E-Paper
Advertisement

Funky Film: విశ్వక్ సేన్ ఫంకీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్!

Funky Film: విశ్వక్ సేన్ ఫంకీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్!
Advertisement

Funky Film:మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak sen) గురించి పరిచయాలు అవసరం లేదు. విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ ఊహించని ఇమేజ్ సొంతం చేసుకుంటున్నారు. ఒకప్పుడు తన మాస్ పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన విశ్వక్ సేన్.. ఇటీవల ఫంకీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. కానీ అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

కామెడీకి పెద్దపీట వేసిన ఫంకీ..

‘జాతి రత్నాలు’ సినిమాతో దర్శకుడిగా పేరు సంపాదించుకున్న కేవీ అనుదీప్ (KV Anudeep) దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా, కయాదు లోహర్(Kayadu Lohar) హీరోయిన్గా తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ఫంకీ.. లవర్స్ డే సందర్భంగా ఒకరోజు ముందుగానే అనగా ఫిబ్రవరి 13న థియేటర్లలోకి వచ్చింది. వినోదం నేపథ్యంలో రూపొందిన ఒక వర్గం ఆడియన్స్ ను పెద్దగా మెప్పించలేదు. దాంతో యావరేజ్ హిట్ సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ సినిమా విడుదలకు ముందు నుంచే ఈ చిత్రం నిర్మాత సూర్యదేవర నాగవంశీ కథ, లాజిక్ వంటి అంశాలను చూడకుండా.. కేవలం నవ్వుకోడానికి మాత్రమే సినిమాకు రావాలని ఆయన సినిమా ప్రమోషన్స్ లోనే తెలిపారు. అన్నట్టుగానే నవ్వుకోవడానికి ఈ సినిమా బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైన ఫంకీ..

Advertisement

ఇకపోతే ఈ సినిమాకు విశ్వక్ మార్క్ కామెడీ, యాక్షన్ ఎపిసోడ్స్, హీరోయిన్ గ్లామర్, అనుదీప్ స్టైల్ డైలాగులు సినిమాకు హైలెట్గా నిలిచాయి. కథ పెద్దగా లేకపోయినా ఎంటర్టైన్మెంట్ విషయంలో మాత్రం ఈ సినిమా బాగుంది. అలాంటి ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధం అయ్యింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను ఫ్యాన్సీ ధరకు సొంతం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ALSO READ:OTT Movie : హర్రర్ నుంచి రొమాన్స్ వరకు… ఈ వారం ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన మలయాళ సినిమాలు ఇవే

స్ట్రీమింగ్ అప్పుడే..

Advertisement

ఈ నేపథ్యంలోనే మార్చి 12 లేదా 13వ తేదీలలో ఓటీటీ స్ట్రీమింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం. అయితే త్వరలోనే దీనిపై నెట్ ఫ్లిక్స్ నుంచి అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇక ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియో సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాగావంశీ, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. సంపత్ రాజు, మురళీధర్ గౌడ్ , వీటీవీ గణేష్, నరేష్ తదితరులు కీలకపాత్రలో నటించిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. ఫంకీ సినిమాతో విశ్వక్సేన్ థియేటర్లలో పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోయారు. మరి ఓటీటీలోనైనా ఈ సినిమా మంచి రేటింగ్ సొంతం చేసుకుంటుందేమో చూడాలి.

విశ్వక్ సేన్ తదుపరి సినిమాలు..

విశ్వక్ సేన్ తదుపరి సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఈయన హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ కల్ట్ లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి విశ్వక్ స్వయంగా దర్శకత్వం వహిస్తూ ఉండడం గమనార్హం.ఇటీవల విడుదలైన టీజర్ కి మంచి రెస్పాన్స్ లభించింది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ చిత్రం. మరోవైపు ప్రముఖ డైరెక్టర్ కం హీరో తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ‘ఈ నగరానికి ఏమైంది? సీక్వెల్ లో విశ్వక్ నటిస్తున్నారు. అలాగే మరొకవైపు తన తోటి నటీనటుల చిత్రాలకు గెస్ట్ గా విచ్చేసి సందడి చేస్తున్నారు. మరి ఈ సినిమాలతో విశ్వక్ ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటారో చూడాలి.

Related News

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

బాడీ షేమింగ్‌ చేస్తూ వేధించిన అమ్మాయిలు… వాళ్లను కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని చూసి కూడా నోరు మెదపని బాధితురాలు! స్పానిష్‌ రివెంజ్‌ థ్రిల్లర్‌

గేమ్‌ ఆడితే మెదడునే కంట్రోల్‌ చేసే డేంజరస్ టెక్నాలజీ… సైకలాజికల్‌ సైఫై థ్రిల్లర్‌ ఓటీటీలోకి

Big Stories

Advertisement
×