Vijay Oath: తమిళనాడులో కొత్త ముఖ్యమంత్రిగా విజయ్ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారం ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం జరిగింది. ఆయనతోపాటు మరో 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినవారిలో ఉన్నారు. ఓ వైపు విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో స్టేడియం చప్పట్లో మార్మోగిపోయింది.
జోసఫ్ విజయ్ ఎనుం నాన్.. తమిళనాడు సీఎంగా
తమిళనాడులో దాదాపు ఆరు దశాబ్దాల తర్వాత డీఎంకె, అన్నాడీఎంకే పార్టీయేతర ప్రభుత్వం కొలువుదీరింది. ఈ మహోజ్వల ఘట్టానికి చెన్నైలోని నెహ్రూ స్టేడియం వేదికైంది.తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా టీవీకే పార్టీ అధినేత విజయ్ ప్రమాణ స్వీకారం ఆదివారం ఉదయం 10 గంటలకు చేశారు. గవర్నర్ ఆర్లేకర్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.
సి. జోసెఫ్ విజయ్ ఎన్నుమ్ నాన్ అని ప్రారంభించగానే జనం ఈలలు, చప్పట్లతో స్టేడియం మార్మోగిపోయింది. ప్రమాణ స్వీకారం తర్వాత ముఖ్యమంత్రిగా తొలి స్పీచ్ ఇచ్చారు. తాను రాజ కుటంబం నుంచి రాలేదని చెబుతూనే, దేవదూతను కాదన్నారు. తాను ఓ సాధారణ మనిషినని, మీలో ఒక్కడినని చెప్పారు.
తాము అధికారంలోకి వస్తే ఏమి చేయగలనో అదే మాట ఇచ్చానని, మిమ్మల్ని చూసిన తర్వాత ఏదైనా చేయగలననే నమ్మకం కలుగుతోందన్నారు. తమిళనాడు ప్రభుత్వం పారదర్శకమైన పాలన అందిస్తుందని, మీలో ఒక్కడిగా ఏ తప్పు చేయబోనని మనసులోని మాట బయటపెట్టారు.
ఈ కార్యక్రమానికి ప్రధాన హైలెట్‌గా రాహుల్‌గాంధీ, త్రిష
డైరెక్టర్ కుమారుడు ఇవాళ సీఎం అయ్యాడని చెప్పుకొచ్చారు సీఎం విజయ్. నేను మీ అందరివాడ్ని, ఎన్నో కష్టాలను అధిగమించి ఈ స్థాయికి వచ్చారని వివరించారు. నాకు ఆకలి-పేదరికం తెలుసని, కష్టాలను భరించి ఇక్కడ వరకు వచ్చానన్నారు. నన్ను ఎంతోమంది ఎన్నోరకాలుగా ఇబ్బంది పెట్టారని, అనుకున్న లక్ష్యాలను సాధిస్తామన్నారు. టీవీకేలో ఒకే ఒక అధికార కేంద్రం ఉందని, అది విజయ్ మాత్రమేనని అన్నారు.
తమిళనాడు ఇప్పుడు ప్రజా ప్రభుత్వం వచ్చిందని, హామీల అమలుకు కొంత సమయం ఇవ్వాలన్నారు. డీఎంకే ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి వెళ్లిందన్నారు. రాష్ట్రంలో లౌకిక, సామాజిక, న్యాయశకం మొదలైందన్నారు. సాధ్యమైనవే చెబుతామని, చెప్పిందే చేస్తామన్నారు. మిత్రులైనా, శత్రువులైనా అందరికీ ఒకటే చట్టమన్నారు. విజయ్ మామ విద్యార్థులకు అండగా ఉంటారన్నారు.
ALSO READ: తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం.. కేబినెట్‌లో వారికే చోటు, ఆ కీలక నేతలు ఎవరెవరంటే
ప్రభుత్వం ఏర్పాటుకు మద్దతు ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఖర్గే, రాహుల్ సహా కాంగ్రెస్ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. అదే సమయంలో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ఆయన తల్లిదండ్రులు ఆనంద భాష్పాలతో ఉబ్బితబ్బిబ్బయ్యారు.
ఆ సమయంలో విజయ్ కాస్త ఆవేశ భరితంగా మాట్లాడారు. ఈ కార్యక్రమానికి రాజకీయ, సినీ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, నటి త్రిష కృష్ణన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నీలిరంగు కంచి పట్టుచీర ధరించి జడలో మల్లెపూలు, వజ్రాలు, కెంపుల నెక్లెస్‌తో సాంప్రదాయ బద్ధంగా ముస్తాబై అందరి దృష్టిని ఆకర్షించింది. త్రిష వెంట ఆమె తల్లి ఉమా కృష్ణన్ కూడా ఉన్నారు.
BREAKING: Tamilaga Vettri Kazhagam (TVK) Chief C Joseph Vijay takes oath as the Chief Minister of Tamil Nadu. #CMJosephVijay pic.twitter.com/fVsNj9hqVN
— Actor Vijay Team (@ActorVijayTeam) May 10, 2026