E-Paper
Advertisement

With Love OTT: హీరోగా ‘టూరిస్ట్ ఫ్యామిలీ’డైరెక్టర్.. ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైన విత్ లవ్!

With Love OTT: హీరోగా ‘టూరిస్ట్ ఫ్యామిలీ’డైరెక్టర్.. ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైన విత్ లవ్!
Advertisement

With Love OTT: థియేటర్లలోకి వచ్చిన ఏ సినిమా అయినా సరే 8 వారాల లోపు ఓటీటీ డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా కొన్ని సినిమాలు నెలలోపే ఓటీటీ స్ట్రీమింగ్ కి వస్తే.. మరికొన్ని చిత్రాలు నేరుగా ఓటీటీలో విడుదలై సందడి చేసినవి కూడా ఉన్నాయి. ఇదిలా ఉండగా ఈ మధ్యకాలంలో దర్శకులు హీరోలుగా మారుతున్న వేళ అలా దర్శకుడిగా తన స్థానాన్ని పదిలం చేసుకొని.. ఇప్పుడు హీరోగా ఇండస్ట్రీకి పరిచయమై తన సినిమాతో వెండితెరపై సందడి చేసి ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధమయ్యారు. ఆయన ఎవరో కాదు ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ప్రముఖ దర్శకుడు అభిషణ్ జీవింత్ (Abishan jeevinth).

ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధం అయిన విత్ లవ్..

టూరిస్ట్ ఫ్యామిలీ చిత్రంతో దర్శకుడిగా మంచి పేరు దక్కించుకున్న ఈయన.. విత్ లవ్(With love) అనే చిత్రంతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యారు. అనస్వర రాజన్ హీరోయిన్ గా మదన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఒక ఆసక్తికరమైన కథ నేపథ్యంలో సాగుతుంది. బ్లైండ్ డేట్ లో కలిసిన ఇద్దరు వ్యక్తులు.. తాము ఒకే స్కూల్లో చదువుకున్నామని తెలుసుకోవడం, అక్కడి నుంచి పాత జ్ఞాపకాలను స్కూల్ రోజులను నెమరు వేసుకుంటూ సాగే ప్రయాణం ప్రేక్షకులకు ఒక కొత్త ఫ్రెష్ ఫీలింగ్ ని అందించింది. కేవలం 7 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూలు రాబట్టి బ్లాక్ బాస్టర్ గా నిలిచింది.అలాంటి ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధం అయ్యింది.

స్ట్రీమింగ్ డేట్ లాక్..

Advertisement

ఈ మేరకు చిత్ర బృందం అభిమానులతో ఈ విషయాన్ని పంచుకుంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకోగా.. మార్చి 6వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి రాబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. కేవలం తమిళ్లోనే కాకుండా తెలుగు, కన్నడ ,మలయాళం భాషల్లో కూడా ఈ సినిమా అందుబాటులోకి రానుండడం విశేషం. మొత్తానికైతే థియేటర్లలో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న విత్ లవ్ మూవీ ఇప్పుడు థియేటర్లలో ఆడియన్స్ ను ఏ విధంగా మెప్పిస్తుందో చూడాలి.

ALSO READ:Funky Film: విశ్వక్ సేన్ ఫంకీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్!

అభిషన్ జీవింత్ వ్యక్తిగత జీవితం..

Advertisement

ఇకపోతే దర్శకుడిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి మంచి విజయాన్ని అందుకున్న ఈయన.. గత ఏడాది నవంబర్లో ఒక ఇంటివాడయ్యాడు. తన స్నేహితురాలు అఖిలను ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం చెన్నైలో ఘనంగా జరిగింది మొత్తానికైతే అటు వైవాహికంగా ఇటు వ్యక్తిగతంగా సక్సెస్ అందుకుంటూ బిజీగా మారిపోయారు అభిషణ్.

Related News

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

బాడీ షేమింగ్‌ చేస్తూ వేధించిన అమ్మాయిలు… వాళ్లను కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని చూసి కూడా నోరు మెదపని బాధితురాలు! స్పానిష్‌ రివెంజ్‌ థ్రిల్లర్‌

గేమ్‌ ఆడితే మెదడునే కంట్రోల్‌ చేసే డేంజరస్ టెక్నాలజీ… సైకలాజికల్‌ సైఫై థ్రిల్లర్‌ ఓటీటీలోకి

Big Stories

Advertisement
×