E-Paper
Advertisement

ట్యాక్సీ డ్రైవర్ తో కిల్లర్ రైడ్… కట్ చేస్తే కథ తారుమారు

ట్యాక్సీ డ్రైవర్ తో కిల్లర్ రైడ్… కట్ చేస్తే కథ తారుమారు
Advertisement

Korean Detective Thriller: హ్యాపీగా ఉంది అనుకున్న లైఫ్ లోకి సడన్ గా సైకో కిల్లర్ అడుగు పెడితే… ఒక్కసారిగా కథ తారుమారు అయితే… మామూలు ట్యాక్సీ డ్రైవర్ సైకోకే చెమటలు పట్టేలా చేస్తే… ఇలాంటి స్టోరీ లైన్ తో రూపొందిన క్రేజీ కొరియన్ సైకో థ్రిల్లరే ఈరోజు మన మూవీ సజెషన్. ఆ సిరీసే కొరియాకు చెందిన పాపులర్ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ ‘ఎ బ్లడీ లక్కీ డే’ (A Bloody Lucky Day). మరి ఈ సిరీస్ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? స్టోరీ ఏంటి ? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

ఈ సిరీస్ కథ సాదాసీదా టాక్సీ డ్రైవర్, కిరాతక సీరియల్ కిల్లర్ మధ్య ఒక రాత్రి వ్యవధిలో సాగే ప్రాణాంతక ప్రయాణం చుట్టూ తిరుగుతుంది. ఓ టాక్ (లీ సంగ్-మిన్) పీకల్లోతు అప్పుల్లో మునిగిపోయిన టాక్సీ డ్రైవర్. ఒకరోజు ఉదయం అతనికి పందులు కలలోకి రావడంతో, ఆరోజు తనకు బాగా కలిసివస్తుందని నమ్ముతాడు. అతను అనుకున్నట్లుగానే ఆ రోజంతా మంచి సంపాదన వస్తుంది. సరిగ్గా డ్యూటీ ముగించే సమయంలో గ్యుమ్ హ్యుక్-సూ (యూ యోన్-సియోక్) అనే ఒక వింత ప్రయాణికుడు అతని టాక్సీ ఎక్కుతాడు.

Advertisement

సియోల్ నుండి సుదూర తీరప్రాంత నగరం ‘మోక్పో’ వరకు నడపడానికి ఎవరూ ఊహించని విధంగా భారీ మొత్తాన్ని అంటే 1 మిలియన్ వోన్ ఆఫర్ చేస్తాడు.డబ్బు అవసరం ఉండడంతో ఓ టాక్ ఆ ప్రయాణానికి ఒప్పుకుంటాడు. కానీ ప్రయాణం మొదలైన కొంతసేపటికే, ఆ ప్యాసింజర్ సాధారణ వ్యక్తి కాదని, చట్టం నుండి తప్పించుకోవడానికి ఓడ ఎక్కేందుకు మోక్పో వెళ్తున్న సీరియల్ కిల్లర్ అని ఓ టాక్‌కు అర్థమవుతుంది. హ్యుక్-సూ తాను చేసిన దారుణమైన హత్యలను నవ్వుతూ టాక్సీ డ్రైవర్‌ కు వివరిస్తుంటాడు.

అదే సమయంలో హ్వాంగ్ సన్-గ్యు (లీ జంగ్-ఈన్) అనే ఒక తల్లి కథ కూడా ఎమోషనల్ గా సమాంతరంగా నడుస్తుంది. తన కొడుకును చంపింది హ్యుక్-సూనే అని గ్రహించి, పోలీసుల సాయం లేకుండా స్వయంగా అతడిని పట్టుకోవడానికి ఆమె ఆ టాక్సీని వెంటాడుతూ ఉంటుంది. కథ మధ్యలో వచ్చే ఊహించని మలుపుతో, ఈ ప్రయాణం ఓ టాక్ కుటుంబ సభ్యుల ప్రాణాల మీదకు తెస్తుంది. ఆ కిల్లర్ నుండి తన ప్రాణాలను కాపాడుకుంటూ, తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఆ టాక్సీ డ్రైవర్ ఎలాంటి ఎత్తుగడలు వేశాడనే ఉత్కంఠభరితమైన మైండ్ గేమ్‌తో మిగతా సిరీస్ సాగుతుంది. 10 ఎపిసోడ్ల ఈ సిరీస్ ప్రస్తుతం JioHotstar, Amazon Prime Videoలో అందుబాటులో ఉంది. తెలుగు ఆడియో లేదు, కానీ ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో చూడవచ్చు. కొరియన్ యాక్షన్ థ్రిల్లర్ ఇష్టపడేవారు మస్ట్ వాచ్.

Advertisement

Read Also: సైకో తమ్ముడి కోసం హాస్పిటల్ నే తగలబెట్టే నర్స్… ఐకానిక్ హర్రర్ సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్

Tags

Related News

ఆ ఊరిలో ప్రతి 10 ఏళ్లకో నరబలి… ఓటీటీలోకి అల్టిమేట్ డార్క్ థ్రిల్లర్… హనుమాన్ చాలీసాను పక్కన పెట్టుకుని చూడండి

లోకాన్ని నాశనం చేయాల్సిన విలన్ బాబు మిస్సింగ్… ఏంజెల్ డెమన్ల టెన్షన్ పీక్స్… మతిపోగొట్టే ఫ్యాంటసీ సిరీస్

తండ్రినే చంపాలని కూతురికి ఆర్డర్… మైండ్ బ్లాకింగ్ స్పై థ్రిల్లర్ సిరీస్

30 వేల ఏళ్లుగా నిద్రపోతున్న డెవిల్ ని గెలికింది… క్యూట్ ఫెయిరీ చేసిన పనికి వరల్డ్ కే వణుకు… ఈ ఫాంటసీ లవ్ కాంబో వేరే లెవెల్

కేస్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి లవ్ డ్రామా… డాక్టర్ తో ఫైర్‌ఫైటర్ రొమాంటిక్ లవ్ ట్రాక్

లండన్‌లో వడాపావ్ బిజినెస్‌తో కోట్ల సంపాదన… కానీ ఆ ఒక్క సీక్రెట్ బయటపడితే అంతా షెడ్డుకే

18 ఏళ్ల శత్రుత్వం… బద్దశత్రువుల ఇంట్లో పుట్టి ప్రేమలో పడే జంట… క్రేజీ కొరియన్ రొమాంటిక్ సిరీస్

24 ఏళ్లకే ఫార్ములా వన్ ప్రపంచ ఛాంపియన్… షుమాకర్ లెజెండ్ గా మారిన గూస్‌బంప్స్ మూమెంట్

Big Stories

Advertisement
×