తులు రూ. 624 కోట్లు

విజయ్ మే 16న ముహూర్తం!.. సంపద అంతా రియల్ ఎస్టేట్, మరి కార్ల మాటేంటి? ఆస్తులు  రూ. 624 కోట్లు
Advertisement

Chennai: కోలీవుడ్ రంగాన్ని దాదాపు దశాబ్దం పైగానే ఏలిన దళపతి విజయ్, తన కెరీర్‌లో మరొక ఇన్నింగ్స్ మొదలుపెట్టేశారు. రేపో మాపో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఆయన. సీఎంగా బాధ్యతలు చేపట్టడానికి ఏ రోజు మంచిదైతే బాగుందని ఇప్పటికే ఆయన కుటుంబసభ్యులు పురోహితులను పిలిపించి మాట్లాడినట్టు తెలుస్తోంది.

అన్నట్లు అమావాస్య అంటే తమిళులకు ఇష్టమైన రోజు. మే 16 అనగా శనివారం అమావాస్య రోజున విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారనే ప్రచారం అప్పుడే మొదలైంది. అదే జరిగితే మరో 10 రోజుల్లో ఆయన బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.

Advertisement

మే 16న విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం

తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించారు దళపతి విజయ్. అసెంబ్లీ ఎన్నికల్లో దిగ్గజ పార్టీలైన డీఎంకే, ఏఐడీఎంకే చావుదెబ్బ కొట్టి విజయ దుందుబి మోగించారు. 234 స్థానాలకు 108 సీట్లను టీవీకే పార్టీ గెలుచుకుంది. విజయ్ తన అభిమాన సంఘాలతోకాకుండా ఆర్థిక పునాదులతో ఎన్నికల బరిలో అడుగుపెట్టారు. అఫిడవిట్ ప్రకారం విజయ్ మొత్తం ఆస్తుల విలువ 624 కోట్లు రూపాయలు.

Advertisement

సాధారణంగా రాజకీయ నేతలు తమ ఆస్తులను భూములు, బినామీల రూపంలో పెట్టడం చూస్తుంటాము. కాకపోతే ఆయన ఆస్తుల్లో ఒకవంత క్యాష్ రూపంలో ఉంది. బ్యాంకు డిపాజిట్లు, రియల్ ఎస్టేట్‌కు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఈక్విటీ మార్కెట్లలో చాలా తక్కువ. ఎంతంటే 0.04 శాతం మాత్రమే.

బ్యాంకుల్లో సంపద: విజయ్ చరాస్తులు సుమారు రూ. 404 కోట్లుకాగా, స్థిరాస్తులు దాదాపు రూ. 220 కోట్లుగా ప్రస్తావించారు. తనకు ఎలాంటి అప్పులు లేవని వెల్లడించారు. సాలిగ్రామంలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఖాతాలో రూ. 213 కోట్లకు పైగా నిల్వలు ఉన్నాయి. విజయ్ రూ.100 కోట్లను నాలుగు బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేశారు.

విజయ్ సంపద అంతా రియల్ ఎస్టేట్.. కార్ల గురించి చెప్పనక్కర్లేదు

యాక్సిస్ బ్యాంక్‌లో రూ. 40 కోట్లు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో రూ. 25 కోట్లు, హెచ్‌డిఎఫ్‌సి రూ. 20 కోట్లు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రూ. 15 కోట్లు ఉన్నాయి. అన్ని పరిశీలిస్తే ఆయన సంపద నగదు రూపంలో అత్యధిక భాగం ఉంది. మార్కెట్ రిస్క్ లేకుండా హామీతో కూడిన రాబడిని అందించే మార్గం.

విజయ్ ఈక్విటీ వాటాలు చాలా తక్కువగా ఉన్నాయి. జయ నగర్ ప్రాపర్టీ ప్రైవేట్ లిమిటెడ్‌లో సుమారు రూ. 19.69 లక్షల విలువైన షేర్లు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో రూ. 9,600 విలువైన షేర్లు, సన్ పేపర్ మిల్ లిమిటెడ్‌లో రూ. 25 వేల విలువైన షేర్లు ఉన్నాయి. స్టాక్ మార్కెట్‌లో విజయ్ పెట్టుబడి రూ. 20 లక్షల కంటే తక్కువ. అతను ప్రకటించిన నికర ఆస్తి విలువలో 0.04 శాతం కంటే తక్కువ.

