E-Paper
Advertisement

Filmfare OTT Awards 2025 : ‘పాతాళ్ లోక్’ నుండి ‘పంచాయత్’ వరకు… ఫిల్మ్‌ఫేర్ ఓటీటీ అవార్డ్స్‌లో అత్యధిక నామినేషన్లను అందుకున్న సిరీస్ లు ఇవే

Filmfare OTT Awards 2025 : ‘పాతాళ్ లోక్’ నుండి ‘పంచాయత్’ వరకు… ఫిల్మ్‌ఫేర్ ఓటీటీ అవార్డ్స్‌లో అత్యధిక నామినేషన్లను అందుకున్న సిరీస్ లు ఇవే
Advertisement

Filmfare OTT Awards 2025 : ఫిల్మ్‌ఫేర్ ఓటీటీ అవార్డ్స్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతలో ఈ సంవత్సరం నామినేషన్ జాబితా కూడా వచ్చేసింది. అత్యధిక నామినేషన్లను అందుకున్న సిరీస్ లలో ‘పంచాయత్ సీజన్ 4’ ముందు వరుసలో ఉంది. ఈ అవార్డులు డిసెంబర్ 15న అందించనున్నారు. నామినేట్ అయిన సిరీస్‌ల వివరాలను తెలుసుకుందాం పదండి.

 అత్యధిక నామినేషన్ల జాబితాలో  ‘పంచాయత్ సీజన్ 4’

2025లో ఫిల్మ్‌ఫేర్ ఎక్కువ నామినేషన్లను పొందిన సిరీస్ గా ‘పంచాయత్ సీజన్ 4’ నిలిచింది. ఇది ఉత్తమ కామెడీ సిరీస్ కోసం పోటీలో ఉంది. చందన్ కుమార్ ఉత్తమ కథ, ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే రెండింటికీ నామినేషన్లు అందుకున్నారు. పెర్ఫార్మెన్స్ విభాగంలో జితేంద్ర కుమార్, యాదవ్ ఉత్తమ నటుడు కేటగిరీలో నామినేషన్లు అందుకున్నారు. నీనా గుప్తా, సునీతా రాజ్‌వర్ ఉత్తమ నటులుగా నామినేషన్లు అందుకున్నారు. సాన్విక ఉత్తమ సహాయ నటుడిగా నామినేట్ అయ్యారు. అనురాగ్ సైకియా ఉత్తమ ఒరిజినల్ సౌండ్‌ట్రాక్ నామినేషన్ అందుకున్నారు.

Advertisement

‘గ్రామ్ చికిత్సాలయ’ అనే హిందీ కామెడీ సిరీస్ కూడా నామినేషన్లలో సత్తా చాటుకుంది. ఇది ఉత్తమ కామెడీ సిరీస్‌కు నామినేషన్ అందుకోగా, అమోల్ పరాశర్ ఉత్తమ నటుడిగా, సహాయక మహిళా నటుల విభాగంలో, ఆకాంక్ష రంజన్ కపూర్, గరిమా విక్రాంత్ సింగ్ నామినేట్ అయ్యారు. చంద్రశేఖర్ ప్రజాపతి కూడా ఉత్తమ ఎడిటింగ్ కి నామినేషన్ అందుకున్నారు.

ఉత్తమ సిరీస్ కేటగిరి

‘బ్లాక్ వారెంట్’, ‘ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్’, ‘ఐసి 814: ది కాందహార్ హైజాక్’, ‘ఖౌఫ్’, ‘పాతాల్ లోక్ సీజన్ 2’, ‘ది హంట్: ది రాజీవ్ గాంధీ అస్సాసినేషన్ కేస్’ 2025 ఫిల్మ్‌ఫేర్ ఓటీటీ అవార్డ్స్ కోసం ఉత్తమ సిరీస్ విభాగంలో నామినేట్ అయ్యాయి.

ఉత్తమ దర్శకుడి కేటగిరి

Advertisement

అనుభవ్ సిన్హా – ‘ఐసి 814: ది కాందహార్ హైజాక్’, అవినాష్ అరుణ్ ధవారే – ‘పాతాల్ లోక్ సీజన్ 2’, నాగేష్ కుకునూర్ – ‘ది హంట్: ది రాజీవ్ గాంధీ అస్సాసినేషన్ కేస్’, నిఖిల్ అద్వానీ – ‘ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్’, పంకజ్ కుమార్’ సూర్య బాలకృష్ణన్ – ‘ఖౌఫ్’, పుష్కర్ సునీల్ ‘మహాబల్ – బ్లాక్’, విక్రమాదిత్య మోత్వానే – ‘బ్లాక్ వారెంట్’ ఉత్తమ దర్శకుడి సిరీస్‌గా నామినేట్ అయ్యాయి.

ఉత్తమ నటుడు కేటగిరి

అమిత్ సియాల్ (ది హంట్: ది రాజీవ్ గాంధీ అస్సాసినేషన్ కేసు), జైదీప్ అహ్లవత్ (పాతాళ్ లోక్ సీజన్ 2), కే కే మీనన్ (శేఖర్ హోమ్), రోషన్ మాథ్యూ (కంఖజురా), విజయ్ వర్మ (IC 814: ది కాందహార్ హైజాక్), జహాన్ కపూర్ (బ్లాక్ వారెంట్) ఉత్తమ నటుడు కేటగిరీలో నామినేషన్లు పొందారు.

 

Read Also : తండ్రి హత్య కేసులో కూతురి ఇన్వెస్టిగేషన్… అడుగడుగునా అవాంతరాలు… తమన్నా నటించిన తోపు సిరీస్

Related News

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక ఓటీటీ పార్టనర్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

ఆకాశంలోనే మిస్సయిన భారీ విమానం… దిమ్మతిరిగే మిలిటరీ ఇన్వెస్టిగేషన్

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

Big Stories

Advertisement
×