విజయ్ రియల్ ఎస్టేట్:   సంపద దాదాపు డిపాజిట్లు, స్థిర ఆదాయం, ఆస్తిపై వచ్చినవే. చెన్నైలో రియల్ ఎస్టేట్ బాగానే ఉంది. విజయ్ స్థిరాస్తుల నివాసాలు, వాణిజ్య-వ్యవసాయ ఆస్తుల విలువ సుమారు రూ. 220 కోట్లు. నీలన్‌కరై, సాలిగ్రామం, మైలాపూర్, ఎగ్మోర్‌తోపాటు ఇతర ప్రాంతాలలో ఉన్న 10 నివాస ఆస్తుల విలువ దాదాపు రూ. 115 కోట్లు.

ALSO READ: గెలుపు ఓకే.. వాటి మాట ఏంటి? కాబోయే సీఎం విజయ్‌కు ముందుంది ముసళ్ల పండగ 

పరివక్కం, త్యాగరాయ నగర్, షోలింగనల్లూర్, కొప్పూర్‌లలోని వాణిజ్య ఆస్తుల విలువ సుమారు రూ. 82 కోట్లు పైమాటే. పోరూర్, సాలిగ్రామం, నీలన్‌కరైలలోని వ్యవసాయేతర భూమి విలువ రూ. 22 కోట్లు. కొడైకనాల్‌లోని వట్టపట్టి గ్రామంలో రూ. 20 లక్షలు విలువ చేసే వ్యవసాయ భూమి ఉంది. వీటి నుంచి ఆదాయం అధికంగా వస్తుందని తెలుస్తోంది.

విజయ్ వాహనాలు:  వద్దకు వద్దాం. 2024 లో టయోటా లెక్సస్ 350-రూ. 3.01 కోట్లు కొనుగోలు చేశారు. అదే ఏడాదిలో బీఎండబ్ల్యూ ఐ7- రూ. 2 కోట్లు, టయోటా వెల్ఫైర్-రూ. 1.63 కోట్లు కొనుగోలు చేశాడు. ఆరేళ్ల కిందట అంటే 2020 బీఎండబ్ల్యూ 530-రూ. 80.5 లక్షలు, 2024లో మారుతి స్విఫ్ట్- రూ. 5.35 లక్షలు, 2025 టీవీఎస్ ఎక్స్ఎల్ సూపర్ బైక్-రూ. 67 వేలు కలిగి ఉన్నారు.

విజయ్ బంగారు ఆభరణాలు: విజయ్‌కు రూ. 1.2 కోట్ల విలువైన 883 గ్రాముల బంగారం-వెండి వస్తువులు ఉన్నాయి. అఫిడవిట్‌లో కుటుంబ సభ్యులకు ఇచ్చిన 14 రుణాలు, అడ్వాన్సుల వివరాలు ఉన్నాయి. భార్య సంగీతా విజయ్‌కు రూ. 12.6 కోట్లు, జాసన్ సంజయ్‌కు రూ. 8.78 లక్షలు, దివ్య సాషాకు రూ. 4.6 లక్షలు ఇచ్చినట్టు ప్రస్తావించారు. భార్య సంగీత ఆస్తులను రూ. 15.76 కోట్లుగా ప్రకటించారు. అందులో రూ. 15.51 కోట్ల చరాస్తులు, రూ. 25 లక్షల స్థిరాస్తులున్నాయి.

Related News

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

రన్నింగ్‌ బస్సులో జుట్టు పట్టుకొని కొట్టుకున్న లేడి కండక్టర్, మహిళా ప్యాసింజర్.. ఇదిగో వీడియో!

తమిళనాడులో వేడెక్కిన రాజకీయం.. సీఎం విజయ్‌కు బెదిరింపులు, డీఎంకె ఎమ్మెల్యే అరెస్ట్

ట్రీట్‌మెంట్‌కి వచ్చిన పేషెంట్.. ఫ్యాన్ చంపేసింది, ఆసుపత్రిలో ఆ రాత్రి ఏం జరిగిందంటే..

కేంద్రానికి ఆఖరి గడువు.. మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

Big Stories

Advertisement
×